ప్రజలు విసిగెత్తితే ఇలానే చేస్తారు
posted on Jul 22, 2022 @ 9:52PM
రాజకీయనాయకులకు, సినీస్టార్స్‌కు వారి పనులే కాకుండా బట్టల దుకాణాలు, మాల్స్ ఓపినింగ్ పని కూడా గొప్ప ప్రతిష్టా త్మకం. వారి వీరాభిమానులకు అదో పండగానందం! వీలయితే ప్రతీ గల్లీలోని పెద్ద పెద్ద దుకాణాల ఓపినింగ్ వారి చేత చేయిం చాలన్న పిచ్చి అభిమానంతో పిలుస్తుంటారు. ఏ ప్రాంతంలోనైనా సరే కొన్ని కేవలం శిలాఫలకంతోనే పనులు ఆగిపోతుంటాయి. ఓపినింగ్‌కి వెళ్లినవారు ఆ తర్వాత పెద్దా సీరియస్‌గా తీసుకోరు. అయితే ప్రజలు తమకు ఉపయోగపడేవాటిని నాయకులతో ఆరంభించాలనుకుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో అది అంత త్వరగా అనుకున్న సమయానికి అవ్వదు. ఉదాహరణకి కర్ణాటక గడగ్ జిల్లాలో ఒక బస్షెల్టర్‌ను ఆరంభించడానికి చాలారోజుల నుంచి అక్కడి రాజకీయనాయకులు ఎగనామం కొడుతున్నారు. ప్రజలు ఎదురు చూసి చూసి విసిగెత్తారు. చివరికి గేదె ను ఛీఫ్ గెస్ట్‌గా తీసుకువచ్చి మరీ ఆరంభించారు.
గడగ్ జిల్లా బాలసూర్‌లో ఒక బస్ షెల్టర్ కట్టి చాలా కాలమే అయింది. అంటే ఓ నలభయ్యేళ్లు! కొంతకాలం క్రితం అది కూలడం కూడా జరిగింది. కానీ దాని ఆరంభోత్సవం మాత్రం జరగలేదు. ప్రజలు దాన్ని వినియోగించడం కుదరలేదు. చాలాకాలం నుంచి అధికారులను ఆ బస్‌షెల్టర్ గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ అసలు ఆరంభోత్సవం జరగకుండా ఎలా ఉపయోగిస్తారని వారి సమాధానం. జనం విసిగెత్తారు, కోపం వచ్చింది. నాయకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి మండిపడ్డారు. పైగా బస్ షెల్టర్ అందుబాటులో లేకపోయేసరికి విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ అక్కడి ఇళ్ల దగ్గర, దుకాణాల దగ్గర బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వర్షాకాలం పరిస్థితులు మరీ దారుణంగా మారతాయి. ఇక లాభంలేదని ఆమధ్య అక్కడివారే బస్ షల్టర్‌ను ఆరంభించారు. అయితే అందుకు ఛీఫ్ గెస్ట్‌గా మాత్రం ఒక గేదెను తీసుకువచ్చారు. దీని సారాంశమేమిటో మరీ వివరిం చక్కర్లేదేమో!