English | Telugu

‘బలగం’ టీమ్‌లో విషాద ఛాయలు!

ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బలగం మూవీ గురించి మనందరికీ తెలుసు. ఎన్నో ఇంటర్నేషనల్  అవార్డులను ఈ మూవీ సొంతం చేసుకుంది. మంచి  కంటెంట్  తో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.   జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐతే  ఈ మూవీలో నటించిన ఒక  నటుడు ఇటీవల మృతి చెందారు. డైరెక్టర్ వేణు  సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుని  ఎమోషల్ అయ్యారు. బలగం మూవీలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పారు డైరెక్టర్ వేణు.

రక్తపాతాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్!

ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆయన రేంజ్ కి తగ్గ హైప్ వచ్చిన సినిమా అంటే 'ఓజీ' అని చెప్పొచ్చు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై ప్రకటన నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన గ్లింప్స్ తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. పవర్ స్టార్ పూర్తిస్థాయిలో వయలెంట్ గా మారితే ఎలా ఉంటుందో చూపించడం కోసం శాంపిల్ గా గ్లింప్స్ ని వదిలినట్లుంది. "అతను నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాను కడగలేకపోయింది" అంటూ పవన్ పాత్రని ఎలివేట్ చేసిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.