సీమ సింహం బాలయ్య

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.   ఆ వ్యూహంలో భాగంగానే రాయలసీమ జల్లాల ఎన్నికల ప్రచార బాధ్యత హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.   బాలయ్య(బాలకృష్ణ)   ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అదీ కాక రాయలసీమ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆయన హీరోగా తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనన్న విషయం విదితమే. అలాగే సీమ జిల్లాల్లో బాలయ్యకు భారీగా అభిమానులు ఉన్న  సంగతి తెలిసిందే. అందుకే రాయలసీమలో టీడీపీకి బాలయ్య ప్రచారం పార్టీ విజయాన్ని నల్లేరుమీద బండి నడక చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.   ఈ ప్రచారంలో   జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన తీరు, అన్ని వర్గాల ప్రజలూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు. అ పన్నుల రూపంలో జగన్ సర్కార్ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న విధానం, ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జగన్ పాలనలో ప్రజలు పొందింది ఎంత.. పొగొట్టుకొంది ఎంత అనే అంశంతోపాటు జగన్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు బాలయ్య సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.    మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే.. జగన్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ..  బాదుడే బాదుడు కార్యక్రమంతోపాటు మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంకోవైపు టీడీపీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు సైతం నిర్వహిస్తున్నది. అలాగే హిందూపురం, మంగళగిరిలో ఇప్పటికే ఆరోగ్య రథాలు సైతం ప్రారంభమైనాయి. ఇలా ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువైంది. జగన్ దుర్మార్గ పాలన గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వైసీపీకి ప్రజలను దూరం చేయాలన్న వ్యూహంతా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే సీమ జిల్లాల ప్రచార బాధ్యతలను బాలయ్యకు అప్పగించాలని నిర్ణయించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలంతా విభేదాలను విడనాడి  ఏకతాటిపైకి వచ్చి ప్రజలతో మమేకమైతే  తెలుగుదేశం విజయం ఖాయమనీ, క్యాడర్, లీడర్ కలిసి సాగితే వచ్చే ఎన్నికలలో సైకిల్ స్పీడ్ కి తిరుగుండదని తెలుగుదేశం అధినేత పార్టీ నేతలకు ఉద్భోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  సైకిల్ స్పీడ్ చూస్తుంటే 2024 ఎన్నికలలో ఘన విజయం ఖాయమని పార్టీ క్యాడర్ ఉత్సాహంతో చెబుతోంది.

తెలంగాణ భారత్ లో లేదా?

