శాస్త్రి, హోమీబాబా మరణాల గుట్టు విప్పిన క్రౌలీ
posted on Jul 22, 2022 @ 2:02PM
బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే ఓ పెద్ద హెచ్చరిక. ఇంట్లో మొదటి సంతా నానిదే పై చేయి. ప్రపంచరాజకీయాల్లో పెద్దన్న అమెరికాదే పెద్దరికం. అమెరికా కా అంటే కా, కీ అంటే కీ. వీటిలో ఎవరు ఏది కాదన్నా త్వరలో మూడిందనేది కూడా అమెరికానే నిర్ణయించి మరీ చెబుతుంది. అమె రికా వ్యవహారాలకు ప్రమాదకరం అని తోచిన ప్రతీ శక్తిని అణచివేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అన్ని రంగాల్లోనూ అమెరికా నిజంగానే అంత క్రూరంగానూ వ్యవహరిస్తుంది. తన మాటే చెల్లుబాటు చేసు కోగల దిట్ట. భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభా, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్శాస్త్రిది అసహజమరణమని వారు మరణించినప్పటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. కానీ వారివి సహజమరణాలేనని అమెరికా ముద్ర వేసిన తర్వాత ఏ దేశాధ్యక్షుడు, మన దేశంలో ఏ నాయకుడూ ఇక నోరెత్తలేదు. కానీ ఇటీవల మాజీ సిఐఏ అధికారి క్రౌలీ రాసిన పుస్తకం అసలు రహస్యాన్ని బయట పెట్టింది.
చాలాకాలం భారతప్రభుత్వం వారిద్దరి మరణాల గురించిన అసలు సమాచారం తెలుసుకోను తీవ్ర య త్నాలే చేసింది. కానీ ఒక్క ముక్కకూడా భారత్‌కు తెలియలేదు. పోనీ పెద్దన్న అమెరికానే తెలియనీయ లేదన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెగించినవారు దేనికయినా సిద్ధపడతారన్న నానుడి అమెరికాకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. అమెరికా ప్రపంచ రాజకీయాల్లో తమ పూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించడా నికి తానే బాస్ అనిపించుకోవడానికి ఎంతటి హడావుడయినా, భయాన్నయినా ప్రచారం చేస్తుంది.
అయితే అబద్ధాలు ఆట్టే కాలం నిలవవు. సత్యాన్ని ఏదీ నిలువరించలేదని వేదాంతులు చెప్పే మాట నిజంగానే నిజం. ఇటీవల భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో సంచ లన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయనది అనుమానాస్పద మృతి కాదని అగ్రరాజ్యం అమెరికానే పథకం ప్రకారం చేసిన హత్య అని వెల్లడైంది. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితా మహుడు హోమి జహంగీర్ భాభాను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ హత్య చేసింది. ఈ విషయాలను సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు. శాస్త్రి, భాభా మరణించినప్పుడు క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించారు.
శాస్త్రి, భాభా నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న భారత్.. తమ శత్రు దేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వివరించారు. భారతీయులు ఎంతో తెలిలైనవారని, వాళ్లు ప్రపం చంలో గొప్ప శక్తిగా ఎదగబోతున్నారనే విషయాన్ని తాము కోరుకోలేదని చెప్పారు.
1966 జనవరి 11న పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్ రాజధానిలో తాష్కెంట్ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణిం చడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ పేర్కొన్నారు. హోమీ భాభా ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చినట్టు క్రౌలీ తెలిపారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదా ర్థాలు పంపామన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చే ద్దామ నుకు న్నామని చెప్పారు. కానీ, విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి ఎత్తైన పర్వత ప్రాంతంలో కూలిపోయేలా చేశామని తెలిపారు.