జగన్ పక్కలో బల్లెం!
posted on Jul 22, 2022 @ 3:48PM
రాజా, మీ ఆజ్ఞ శిరోధార్యం, మీకోసం రాజ్యంకోసం మరణాన్నయినా లెక్కజేయను.. అంటాడు సత్య నారా యణ ఓ పాత సినిమాలో. కానీ రాజు సత్యనారాయణ వెనకే వేగుల్ని పెట్టి నమ్మకం కోల్పోయేలా చేసుకుంటాడు. దాదాపు అదే సీన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. జగన్ పార్లమెంటుకి పంపిన ఎం.పీ రఘురామ కృష్ణం రాజు ఆయన్నే నిలదీస్తున్నారు. మనోడు మనోడు అనుకుంటే నచ్చట్లే దన్న దిట వెనకటికి ఒకామె. అదుగో అలా తయారైంది జగన్, రఘురామల మైత్రి. ఒకే పార్టీ అయినా నమ్మకం పోయిన తర్వా త అధినేతయినా పార్టీ కార్యకర్తయినా ఎం.పీ గారికి తిట్టడానికి పెద్ద అడ్డేమిటి. జగన్ పాలనా విధానం, ఆయన మంత్రివర్గ నిర్ణయాలు ఏమాత్రం ఆయనకు రుచించడం లేదు. తప్పుల తడక పాలనతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప జగన్ వాస్తవంగా ప్రజాభిమానాన్ని చూరగొనే స్థాయిలో పాలన సాగించడం లేద న్నది రఘుమా అభిప్రాయం..కాదు.. గట్టి నమ్మకం. అందుకే ఆయన వైసీపీ అధిష్టానా నికి కొరకరాని కొయ్య గా మిగిలారు. జగన్ ప్రతీ మాటని, అడుగునీ విమర్శిస్తూ అయోమయానికి గురిచేస్తు న్నారు ఎం.పీ.
రఘురామ అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానా లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే జగన్‌కు బొత్తిగా మింగుడుపడని సంగతి. మనోడ నుకుంటే ఇలా తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించడమేమిటని లోలోపల జగన్ తెగ బాధపడు తున్నా రు. ప్రభుత్వ వైఫ ల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో కడిగి పారేస్తున్నారు. సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయ లేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై వేటు వేయడానికి చేయని ప్రయత్నమంటూలేదు. కానీ వీలు పడడం లేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత రెచ్చిపోతారని భావిస్తోంది.
వదిలేస్తే కాసేపాగి మళ్లీ ఇంటికి వచ్చే చిన్నపిల్లాడుకాదు రఘురామ. ఆయన బీజేపీ గూటికి చేరి మరిన్ని ఇబ్బందులు పెడతారని వైసీపీ భయం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలి చిన ఆయన తొలినాళ్లలో అధిష్టానంతో సఖ్యత గానే నడిచారు. కానీ తరువాత విభేదాలు పొడచూపాయి. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. తనపై భౌతిక దాడిచేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయిం చారు. మొత్తానికి అయితే రఘు రామరాజు అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యాలు చేస్తారో తెలియక సతమతమవుతున్నారు.
తాజాగా లోక్ సభలో ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని వైసీ పీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద గలాటానే చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఛీ మీ ముఖం చూసి మాట్లాడలేనంటూ ఆయన చేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇది లోక్ సభలో పెద్ద చర్చకే దారితీసింది.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రఘురాజు మాట్లాడారు. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పలు చేస్తోందని.. కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఆదాయంపై అప్పులు చేయడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తోందన్నారు.
తాజాగా ఏపీ బేవరేజెస్ తరుపున అప్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఖాజానాకు రావా ల్సి న ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ లోకి మళ్లించి…అదో ఆదాయ వనరుగా చూపించి అప్పులు చేస్తు న్నార ని ఆరోపించారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. దీనిపై వైసీపీ ఎంపీలు మార్గని భరత్, వంగ గీతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామతో వాదనకు దిగారు. దీనికి రఘురామ కూడా దీటుగా స్పందించారు. సిట్ డౌన్ అంటూ హెచ్చరించారు. అసలు మమ్మల్ని కూర్చోవడానికి మీరె వరు అంటూ ఆ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ స్పం దించారు. తనను చూసి చెప్పాలని సూచించారు. దీంతో వైసీపీ ఎంపీలు అభ్యంతరాలు చెబుతున్నా. .రఘురామ మాత్రం తన ముఖానికి చేతిని అడ్డంగా పెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే మొత్తానికి లోక్ సభ వేదికగా వైసీపీ ఎంపీల మధ్య జరిగిన రచ్చ మాత్రం తోటి సభ్యలుకు వినోదం పంచింది.