తెలంగాణ ఏ దేశంలో ఉంది? .. ఇదేం ప్రశ్న ... అనుకోవచ్చును. కానీ, (విమోచనమో, విలీనమో పేరు ఏదైనా) తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు నిండిన తర్వాత, తొలి సారిగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారు, ఎవరి దారిన వారు వేడుకలను జరుపుకున్న తీరును చూస్తే, ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది. రావాలి కూడా. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొరపొచ్చాలు, మాట పట్టింపులు, తూతూ ..మై మై విమర్శలు సహజం . కానీ, జాతీయ వేడుకల విషయాలోనూ గిల్లి కజ్జాలు పెట్టుకునే ధోరణి, చూస్తే, తెలంగాణ దేశంగా భావిస్తున్నారా అనే అనుమానం కలగడం కూడా అంతే సహజం అంటున్నారు. నిజానికి, నిజాం నవాబు అకృత్య పాలన అంతమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. అయినా ఇంకా ఆ బానిస మనస్తత్వం నుంచి పాలకులు బయటకు రాలేదు. అందుకే, ఉమ్మడి రాష్టంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు, నిజాం నవాబ్ భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ ముందు తలవంచి లొంగిపోయిన సెప్టెంబర్ 17 న స్వాతంత్ర జెండాను సగౌరవంగా  ఎగరేసే సాహాసంచేయలేక పోయారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల దుర్నీతిని ఎండగట్టి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినోత్సవాని ఘనంగా నిర్వహిస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తెరాస పాలకులు,, ఎనిమిదేళ్ళు, ఆ ఉసే ఎత్తలేదు. ఉద్యనేతగా గర్జించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఎందుకు పిల్లి కూతలు కూశారు? ఎవరికి భయపడి దాసోహం అన్నారు? ఐదు వేల మంది ప్రాణాలొడ్డి ప్రసాదించిన. ‘తెలంగాణ స్వాతంత్ర ‘ దినాన్ని, జరిపే సాహసం ఎందుకు చేయలేక పోయారు? అవును, ఉద్యమ నేతగా గర్జించిన కేసీఆర్, ఈ ఎనిమిదేళ్ళు ఎందుకు తెలంగాణ స్వాతంత్ర దినాన్ని, ఎందుకు విస్మరించారో, ఎవరికీ భయపడి నోరు మెదపలేదో, వేరే చెప్పనక్కరలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఇప్పుడు అది కాదు ప్రశ్న ... ఇన్నేళ్ళకు  అయినా, కేంద్ర ప్రభుత్వం కదలికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా, జాతీయ సమైక్యత పేరున, తెలంగాణ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం  గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత మేలు. అయితే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరు, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం కాదనే భావనతో ఉన్నారా? అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు.   కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి కాదంటే మరో మంత్రి రిసీవ్ చేకోవాలి, కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ కేంద్ర్ర మంత్రిని రిసీవ్ చేసుకోలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందుకు పోటీగా, సమాంతరంగా  మరో కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంత్రి ప్రతి రోజు ప్రవచించే, ఫెడరల్ స్పూర్తికే కాదు, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. ఇంకా కొంచెం గట్టిగా  రాజ్యంగం పట్ల అపచారం. ముఖ్యంగా జాతీయ స్పూర్తికి ప్రతీకగా  నిలిచే స్వతంత్ర దినోత్సవం, గానతంత్ర దినోత్సవం వంటి స్పూర్తి దాయక కార్యక్రమాల విషయంలో ఇలాటి,పోకడలు ఎ విధంగానూ సమర్ధనీయం కాదని విజ్ఞులు భావిస్తున్నారు, అదొకటి అలా ఉంటే, సికింద్రాబాద్ పరేడ్’ గ్రౌండ్’లో జరిగింది, బీజేపీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, కేంద్ర హోం మంత్రి మాత్రమే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా, అనేక మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపే సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ర్రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం సీఎస్,డీజీపీనే కాదు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.ఇది ఒక విధంగా, రాజకీయ పరిభాషలో చెప్పాలంటే,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధులను బహిష్కరింఛి నట్లే అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజకీయ పరిబాషను పక్కన పెట్టి, అధికారిక పరిభాషలో చెప్పాలంటే, ‘ అధికారిక విధులకు గైర్హాజర్’ (డుమ్మా కొట్టడం) అంటారు. అంతే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి  రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నా తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, నిజాం నవాబు మైండ్ సెట్’ తో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత,  నిజాం నవాబు, హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసేందుకు  ససేమిరా అన్నారు. బ్రిటీష్ పాలకులు పోతూ పోతూ, దేశంలోని 500లకు పైగా సంస్థానాలు భారత దేశంలో కలవాలా వద్దా అనేది వారే, నిర్ణయించుకోవాలని పుల్ల పెట్టి పోయారు. ఇదే సాకుగా తీసుకుని నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్నిపాకిస్థాన్’లో కలిపే ప్రయత్నం చేశారు.  కాదంటే, స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతామని  ప్రకటించారు.ఆ నేపధ్యంలోనే సర్దార్ పటేల్, ఆపరేషన్ పోలో నిర్విహించి నాలుగు రోజుల్లో నిజాం నవాబును కాళ్ళ బేరానికి తెచ్చారు. నవాబు రాక్షస పాలనా నుంచి తెలంగాణకు విమోచన కల్పించారు.  ఈ నేపధ్యంలో, తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం వ్యవహరించిన తీరు గమించిన వారు ముఖ్యమంత్రి కేసేఆర్, నిజాం నవాబు ఆలోచనలు తిరగ తోడుతున్నారా,అనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. నిజానికి, ఈ విషయంలోనే కాదు, ఆజాదీ కా అమృత మహోత్సవ్’ కార్యక్రమం విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా, ప్రత్యేకంగా సొంత కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.కేంద్రంలో అధికారంల ఉన్న బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోడీతో  ముఖ్యమంత్రి కేసీఆర్’కు రాజకీయ విబేధాలు ఉంటే ఉండవచ్చును, కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని బేఖాతర్’ చేస్తానంటే మాత్రం, మళ్ళీ ఆపరేషన్ పోలో వంటి ఆపరేషన్’ అవసరం కావచ్చునని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషంలో, ఇదీ ధోరణి కొనసాగిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతిటి పాలన అనివార్యమయినా కావచ్చిని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ బహుశా అదే కోరుకుంటున్నారు, కావచ్చును అందుకే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని, తానే  రాజు, తానె మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు.

