English | Telugu
తమిళనాడులో ‘జవాన్’పై వ్యతిరేకత.. ‘బాయ్ కాట్ జవాన్’ అంటూ నినాదాలు
Updated : Sep 6, 2023
ఈమధ్యకాలంలో ఏ బాలీవుడ్ సినిమాకీ సౌత్‌లో రాని హైప్ షారుక్ ఖాన్ ‘జవాన్’కి వచ్చింది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీగానే అమ్ముడుపోయాయి.ఈ సినిమా ఓపెనింగ్స్‌తోనే కొత్త రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి ఓ కొత్త సమస్య వచ్చి పడిరది. ‘జవాన్’ చిత్రాన్ని తమిళనాడులో బ్యాన్ చెయ్యాలంటూ సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకిస్తున్నారు.
దీనికి కారణం ఈ సినిమా తమిళనాడు హక్కులను ఉదయనిధి స్టాలిన్ కొనుగోలు చేశారు. ఇటీవల ఎస్‌సి, ఎస్‌టిల స్పెషల్ రైట్స్ గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఉదయనిధిని ఒక వర్గంవారు టార్గెట్ చేశారు. అతను చేసిన సినిమాలు, అతను విడుదల చేసే సినిమాల ప్రదర్శన నిలిపి వేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న విడుదల కానున్న ‘జవాన్’ చిత్రాన్ని తమిళనాడులోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. మరి ఈ పరిస్థితిలో తమిళనాడులో ‘జవాన్’ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.