English | Telugu
అల్లు అర్జున్ గురించి బాలయ్య ఏమన్నారంటే..
Updated : Aug 26, 2023
తెలుగు సినిమాకు లెక్కకు మించిన నేషనల్ అవార్డులు రావడంతో టాలీవుడ్‌లో అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇన్నేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరికీ సాధ్యపడని దాన్ని అల్లు అర్జున్ సుసాధ్యం చేసి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అతనిపై అభినందనల వర్షం కురుస్తోంది. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమనటుడుగా నేషనల్ అవార్డు గెలుచుకోం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపిక కావడం ఇవన్నీ ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని అందించాయి. ఒకప్పుడు నేషనల్ అవార్డులంటే కొన్ని భాషలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఈ సంవత్సరం సాధించిన అవార్డులతో తెలుగు సినిమా సత్తా ఏమిటి అనేది ప్రపంచానికి చాటి చెప్పారు. అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.