అటు బాబు,  ఇటు అమిత్ షా.. ఒక‌టే క్లాసు! 

చేతులే ఆయుధాలు కావాలి.. ఒక్కొక్క‌రూ ఒక్కో సైనికుడ‌యి విజృంభించాలి.. ఇలాంటి ఆవేశంతోనే బాహు బ‌లి త‌న‌చుట్టూ ఉన్న ప‌దిమందినీ యుద్దానికి ప్రేరేపిస్తాడు. అటు ఆంధ్రాలో జ‌గ‌న్‌ను తోసేయ డంలో చంద్ర‌బాబు  త‌మ పార్టీవారికి బాహుబ‌లిలానే ఉద్య‌మించే గ‌ట్టి  ప్ర‌సంగ‌మే చేశారు.  ఇటు తెలం గాణాలో  కేసీఆర్ ని  గ‌ద్దె దింపి రాజ్యం అధీనం చేసుకోవ‌డానికి బీజేపీ అమిత్ షా కూడా బాబు పంథానే అనుస‌రిం చారు.  యుద్ధంలోనైనా, ఎన్నిక‌ల్లో నైనా గెల‌వాలంటే వ్యూహాల‌మాట ఎలా ఉన్నా, నాయ‌కుడు ఒక్క‌డే కాలికి బ‌లపం క‌ట్టుకుని దేశ‌మంతా, రాష్ట్ర‌మంతా తిర‌గ‌లేడు, భారీ ప్ర‌సంగాలు, హెచ్చ‌రిక‌లు చేస్తూ ద‌వ‌డ‌లు నొప్పి తెచ్చుకోలేడు. కాలం మారింది. ఇపుడంతా మొబైల్ ప్ర‌చారాలే సాగుతున్నాయి.కానీ  పార్టీలో ఇత‌ర నాయ‌కులు, వీరాభిమానులు అంద‌రూ త‌మ త‌మ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా జ‌నాల్లోకి వెళ్లాలి, తిర‌గాలి, ప్ర‌జ‌ల్ని పార్టీప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యేలా చేయాలి. అపుడే పార్టీ అధినేత అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిం చ‌గ‌ల్గుతాడు, పార్టీకి ఎంతో ప్ర‌తిష్ట ఉంటుంది. అలాగాకుండా ప‌ప్పురుబ్బ‌డం, గారెలు వేసి ప‌చ్చ‌డితో ప్లేట్లో పెట్ట‌డం.. అంతా నాయ‌కుడు ఒక్క‌డే చేయాలంటే కుద‌ర‌దు. పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా ప‌రిగెట్టాలి. నాయకుడి కంటే ఒక అడుగు ముందుండాలి. అదే మాట తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆ మ‌ధ్య త‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో చాలా సీరియ‌స్‌గానే చెప్పారు.  అంతేకాదు, పార్టీ విజ‌యానికి పాటుప‌డ‌టం కొంద‌రి ప‌నే కాదు, ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త అంటూ హెచ్చ‌రించారు. పార్టీ విజయా నికి ఎవ‌రు నిజంగా కృషి చేస్తున్నారు, ఎవ‌రు కేవ‌లం ఉప‌న్యాసాలు, ప్రక‌ట‌న‌ల‌తో స‌రిపెట్టుకుంటున్నార‌న్న స‌మాచారం ఆల్‌రెడీ త‌న వ‌ద్ద ఉంద‌ని, చ‌ర్య‌లు తీసుకుం టాన‌ని హెచ్చ‌రించారు. వాస్త‌వానికి ఆంధ్ర లో గెల‌వ‌డానికి ప‌రిస్థితులు అనుకూలిస్తున్నాయి గ‌నుక బంగారు అవ‌కాశాన్ని చేజార్చు కోరాద‌న్న ది ఆయ‌న మాట‌. అదే శాస‌నంగా పార్టీ వ‌ర్గాలు తీసుకోవాలి, ముంద‌డుగు వేయాలి. అంతే కాని ప‌రిస్థితులు బాగానే ఉన్నాయి, జ‌గ‌న్‌కు అంత‌టా వ్య‌తిరేక‌తే  ఉంది గ‌న‌క మ‌నం ఇంట్లో కూర్చుంటే చాలు గెలిచేస్తామ  అని, ప‌ద‌వులు వ‌చ్చేస్తాయ‌ని అనుకుంటే చంద్ర‌ బాబు  సాగ‌నీయ‌రు.  