English | Telugu
ఐదో రోజు పరిస్థితి దారుణం.. కోలుకోవడం కష్టమే!
Updated : Sep 6, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లతో సత్తా చాటింది. అయితే నాలుగో రోజైన సోమవారం నాడు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇక ఐదో రోజు ఆ డ్రాప్ మరింత కనిపించింది. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని కూడా.. బయ్యర్లకు నష్టాలను మిగిల్చేలా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.9.87 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.36 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.68 కోట్ల షేర్ రాబట్టి జోరు చూపించిన ఖుషి.. నాలుగో రోజు నుంచి వెనకబడిపోయింది. నాలుగో రోజు రూ.1.05 కోట్ల షేర్ రాబట్టగా.. ఐదో రోజు రూ.75 లక్షల షేర్ కే పరిమితమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రూ.22.71 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే ఐదు రోజుల్లో నైజాంలో రూ.12.27 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.16 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.8.28 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.5.54 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.8.05 కోట్ల షేర్ కలిపి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.36.30 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖుషి మూవీ.. మొదటి రోజు రూ.15.37 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.46 కోట్ల షేర్, మూడో రోజు రూ.8.73 కోట్ల షేర్, నాలుగో రోజు రూ. 2.33 కోట్ల షేర్, ఐదో రోజు రూ.1.41 కోట్ల షేర్ తో.. ఐదు రోజుల్లో రూ.36.30 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.17 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ నాలుగో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దానికి తోడు రేపు(సెప్టెంబర్ 7న) 'జవాన్', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో ఖుషి కలెక్షన్లు మరింత పడిపోయే అవకాశముంది. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ఖుషి బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అనిపిస్తోంది.
'ఖుషి' 5 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.12.27 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.16 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.8.28 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.22.71 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ.5.54 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.8.05 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్స్ : రూ.36.30 కోట్ల షేర్