English | Telugu

సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటున పోయే మతి.. శ్రీలీల అం(ఉం)టే అంతేమరి!

శ్రీలీల.. ఈతరం కుర్రకారు కలలరాణి. వరుస విజయాలతో, వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ.. ఐదు నెలల పాటు వరుసగా ఐదు చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. రీసెంట్ గా ఆయా చిత్రాల ఫస్ట్ సింగిల్స్ యూట్యూబ్ ముంగిట హల్ చల్ చేస్తున్నాయి కూడా. ఈ క్రమంలోనే.. మరో ఫస్ట్ సింగిల్ తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది ఈ 'ధమాకా' భామ.

ఆ వివరాల్లోకి వెళితే.. 'ఉప్పెన' స్టార్ వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. 'ఆది కేశవ' పేరుతో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి రూపొందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. ప్రముఖ తమిళ స్వరకర్త జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా "సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటున పోయే మతి" అంటూ మొదలయ్యే పాటని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. ఆ పాట ఎలా ఉండబోతోందోచెప్పే ప్రయత్నంగా బుధవారం (సెప్టెంబర్ 6) ప్రోమో రిలీజ్ చేశారు. ట్యూన్, లిరిక్స్, విజువల్స్, వోకల్స్.. వెరసి ఈ పాట ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి. మరి.. ప్రోమోగా ఎంటర్టైన్ చేసిన "సిత్తరాల సిత్రావతి"..ఫుల్ సాంగ్ గానూ మురిపిస్తుందేమో చూడాలి.

కాగా, ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా గానం చేయగా.. రామజోగయ్య శాస్త్రి పదరచన చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.