English | Telugu
'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
Updated : Aug 27, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళ ఫిల్మ్ 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదలై మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఆదరణ నోచుకోనప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానుంది.
ఈమధ్య హిట్ సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ డిజాస్టర్ గా నిలిచిన భోళా శంకర్ మాత్రం ఐదు వారాల తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి ఈ సినిమాకి ఓటీటీలోనైనా ఆదరణ లభిస్తుందేమో చూడాలి.