English | Telugu

బాబాయ్ నోట అబ్బాయ్ మాట!

సినిమా వేడుక ఏదైనా ఆ వేడుకకు హాజరైన అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ తరచూ చెప్పే మాట "మీ కోసం మిమ్మల్నే నమ్ముకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి". ఇప్పుడు ఈ మాట బాబాయ్ బాలకృష్ణ నోటి నుంచి కూడా వచ్చింది.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'స్కంద'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'స్కంద' వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వేడుకలో అభిమానులను ఉద్దేశించి బాలయ్య మాట్లాడిన మాటలు అబ్బాయ్ తారక్ ని గుర్తు చేశాయి. "చాలా దూరం నుండి, బయట ఊళ్ళ నుండి కూడా వచ్చి ఉంటారు. అక్కడ మీ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి." అని బాలయ్య అన్నారు. అభిమానుల కోలాహలం చూసి ఆనందపడి అక్కడితో ఆగకుండా.. వారి క్షేమం కోరుతూ బాలయ్య మాట్లాడిన మాటలు హత్తుకున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.