English | Telugu

'బాహుబలి-2' ప్లేస్ కి ఎసరు!

బాలీవుడ్ చిత్రాలకు కూడా సాధ్యంకాని విధంగా హిందీ వెర్షన్ పరంగా రూ.500 కోట్ల నెట్ మార్క్ ని అందుకున్న మొదటి చిత్రంగా 'బాహుబలి-2' అరుదైన ఘనతను సాధించింది. 2017 లో విడుదలైన 'బాహుబలి-2' రూ.511 కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ లో నిలవగా, ఆ రికార్డు బ్రేక్ అవ్వడానికి ఏకంగా ఆరేళ్ళు పట్టింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'పఠాన్' రూ.543 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ ప్లేస్ లోకి రావడంతో.. 'బాహుబలి-2' రెండో ప్లేస్ కి పడిపోయింది. అయితే రెండో స్థానానికి కూడా ఎసరు పడేలా ఉంది.

సన్నీ డియోల్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ 'గదర్-2' ఆగస్టు 11న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. 16 రోజుల్లోనే రూ.440 కోట్ల నెట్ వసూలు చేయడంతో.. దంగల్(రూ.387 కోట్ల నెట్), కేజీఎఫ్-2(రూ.435 కోట్ల నెట్) చిత్రాలను దాటేసి మూడో స్థానంలో నిలిచింది. 'గదర్-2' జోరు చూస్తుంటే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి, 'బాహుబలి-2'ని కూడా దాటేసి రెండో స్థానానికి చేరేలా ఉంది. మరి ఫుల్ రన్ లో 'గదర్-2' ఎన్ని కోట్ల నెట్ వసూలు చేస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.