ఓర్నాయనో ఇదేం సరదా..!
posted on Jul 22, 2022 @ 12:30PM
మమ్ముమ్ముద్దంటే చేదా.. అంటూ పాత సినిమాలో నాగేశ్వర్రావు ఓ పిల్లని అడిగిన ప్రశ్నతో అప్పటి మహి ళా లోకం అమాంతం ఆగ్రహించింది. తమ నవలా కథా నాయకుడు ఇలాంటి వేషాలేయడ మేమి టని. ఆ తర్వాత చిరు ఏకంగా ముద్దులే పెట్టేయడం కుర్రాళ్లని వీలైనంత రెచ్చగొట్టడం సాధారణమైంది. వెరసి ముద్దు అనేది అదేమంత ప్రమాదకరం, అసహ్యించుకుని తలతిప్పేసుకునే విషయం కాదని ఇప్పటి యువత ప్రకటన. అందుకు తాజా ఉదాహరణ కర్ణాటక మంగళూరులో ఒక కళాశాల విద్యార్ధుల వీడియో హడావుడి.
కాస్తంత మర్యాదస్తుల్లానే ఉన్నారని ఒక అపార్ట్‌మెంట్ వారు కాలేజీ పిల్లల్ని అనుమతించారు. కానీ వారి సరదాలు, ఆటల మధ్యలో ఏకంగా లిప్‌లాకింగ్ పోటీలు పెట్టుకోవడం సీరియస్ విషయమైంది. కుర్రాళ్లకి, అమ్మాయిలకి బహు సరదా సమాచారమే కావచ్చు. కానీ దాని పర్యవసానం ఆలోచించారా? తెలుసునా అన్నదే అనుమానం. ఎందుకంటే ఆ పిల్లల తల్లిదండ్రులు దీన్ని గురించి పోలీసులకీ ఫిర్యాదు చేయ లేదట!
కాలేజీ పిల్లలు గాఢపరిష్వంగంలో ముద్దు మాయలో పడిపోయారు. చుట్టూ కొందరు చేరి కేకలు వేస్తూ, ఈలలు వేస్తూ గోల చేస్తున్నారు. వారిలో ఒకడు ఇంతకంటే గొప్ప చిత్రం ఉండదనుకున్నాడు. అంతే ఆ సీన్‌ని వీడియో తీసి జనాల్లోకి వదిలేడు. అది వైరల్ అయి ఆ ముద్దుల జంట లోకప్రసిద్ధమైంది. అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలపడమే చిత్రం. అయినా యువత ఈ విధంగా వికృతంగా ఆనందం చేసుకోవడం నేరం కాకుండా పోతుందా? ఈ వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీ సులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ తెలిపారు. వారంరోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చ రించి కాలేజీ నుంచి తొలగించింది.
అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.