ఇదిలా ఉండ‌గా, తెలంగాణాలో కేసీఆర్ పాల‌న ప‌ట్ల విముఖ‌త ఎంతో ఉన్నందువ‌ల్ల బీజేపీ మ‌రింత ఉద్య మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సేమ్ టు సేమ్ చంద్ర‌బాబులానే కేంద్ర‌మంత్రి అమిత్ షా బీజేపీ వ‌ర్గాల ను హెచ్చ‌రించారు. ఎవ్వ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని, వ‌చ్చిన అవ‌కాశాన్ని మ‌నం స‌ద్విని యోగం చేసుకోవాల‌ని, ఇంత‌కంటే మంచి త‌రుణం మ‌రోసారి ద‌క్క‌దు గ‌నుక మ‌న‌సుపెట్టి కాస్తంత శ్ర‌మించి పార్టీ ని ప్ర‌జ‌ల్లోకి మ‌రింత తీసికెళ్లి ఓట్లు ప‌డేలా ప‌నిచేయ‌మ‌ని హెచ్చ‌రించారు. దేశంలో వెలిగిపోతు న్నంత మాత్రాన తెలంగాణాలో అధికారంలోకి ఇట్టే వ‌చ్చేస్తుంద‌న్న భ్ర‌మ‌లో ఉండ‌వ‌ద్ద‌ని షా తెలంగానా బీజేపీ నాయకుల‌ను హెచ్చ‌రించారు. కేసీఆర్ కేంద్రంపై దృష్టిపెట్టి రాష్ట్రాన్ని నిర్ల‌క్ష్యం చేశారు గ‌నుక రాష్ట్ర ప్ర‌జ ల‌కు బీజేపీ ద‌గ్గ‌ర‌యి అధికారంలోకి వ‌చ్చేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి టిఆర్ ఎస్‌కు బుద్ధి చెప్పా ల్సి న అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అమిత్ షా మ‌న‌సులో మాట. పార్టీ ప‌థ‌కాలు, పాల‌నా విధానాలు, తెలంగాణా  రైతాంగం ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి, అభివృద్ధికి పార్టీ ఎలా కంక‌ణం క‌ట్టుకుంది ప్ర‌జ‌ల్లోకి  తీసికెళ్లాలని అమిత్ షా  తెలంగాణా బీజేపీ  నాయ‌కుల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా  క్లాస్ తీసుకున్నారు.  మ‌రి ఈ నాయ‌కుల ప్ర‌తిన‌, మ‌నోభీష్టం ఏ మేర‌కు విజ‌యాల‌ను ఇస్తుంద‌న్న‌ది చూడాలి. అయితే చంద్ర బాబు హెచ్చ‌రిక‌లు ఆంధ్రాలో నాయ‌కులు, పార్టీ అభిమానులు  బాగా చెవికి ఎక్కించుకునే అవ‌కా శం ఉంది. అక్క‌డ నాయ‌కుని భాషా, ఆవేశం వారికి అవ‌గ‌త‌మే. కానీ  అమిత్ షా ప్ర‌సంగం, ఆయ‌న ఆగ్ర‌హం మ‌రి తెలంగాణా బీజేపీ  వారు ఏమాత్రం పూర్తిగా అర్ధంచేసుకున్నార‌న్న‌దే సందేహం. 

