English | Telugu
'స్కంద' ట్రైలర్: ఇయ్యాలే.. పోయాలే.. గట్టిగా అరిస్తే తోయాలే.. అడ్డమొస్తే లేపాలే.. !
Updated : Aug 26, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం 'స్కంద'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని శనివారం హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యమిస్తూ బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ లో రామ్ నోట పలికిన డైలాగులతో పాటు ముఖ్య పాత్రలు చెప్పిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. "ఇయ్యాలే.. పోయాలే.. గట్టిగా అరిస్తే తోయాలే.. అడ్డమొస్తే లేపాలే.. " అంటూ చెప్పే రామ్ డైలాగ్ ఓ హైలైట్ గా నిలవగా.. "కొడుకంటే కొరివిపెట్టే వాడు కాదు, పరువు నిలబెట్టేవాడు" వంటి శక్తిమంతమైనమాటలు కూడా ట్రైలర్ లో జొప్పించారు. ఓవరాల్ గా.. 'స్కంద' ఇటు మాస్ కి, అటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తోనే రూపొందింది. మరి.. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన 'స్కంద' సినిమాగానూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.
'స్కంద'లో రామ్ సరసన శ్రీలీల, సయీ మంజ్రేకర్ నటించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.