జనం..ప్రభం‘జనం’..లోకేష్ పాదయాత్ర@100 డేస్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారం నాటికరి ( మే 15)కి వంద రోజుల ల్యాండ్ మార్క్ కు చేరుకుంది. కుప్పం నుంచి ప్రారంభించిన ఆయన పాదయాత్ర ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా 4 వేల కిలోమీటర్ల,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు వంద రోజులకు చేరుకుంది. మరో మూడోందల రోజులు కూడా సాగుతుంది. వాస్తవానికి ఆయన ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కదా.
రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఆధునిక (మోడరన్) రావణుడు ఒక్క ఛాన్స్ పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే మోడరన్ రావణాసుల పాలన అంతమొందించాలన్న సంకల్పంతో లోకేష్, యువగళం పాదయాత్ర చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతోంది. ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కొంటున్నారు. అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో ..01 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేశారు. ఆయన మైక్ లాగేసుకున్నారు. జనాలను ఆయన పాదయాత్రలో అడుగు కలపకుండా ఎన్ని చేయాలో అన్నీ చేసింది జగన్ ప్రభుత్వం.అన్నిటినీ అధిగమించి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఆయన యాత్రకు అవరోధాలు కల్పిస్తునే ఉంది. అయితే పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగుతున్నారు.. లోకేష్ కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని పాదయాత్ర ప్రారంభించడానికి ముందే తెలుసు. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ లోకేష్ మహాసాహసం చేస్తున్నారన్న విషయం తెలుసు. అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో .. లోకేష్ తన పాదయాత్ర సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రజాభిమానం చెలియలకట్ట తెంచుకుని మరీ ఉప్పెనలా ఉప్పొంగుతోంది. ప్రజల దీవెనలతో దిగ్విజయంగా సాగుతోంది. లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.
అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పపండం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఎంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్ మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేర్తే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు. చంద్రబాబు దంపతులు. అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి 400 రోజులు దూరంగా ఉండడం లోకేష్ కు ఎంత కష్టమో బ్రాహ్మణి, దేవాన్ష్ కు అంతకు మించిన బాధ. అయినా రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం లోకేష్ సుదీర్గ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన లోకేష్ కు ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష. ప్రజాభిమానమే కొండంత అండ. ఇక ఆయన అకుంఠిత దీక్షతో పాదయాత్ర కొనసాగిస్తున్న తీరు చూస్తే.. ఔరా అనిపించకమానదు. ప్రతి రోజూ.. తెల్లవారు జామున మొదలు పెట్టి రాత్రి పదకొండు గంటల వరకూ అలుపెరుగని శ్రమ. గంట పాటు సెల్ఫీలు, ప్రతీ చోటా సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎక్కడికక్కడ నాయకులతో సమాలోచనలు . వంద రోజులుగా లోకేష్ దినచర్య ఇదే. ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి వైసీపీ పడిన తాపత్రేయం అపహాస్యం పాలైంది. ఆయన ప్రసంగంలో ఎక్కడైనా మాట తడబడితే దాన్ని ఆధారం చేసుకుని ట్రోల్ చేసేందుకు అలా వైసీపీ సోషల్ మీడియాడేగ కన్నుతో ఎదురు చూస్తూనే ఉంది. లోకేష్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అవసవ్య మాటలు మాట్లాడిందో అందరికీ తెలుసు. చివరికి బాడీ షేమింగ్ కు సైతం పాల్పడ్డారు.
అలా రాజకీయాల్లోకి అసలు ఎంట్రీ ఇవ్వకుండానే టార్గెట్ అయిన నేత లోకేష్ ఒక్కరే. అన్నిటినీ అధిగమించి ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రతి అడుగులోనూ ఆయన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా ప్రజలతో మమేమౌతూ అడుగులేస్తున్నారు. ఈ వంద రోజుల నడకలో లోకేష్ ముఖంలో అలసట, విసుగు అన్నవే కనిపించలేదు. ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను శ్రద్ధగా వినడం, పరిష్కార మార్గాలు చెప్పడం, అడిగిన వారందరితో సెల్ఫీలు తీసుకుంటూ, జనమే లోకేష్.. లోకేషే జనం అన్నట్లుగా యువగళం పాదయాత్ర సాగుతోంది. వంద రోజుల్లో లోకేష్ మూడు జిల్లాల్లో పాదయాత్ర చేశారు.
39 నియోజకవర్గాలను కవర్ చేశారు.ఆయన కవర్ చేసిన జిల్లాలన్నీ రాయలసీమ ప్రాంతానివే. మరో మూడు వందల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర సాగుతుంది. రాయలసీమలోనే ఇంత జన ప్రభంజనం ఉంటే ఇక కోస్తాకు వచ్చే సరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో సులభంగా ఊహించుకోవచ్చు. లోకేష్ పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించేందుకు తల్లి భువనేశ్వరి రావడం కొసమెరుపు. మదర్స్ డే రోజున అంటే ఆదివారం భువనేశ్వరి నారా లోకేష్ క్యాంపు సైట్ వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వందో రోజు పాదయాత్రలో తనయుడితో అడుగు కలిపి నడిచారు.