షా వ‌చ్చిన వేళ‌.. బ‌య‌ట‌ప‌డ్డ  సెక్యూరిటీ లోపం

ఒక పారిశ్రామిక‌వేత్త ఇంట్లో బార‌సాల వేడుక‌. కేంద్ర‌మంత్రి రివ్వున కారులో వ‌చ్చి అంద‌ర్నీ ప‌ల‌క‌రి స్తాడు. తీరా వెళ్లేముందు ఒక కుర్రాడు బైక్ మీద వ‌చ్చి అడ్డుకుంటాడు. కోపంతో మంత్రి చూస్తాడు, సెక్యూరిటీ కొట్ట‌బోతారు, అంత‌లో వెన‌గ్గావున్న కాన్వాయ్ వాహ‌నాల్లో రెండు గాల్లోకి లేస్తాయి..హీరో న‌లు గుర్ని త‌న్ని మంత్రి ని వెక్కిరించి మ‌రీ పారిపోతాడు.. ఇదంతా సినిమా సీన్. హ‌రిత ప్లాజా ద‌గ్గ‌ర ఇలాం టివేమీ జ‌ర‌గలేదు  కానీ కేంద్రహోంమంత్రి అమిత్ షా వాహ‌నాన్ని మాత్రం ఒక కారు అడ్డు కుంది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అమి త్ షా హరిత ప్లాజా వైపు పయనమయ్యారు.  అమిత్ కాన్వాయ్ వెళుతుండగా  ఓ కారు అడ్డంగా రావ డంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగుల గొట్టారు. హరిత ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది.  మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కొత్త కారు అమి త్ షా కాన్వాయ్ కి అడ్డుగా వచ్చింది. దాంతో అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయింది.  ఎంతకీ ఆ కారు పక్కకి తొలగకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగులగొట్టారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వస్తే ఇలా గేనా భద్రత ఏర్పాట్లు చేసేది? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రికే ఇలాం టి పరి స్థితి ఎదురైతే ఇతరులను ఎలా రక్షిస్తారని మండిపడ్డారు. కేంద్ర‌ప్ర‌భుత్వం కేంద్ర ప‌ర్యాట‌కశాఖ ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌లో తెలంగాణా విమోచ‌న  కార్యక్ర‌మా నికి ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు షా వ‌చ్చారు.  క‌నుక ఇక్క‌డ ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ ప‌రంగా  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌ ప‌ర‌చ లేద‌ని బీజేపీ వ‌ర్గాల ఆగ్ర హం. ఎలా వ‌చ్చినా వచ్చింది కేంద్ర‌మంత్రి గ‌నుక  రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ విష యంలో నిర్ల‌క్ష్యం చేసింద‌నేది ప్ర‌స్ఫుటంగా క‌న‌ప‌డుతోంది. 

రేవంత్  మ‌రో రాజ‌కీయ ఎత్తు!

