English | Telugu
‘బేబీ’ లక్కే వేరు.. ఆ(మె) లెక్కే వేరు!
Updated : Sep 6, 2023
ఒక సినిమా విజయం సాధించాలంటే దానికి ప్రత్యేకమైన ఫార్ములా అంటూ ఏమీ లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విషయం ఉంటే పెద్ద హిట్ అవుతుంది. అది ఈమధ్య చాలా సినిమాలతో ప్రూవ్ అయింది. కొన్ని చిన్న సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధిస్తాయి. ఆ సినిమాతో ఆర్టిస్టులుగానీ, టెక్నీషియన్స్‌గానీ ఎక్కడికో వెళ్లిపోతారు. ఉదాహరణగా చెప్పాలంటే ‘బేబి’ సినిమా చిత్రం. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఆమె అందం, అభినయం అందర్నీ కట్టిపడేసింది. ‘బేబి’ సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా ఆమె తదుపరి ఏ సినిమా చేస్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇంతవరకు ఆమె రెండో సినిమా ఎందుకు ఎనౌన్స్ చేయలేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ప్రతి సినిమాని ఒప్పేసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం వైష్ణవికి లేదని తెలుస్తోంది. తనకు వచ్చిన అవకాశాల్లోనే మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటివరకు రెండు సినిమాలు ఓకే చేసిందని తెలుస్తోంది. ఆ రెండూ ఒక రేంజ్ సినిమాలే కావడం విశేషం.
వైష్ణవి ఓకే సినిమాల్లో ఒకటి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే చిత్రం కాగా, దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయబోతోందదది. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ ఈ సినిమాలో హీరో. అరుణ్ భీమవరపు దర్శకుడు. మొదటి సినిమా హిట్ అవ్వడంతో అన్ని సినిమాలు ఒప్పేసుకొని కెరీర్‌ని పాడు చేసుకోకుండా చక్కని ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న వైష్ణవికి హీరోయిన్‌గా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించవచ్చు.