తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రజాభీష్టం.. కన్నా
posted on May 16, 2023 9:19AM
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయాలన్నది జనాభీష్టమని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాభీష్టం మేరకే రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటాయని చెప్పారు.
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు సూర్తి చేసుకున్న సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడతారన్నారు. దుర్మార్గంగా పాలన సాగిస్తున్న జగన్ పార్టీని గద్దె దించాలని ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కన్నా అన్నారు. ముందస్తైనా కాకపోయినా వచ్చే ఎన్నికలలో వైసీపీ గద్దె దిగడం ఖాయమన్నారు.
పామూరు నుంచి గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన దూబగుంట ట్రిపుల్ ఐటీ వరకూ ఏడు కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ పీకే డైరెక్షన్ లోనేనని అన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి తెలగాణ వాదంతో ఉన్న టి.ఆర్.ఎస్ తో పోత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ పాదయాత్రలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గోన్నారు.మార్గమధ్యంలో గ్రామ, గ్రామాన వీరికి ఘన స్వాగతం లభించింది.