దేవ‌త‌ను ప‌లుర‌కాలుగా పూజిస్తారు. అమ్మ‌వారు ప‌లుపేర్లు క‌లది. విజ‌య‌వాడ దుర్గ‌, క‌ల‌క‌త్తా కాళి అంటారు.  కాల‌క్ర‌మంలో భాషాప‌ర దేవ‌త‌లూ వ‌చ్చారు. తెలుగునాట తెలుగు త‌ల్లి అంటూ చాలాకాలం నుంచి ప్ర‌చారంలో ఉంది. ఇపుడు కొత్త‌గా తెలంగాణా త‌ల్లి, తెలంగాణాలోనే తెలంగాణా కాంగ్రెస్ త‌ల్లి విగ్ర‌హాలు త‌యార‌య్యాయి. ఈ విష‌యంలోనూ రాజ‌కీయ‌రంగు పులుము కోవ‌డ‌మే విడ్డూరం. రేవంత్రెడ్డి ఆలోచ‌న ఆయ‌న వ‌ర‌కూ బాగుండేదేమో. ఎవ‌ర్ని రెచ్చ‌గొట్ట‌డానికి ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్  తెలంగాణా  త‌ల్లి అంటూ కొత్త విగ్ర‌హాన్ని తెర‌మీద‌కి తెచ్చారో కాంగ్రెస్ సీనియ‌ర్లు చెప్పాలి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌ర్వాత తెలుగుత‌ల్లి విగ్రహం రూపు ఇలా ఉండాల‌ని నిర్ధారించుకుని విగ్రహం ఏర్పా ట్లు ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు త‌ల్లి మీద గీతాలు వ‌చ్చాయి. కాలక్ర‌మంలో స‌మై క్యాం ధ్రా కాస్తా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణాగా విడిపోయింది. తెలుగు నేల రెండు రాష్ట్రాల‌యింది. అటు వాళ్లు, ఇటు వాళ్లు అంతా బాగానే ఉన్నాం. కానీ తెలుగు త‌ల్లికి పోటీగా  తెలంగాణా త‌ల్లి రూపొం దించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభ రణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రిం చారు. చీర, కరీంనగర్ వెండి మట్టెలు, కోహినూర వజ్రం, జాకబ్ వజ్రం, పాలమూరు, మెదక్, అది లాబాద్ మెట్ట  పంటలకు చిహ్నంగా మక్కకంకులు,నిజామాబాద్ వరంగల్, కరీంనగర్ జి ల్లాల సం స్కృ తికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా , రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీ టంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం,వడ్డాణం,జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుది మెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశే షాలు ప్ర‌తిఫ‌లించాయి. ఆంధ్రాలో తెలుగు త‌ల్లి, తెలంగాణా లో తెలుగు త‌ల్లి అంటూ రెండు ర‌కాల ఆరాధ‌న ఉంది. ఇపుడు కొత్త‌గా తెలంగాణా కాంగ్రెస్ వారూ ఒక తెలుగు తల్లికి శ్రీ‌కారం చుట్టారు. విగ్ర‌హానికి కాంగ్రెస్ మూడు రంగుల చీర చుట్టారు. ఎడ‌మ‌చేతిలో జొన్న కంకులు పెట్టారు, మెడ‌లో వెండి క‌డియం, కాళ్ల‌కు మెట్టెలు అలంక‌రిం చారు. ప్ర‌తీదీ రాజ‌కీయ దృష్టితో చూడ‌టం, ఆధిప‌త్య పోరులో అన్నింటినీ వ‌దిలేయ‌డం లేదా నిర్ల‌క్ష్యం చేయ‌డం ఒక ప‌ద్ధ‌తిగా అమ‌లు చేస్తూ రాజ‌కీయ రంగంలో ప్ర‌త్య‌ర్ధి కంటే ఒక మెట్టు పైనే ఉన్నామ‌ని ప్ర‌క‌టించుకోవ‌డం, ప్ర‌చారం చేసుకో వ‌డంలో జాతీయ చిహ్నాల‌ను, రాష్ట్ర చిహ్నాల‌ను కూడా లెక్క‌లోకి తీసుకోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.  మ‌రి రేపో మాపో.. అయితే గీతే అయినంపూడి సంబంధంలా.. బీజేపీవారూ తెలుగుమీద దేశ‌భ‌క్తి స్థాయిలో అమాంతం ప్రేమ పెంచుకుంటే మ‌రి ఆ త‌ల్లికి కాషాయం క‌డ‌తారేమో, ఎడ‌మ‌చేతిలో క‌మ‌లం పెడ తా రేమో! ఎందుకంటే, ఏకంగా మూడు సింహాల గుర్తే వీజీగా మార్చేశారు. కాస్తంత శాంతంగా క‌నిపించే సింహాలు బీజేపీ స‌ర్కారు వారి ఆదేశానుసారం మ‌నిషి క‌నిపిస్తే మింగేసేట్టు కోర‌లు బ‌య‌టికి పెట్టుకు న్నాయి ప్ర‌తీ విగ్ర‌హంలోనూ!  అయినా రాజు త‌లచుకోవాలేగాని, రాత్రి వ‌చ్చిన క‌ల‌ని సాకారం చేయ‌డం ఎంత సులువో దేశంలో!

గుడివాడ బరిలో దేవినేని ఉమ.. కొడాలి నానికి చెక్!?

