ఎమ్మెల్యేల చూపు సిద్ద రామయ్యవైపే
posted on May 15, 2023 @ 12:32PM
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయం వాడి వేడిగా చర్చ జరుగుతోంది. సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్లీ ముఖ్యమంత్రి చాన్స్ దొరకవచ్చని తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న డి. శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం యోచిస్తుండగా ఎమ్మెల్యేల చూపు సిద్దరామయ్య వైపే ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ భేరి మోగించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఉత్కంఠగా మారింది. సిద్ద రామయ్య పూర్వాశ్రమంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనినే మళ్లీ సీఎం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తుంది. ఇక పోతే డీకే శివకుమార్ పై ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని బలపరిస్తే కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేసులు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా? అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం సీటు రేసులో సిద్ధరామయ్యే ముందంజలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడుతున్న విషయం తెలిసిందే!
ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యే ముందుండగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనకబడ్డట్లు సమాచారం. దీంతో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.