English | Telugu

‘పుష్ప 2’ నుంచి ఫోటో లీక్ లీక్.. వందకు పైగా లారీలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా సుకుమార్ సినిమాను ప్లాన్ చేశారు. అందులో మొదటి భాగంగా ‘పుష్ప ది రైజ్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఇది ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేయటంతో పాటు అల్లు అర్జున్ డాన్స్, మేనరిజమ్ తెగ వైరల్ అయ్యింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం రీల్స్ చేయటంతో పుష్ప సినిమా క్రేజ్ పీక్స్‌కి చేరుకుంది. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రివ్యూ: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి

2020లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత సినిమా చేయని అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో మళ్ళీ పేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ‘జాతిరత్నాలు’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఈ సినిమాతో ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వచ్చాడు నవీన్‌ పొలిశెట్టి. వీరిద్దరి రేర్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం సహజం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య గురువారం విడుదలైన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్‌ అయ్యిందీ, ఏ మేరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసింది అనే విషయాలను సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.