వైసీపీకి, ఆ పార్టీలోని కొందరు కీలక నేతలకు ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ముకుతాడు వేసి, టీడీపీని పంచకళ్యాణి గుర్రంలా పరుగెత్తించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు చురుగ్గా రచిస్తున్నారు.  విర్రవీగి  అసభ్యంగా మాట్లాడుతున్న కొడాలి నాని మెడలో గుడివాడ బరిలోనే గుదిబండ వేసి మరీ టీడీపీ జెండా రెపరెపలాడించాలని టీడీపీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో గుడివాడలో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో బలమైన నేతగా, వైసీపీకి దీటుగా జవాబు చెప్పగల నేతగా పేరున్న మాజీ మంత్రి దేవినేని ఉమను గుడివాడ బరిలో దింపాలనే యోచన చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. గుడివాడలో బలమైన అభ్యర్థి ఉంటే కొడాలి నానిని మట్టి కరిపించవచ్చని, ‘కొడాలి ఓటమి మిషన్’ సక్సెస్ అవుతుందన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోందని సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు కూడా దేవినేనికి గుడివాడ టికెట్ ఇచ్చి, సీటు గెలుచుకువచ్చే బాధ్యతలు అప్పగించాలనే యోచన చేస్తున్నారంటున్నారు. కొడాలి నానికి దేవినేని ఉమ అయితే.. సమ ఉజ్జీ అవుతారని, ఉమ గెలుపు తథ్యం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, టీడీపీకి విజయం సాధించడం ఆ పార్టీ నేతల ముందు ఉన్న ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. కొడాలి నానిని ఓడించడం కృష్ణా జిల్లా టీడీపీ నేతలే కాకుండా.. ఆ పార్టీ  కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం అధినేత సహా,   పార్టీలోని పెద్దలపై నోరు పారేసుకుని మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కొడాలి నానికి గుణపాఠం చెప్పే కార్యాచరణతో టీడీపీలోని కీలక నేతలు ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కొడాలిపై ఫోకస్ పెట్టిన క్రమంలో టీడీపీలో కీలకమైన చర్చ కొనసాగుతోందంటున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దీటుగా బదులిస్తారా? లేక మరింత బలమైన నేతను బరిలో దింపాలా అన్న విషయం  తెరమీదకు వచ్చిందంటున్నారు. ఈ చర్చల క్రమంలోనే గుడివాడ నుంచి దేవినేని ఉమను బరిలో దింపితే ఫలితం అనుకూలంగా వస్తుందనే ధీమా పార్టీ నేతలలో వ్యక్తమైందని అంటున్నారు రావి వెంకటేశ్వరరావు గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యారు. అయినప్పటికీ రావి వెంకటేశ్వరరావు స్పీడు రానున్న ఎన్నికల్లో కొడాలి నానిపై విజయం సాధించేందుకు సరిపోదనే అభిప్రాయం స్థానిక తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమైందని సమాచారం. టీడీపీపై, టీడీపీ నేతలపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ని చాలా వరకూ తగ్గించిందని, అయినప్పటికీ.. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు దేవినేని ఉమతో చెక్ చెప్పాలనే అభిప్రాయం టీడీపీ అధినేతకు కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇదే అభిప్రాయం పలువురు టీడీపీ నేతల్లో కూడా కలిగిందని తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలోని అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు కూడా దేవినేని ఉమ పేరును పార్టీ చీఫ్ చంద్రబాబుకు సూచిస్తున్నారంటూ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి దేవినేని ఉమ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాతో మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలోని అనేక మంది పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న దేవినేని ఉమ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో దేవినేని ఉమ చేసిన ప్రసంగం, తొడగొట్టి మరీ కొడాలి నానికి చాలెంజ్ విసరడంపై ఆ పార్టీ గుడివాడ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ విశ్లేషించుకుంటే.. బూతుల మాజీ మంత్రి కొడాలికి సరైన ప్రత్యర్ది దేవినేని ఉమ అవుతారని, లెక్క సరిపోతుందని అంటున్నారు. ‘మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగొచ్చాడు’ అని బాహుబలి సినిమాలో దేవ సేన అన్నట్లు.. ‘గుడివాడా ఊపిరి పీల్చుకో.. కొడాలి నాని కోరలు పీకేందుకు దేవినేని ఉమ వస్తున్నాడు’ అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

మూడు రాజ‌ధానుల‌పై సుప్రీంను ఆశ్ర‌యించిన ఏపీ స‌ర్కార్‌

మూడు రాజధానుల పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టు లో ఏపీ సర్కార్‌  సవాల్‌ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నిం చ డమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.  సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదు పాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యంకాదని పిటిషన్లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసన సభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు  రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ తెలిపింది. కాగా.. మూడు రాజధానుల బిల్లు ను వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కు తెలిపిన విషయం తెలిసిందే.  రాజధా ను ల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందు పర్చారు. తిరిగి తాజాగా మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఎలాగైనా సరే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో వేచి చూడాలి.

