English | Telugu

'జైలర్'పై జనాలకి ఎంత ప్రేమో.. 16 రోజుల్లో ఎంత లాభమిచ్చారో తెలుసా!


సూపర్ స్టార్ రజినీకాంత్ దెబ్బకి.. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ అబ్బా అంటోంది. తలైవా తాజా చిత్రం 'జైలర్' జనం మందుకొచ్చి రెండు వారాలు దాటినా.. వసూళ్ళ జోరు మాత్రం ఇంకా తగ్గకపోవడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జైలర్'.. ఈ శుక్రవారంతో 16 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ 16 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 74. 55కోట్ల గ్రాస్ ని ఆర్జించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 547. 25 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అలాగే, ఇప్పటివరకు రూ. 143.60 కోట్లకి పైగా లాభాలు చూసి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా ట్రేడ్ రికార్డులకెక్కింది.

'జైలర్' 16 రోజులకలెక్షన్స్ వివరాలు:

తమిళనాడు – రూ. 162.05 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 74.55 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 64.10 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 49.80 కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 14.20 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 182.55 కోట్ల గ్రాస్

ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల కలెక్షన్స్ – రూ. 547.25 కోట్ల గ్రాస్ (రూ. 267.60 కోట్ల షేర్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.