English | Telugu
ఫ్రస్ట్రేషన్ లో విజయ్ దేవరకొండ.. చూస్తుండిపోయిన సమంత.. !
Updated : Aug 26, 2023
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఖుషి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. 'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా.. అన్ని కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో.. శనివారం (ఆగస్టు 26) ఐదో పాటని రిలీజ్ చేసింది యూనిట్. "ఓసి పెళ్ళామా" అంటూ మొదలయ్యే ఈ పాటలో ఫ్రస్ట్రేటేడ్ హజ్బెండ్గా విజయ్ దేవరకొండ కనిపించారు. పార్టీ నేపథ్యంలో సాగే ఈ సాంగ్ లో విజయ్ తన బాధను వ్యక్తం చేస్తుంటే.. సామ్ మాత్రం సీరియస్ గా చూస్తూ కనిపించింది. ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యమందించగా.. రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ గాత్రమందించారు. మొత్తమ్మీద.. "ఓసి పెళ్ళామా" గీతం'ఖుషి' నుంచి వచ్చినమరో చార్ట్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 1న 'ఖుషి' జనం ముందుకు రానుంది.