16 అడుగుల చేప.. మూఢనమ్మకాలకు కేంద్రం!
posted on Jul 22, 2022 @ 4:36PM
ఒక రోజు బామ్మగారు మనవడిని తీసుకుని కంచికి బయలుదేరింది. ఎందుకని అడిగితే మొన్న మా వాడి బుజంమీద బల్లిపడింది, అక్కడ బంగారుబల్లిని తాకించాలిగదా.. అందుకు అన్నది. అంతకు రెండ్రో జుల ముందు ఎదురింటి పిల్లకి పిల్లి ఎదురయిందని పరుగున వెళ్లి గది తలుపులేసుకుని రోజంతా బయటికి రాలేదు.. రాతి యుగం నుంచి రాకెట్లు దాటి కంప్యూటర్ కాలంలోకి వచ్చాం. ప్రపంచమంతా ఆ చిన్న ముండే చూపుతుందేవిట్రా అంటారు తాతగారు.. కానీ శకునాల పిచ్చి మాత్రం తరాలు మారుతు న్నా పోవడం లేదు. ఇక్కడే కాదు చిలీ వంటి దేశాల్లోనూ ఇదే భయం పట్టుకుపీడిస్తోంది!
చిలీలో ఓ మత్స్యకారుడు అలా చేపల కోసం సముద్రంలోకి వెళ్లాడు. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా అతన్నే లోపలికి లాగేసింది ఏదో జంతువు. అతను ఎలాగో మళ్లీ పడవ ఎక్కి దాన్ని మాత్రం ఒడ్డు మీదకి లాక్కొచ్చా డు. తీరా చూస్తే అది ఏకంగా 16 అడుగుల పాములాంటి చేప. ఇలాంటిది అక్కడి వారు ఎన్నడూ చూడ లేదట. అంతే ఇదేదో దయ్యం అనుకున్నారు, ఇదేదో కొంపముంచేందుకే వీడికి దొరికిందని తిట్టుకున్నా రు. ఒక గడ్డం ముసలాయన వచ్చి ఇది నిజంగానే అపశకునం.. జాగ్రత్త అని వాళ్ల భయాన్ని రెండింత లు చేసి వెళ్లారు. ఇంతకీ ఆ పేద్దది.. ఓర్ ఫిష్. ఇది చేపలానే కనిపించే చేపగాని నీటి జంతువు. దాని ఒడ్డూ పొడుగూ తేల్చడానికి ఏకంగా రాళ్లెత్తే క్రేన్ ని పట్టుకొచ్చారు.
ఈ అతిపెద్ద చేపని కింగ్ ఆఫ్ హెరింగ్స్ అని పిలుస్తున్నారు. నీటి అట్టడుగున జీవించే ఈ చేప చుట్టూ కూడా ఒక కథను అల్లి చెబుతున్నారు ఇక్కడి వారు. ఇలాంటివి గతంలో జపాన్‌లో కనిపించాయి. ఆ తర్వాతనే ఫుకషిమా అనే భయానక తుపాను జపాన్‌ను ముంచెత్తింది. ఇపుడు అదే భయాందోళనకు గురిచేస్తోంది. అయితే కొందరు నాస్తికులు మాత్రం పెద్ద జీవమే కనిపించినంత మాత్రాన చూసి ఆనం దించాలి. భయంలేకపోతే పెంచుకోవాలి గాని ఇలాంటి పిచ్చి, అర్ధరహిత మూఢనమ్మకాలతో భయపెట్ట వద్దని హెచ్చరించారు. పోనీ అలా అనుకున్నా, ఇపుడు ఉన్నపళాన ఎక్కడకని ప్రజలంతా నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలి? అయినా, ఓర్ ఫిష్ అనేది నీటికి అట్టడుగున పడి ఉంటుంది. దానికి లోకంలో జరిగే దానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? అనీ చిలీలో కొందరు ప్రశ్నిస్తున్నారు. టెటానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఇలాంటివి పైకి వస్తుంటాయే తప్ప అదేమి అపశకునం, అతి ప్రమాద హేతుకం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎన్నయినా, ఎవరైనా చెప్పనీయండి.. మూఢనమ్మకం కలిగితే దాన్ని ఎవ్వరూ మనసు లోంచి తీసేయలేరు.