English | Telugu
'స్కంద' ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!
Updated : Aug 26, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రం 'స్కంద'. ఇందులో రామ్ కి జోడీగా క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు (ఆగస్టు 26) 'స్కంద' ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన యూనిట్.. టైమ్ మాత్రం ఫిక్స్ చేయలేదు. తాజాగా రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కాగా, ప్రస్తుతం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.