English | Telugu
ఆయనకి పదమైనా లొంగుద్ది.. పాత్రైనా లొంగుద్ది.. దటీజ్ బాలయ్య!
Updated : Aug 26, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుది హ్యాట్రిక్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ అనుబంధం నేపథ్యంలోనే.. బోయపాటి కొత్త చిత్రం 'స్కంద'కి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ కి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా బాలయ్యపై ప్రశంసలు కురిపించారు బోయపాటి. "కొంతమంది వ్యక్తులు కాదు.. శక్తులు. ఆ శక్తే బాలయ్య. ఎందుకో చెబుతాను.. ఆయనకి ఒక పదమైనా లొంగుద్ది.. పాత్రైనా లొంగుద్ది.. ఒక పాత్ర క్రియేట్ చేసి ఇస్తే దానికి ఏ ఆర్టిస్ట్ అయినా బానిస. ప్రతి ఆర్టిస్ట్ దానికి లొంగిపోయి అందులో ప్రవేశిస్తారు.. మరీముఖ్యంగా.. బాలయ్య. అందుకే బాలయ్య.. దటీజ్ బాలయ్య.. జై బాలయ్య" అంటూ పొగిడారు. "బాలయ్య ఆశీర్వాదంలో మన హితమే కాదు.. జన హితం కూడా ఉంటుంది. స్కంద వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా రావడం అదృష్టం" అంటూ చెప్పుకొచ్చారు.