English | Telugu

ర‌జినీకి నో చెప్పిన శ‌ర్వా.. సీన్‌లోకి మ‌రో టాలీవుడ్ స్టార్‌

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైల‌ర్ స‌క్సెస్ కిక్ మీదున్నారు. ఏకంగా ఆయ‌న సినిమా రూ.600 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో ఆయ‌న నెక్ట్స్ మూవీస్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించిన లాల్ స‌లాం సినిమా ఈ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇక ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న మ‌రో భారీ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. త‌లైవాతో పాటు బిగ్ బీ ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. ఇందులో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్‌తో పాటు మంజు వారియ‌ర్ కూడా న‌టిస్తుంది. వీరంద‌రూ కాకుండా తెలుగు నుంచి ఓ హీరోను న‌టింప చేయ‌టానికి మేక‌ర్స్ చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అక్షరాలా రూ. 100 కోట్ల నష్టం.. మెగా కాంపౌండ్ లేటెస్ట్ రికార్డ్!

కేంద్రప్రభుత్వం కొద్ది రోజుల క్రిందట ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. గమ్మత్తేమిటంటే.. అందులో మెగా కాంపౌండ్ హీరోల టచ్ ఉన్న సినిమాలదే హవా. అంతెందుకు.. ఈ ఏడాది ప్రథమార్ధంలో వసూళ్ళ వర్షం కురిపించిన సినిమాల్లోనూ అదే క్యాంప్ సందడి బాగా కనిపించింది. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అంటూ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ముంగిట వీరవిహారం చేస్తే.. వేసవికి వచ్చిన 'విరూపాక్ష'తో 'సుప్రీమ్' హీరో సాయితేజ్ కూడా అదిరిపోయే హిట్టు పట్టాడు. అయితే ఈ విజయాల ముచ్చట అంతా ఆవిరైపోతోంది.. ఆ కాంపౌండ్ నుంచి వస్తున్న వరుస డిజాస్టర్స్ చూస్తుంటే..