English | Telugu
డిజాస్టర్ కా బాప్ 'గాండీవధారి అర్జున'.. ఇంత నష్టమంటే మాటలా..
Updated : Sep 6, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఈ మధ్య టైం అస్సలు బాగుండడం లేదు. 'గద్దలకొండ గణేశ్' వంటి హిట్ మూవీ తరువాత తన నుంచి వచ్చిన 'గని' బాక్సాఫీస్ ముంగిట తుస్సుమంది. ఇక విక్టరీ వెంకటేశ్ తో చేసిన 'ఎఫ్ 3' కూడా.. 'ఎఫ్ 2' లాగా మ్యాజిక్ చేయలేకపోయింది. దాంతో సోసో రిజల్ట్ చూసిందీ సదరు సీక్వెల్. ఇక వరుణ్ లేటెస్ట్ మూవీ 'గాండీవధారి అర్జున' ఫలితమైతే దారుణాతి దారుణంగా ఉందనే చెప్పాలి.
ఆగస్టు 25న 'బెదురులంక 2012'తో పాటు రిలీజైన 'గాండీవధారి అర్జున'.. తొలి రోజు నుంచే వసూళ్ళ పరంగా నిరాశపరుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. తొలి వారాంతంలో వచ్చే శని, ఆది వారాల్లో సైతం మెరుపులు చూపించలేకపోయింది. రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ తో బరిలోకి దిగిన 'గాండీవధారి అర్జున'.. ఓవరాల్ గా రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే ఆర్జించింది. ఫైనల్ గా.. రూ. 16. 5 కోట్ల నష్టం చూసింది. ఏదేమైనా 10 శాతం రికవరీ కూడా లేకుండా.. ఇంత నష్టమంటే మాటలు కాదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి.. రాబోయే చిత్రాలతోనైనా వరుణ్ తేజ్.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.