English | Telugu

పాదాభివందనంతో గురుభక్తిని చాటుకున్న దేవి

డైరెక్టర్‌కి, మ్యూజిక్‌ డైరెక్టర్‌కి మధ్య మంచి అండర్‌స్టాండిరగ్‌ ఉంటే మ్యూజికల్‌ హిట్స్‌ వస్తాయని సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ ప్రూవ్‌ చేశారు. తన మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు దేవిశ్రీప్రసాద్‌ తప్ప మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వలేదు సుకుమార్‌. అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వీరిద్దరూ చేసిన ‘ఆర్య’, ‘ఆర్య2’, ‘పుష్ప’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించారు. అలాంటి మంచి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాకి మ్యూజిక్‌ పరంగా నేషనల్‌ అవార్డు వస్తే.. ఆ ఆనందం మామూలుగా ఉండదు. ‘పుష్ప’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడుగా నేషనల్‌ అవార్డు గెలుచుకున్న దేవిశ్రీప్రసాద్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సంతోషకరమైన విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నాడు దేవి. తనకు అవార్డు వచ్చిన విషయాన్ని మొదటి తన తల్లికి చెప్పిన దేవి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత తన సంగీత గురువైన మాండలిన్‌ శ్రీనివాస్‌ అన్నయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఇక తను దైవ సమానుడుగా భావించే ఇళయరాజాను కలిసేందుకు ఈరోజు చెన్నై వెళ్ళాడు దేవి. ఇళయరాజాకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు అవార్డు వచ్చిన విషయాన్ని చెప్పాడు. దేవిశ్రీప్రసాద్‌తో ఎంతో ప్రేమగా మాట్లాడి అభినందించారు ఇళయరాజా. కొంత సేపు ఆయనతో గడిపిన దేవి ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నేషనల్‌ అవార్డు ప్రకటించిన తర్వాత నా దేవుడు ఇళయరాజాను కలుసుకున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నేషనల్‌ అవార్డు వరకు నడిపించింది’ అంటూ ఇళయరాజాను కలిసిన ఆనందాన్ని పంచుకున్నారు నేషనల్‌ అవార్డు విన్నర్‌ దేవిశ్రీప్రసాద్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.