ఇలాగైతే మొద‌టిరౌండ్‌తో స‌రి... షోయెబ్ అక్త‌ర్‌

ఆసియా క‌ప్‌లో భార‌త్‌ను ఓడించి ఫైన‌ల్లో శ్రీ‌లంక చేతిలో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్‌.  ఈసారి టైటిల్ పాక్‌దే అనుకున్నారు. కానీ చివార్న చ‌తికిల‌ప‌డింది. అస‌లు మొత్తానికి గ‌మ‌నిస్తే, ఆ టోర్నీలో పాక్ ఆట పేల‌వంగానే ఉంది. అంద‌రూ అనుకున్నంత, అంటున్నంత గొప్ప‌గా ఏమీ లేద‌ని పాకిస్తాన్ క్రికెట్ మాజీలే  మండిప‌డుతున్నారు. ఆసియాక‌ప్ కాబ‌ట్టి గ‌ట్టిగా ఏమీ అన‌లేముగాని టీ-20  ప్ర‌పంచ‌క‌ప్ కి  ఇలాంటి జ‌ట్టు అస్స‌లు పంప‌వ‌ద్ద‌ని పాక్ క్రికెట్ బోర్డుకి సూచ‌న‌లు ఇస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డ‌ర్‌, కాంబి నేష‌న్ చాలా దారుణంగా ఉంద‌ని మాజీ పాక్ పేస‌ర్ షోయెబ్ అక్త‌ర్ మండిప‌డుతున్నాడు.  అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్‌ల్లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌కి పాక్ జ‌ట్టును పాక్ బోర్డు ప్ర‌క‌టించింది. కానీ దాని ప‌ట్ల సీనియ‌ర్లు ఎవ్వ‌రూ సంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. బాబ‌ర్ అజామ్‌, ష‌దాబ్ ఖాన్‌ల నాయ‌క‌త్వంలో వెళ్లే జ‌ట్టు చాలా పేల‌వంగా ఉంద‌ని విజ‌యం సాధించే దిశ‌లో ఆడ‌గ‌ల‌ద‌న్న న‌మ్మ‌కం లేద‌ని మాజీలు విమ‌ర్శిస్తున్నారు. ఆసియా క‌ప్‌లో ఆడిన జ‌ట్టుకీ ఈ జ‌ట్టుకీ పెద్ద తేడా లేద‌న్నారు.  కెప్టెన్‌గా బాబ‌ర్ పెద్ద‌గా రాణించ‌డం లేద‌ని, అత‌నిలో బ్యాటింగ్ ప‌దును త‌గ్గింద‌ని, ఆసియా క‌ప్‌లో అత‌ని ఆట‌తీరు గొప్ప‌గా లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పాక్ మాజీలు అన్నారు. అంత‌కు మించి మిడిల్ ఆర్డ‌ర్ చాలా పేల‌వంగా ఉంద‌ని అక్త‌ర్ అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డ‌ర్ ప‌టిష్టంగా ఉంటేనే ఆస్ట్రేలి యాలో క‌నీసం సెమీస్ చేర‌డానికి అవ‌కాశం ఉంటుద‌ని  అక్త‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ చెప్పు కోద‌గ్గ ప‌టిష్ట‌త లేద‌న్నాడు. కేవ‌లం ఒక్క‌రిద్ద‌రు బ్యాట‌ర్ల సామ‌ర్ధ్యాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద టోర్నీలకు వెళ్ల‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని అక్త‌ర్ ప్ర‌శ్నించాడు.  టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ తొలిమ్యాచ్ అక్టోబ‌ర్ 23న  మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్ భార‌త్‌తో త‌ల‌ప‌డుతుంది.

కోవిడ్ మరణాల నివారణలో ఘోరం వైఫల్యం: లాన్సెట్ నివేదిక

కోవిడ్ 19 మరణాల నివేదికలో ప్రపంచ దేశాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని లన్సెట్ నివేదిక పేర్కొంది.  లాన్సెట్  వెల్లడించిన నివేదిక ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనా మేరకు 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారు.  ఇది జూలై 1-2021 నాటి నివేదిక కాగా,  మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమైన కారణంగా  ప్రజలు ఏమిజరుగుతుందో  ఆర్ధం చేసుకునేలోగా పిట్టల్ల రాలిపోయారని నివేదిక పేర్కొంది.   ఘటన తీవ్రంగా కలిచివేసిందని. ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని.లాన్సెట్   కోవిడ్ 19 కమిషన్ నివేదిక పేర్కొంది. ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని అయితే కోవిడ్ మరణాలన్నిటినీ సక్రమంగా నమోదు చేయని కారణంగా వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని నివేదిక విశద పరిచింది. కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రపంచ దేశాలు సంప్రదింపుల సంప్రదాయాన్ని విస్మరించడమే ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో వైఫల్యం కారణంగానే అభివృద్ధి కుంటుపడి  పురోగమనం నుంచి తిరోగమనం వైపు వేగంగా పయనించిందని లాన్సెట్ నివేదిక పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ పతనం కావడాన్ని ఉదాహరణగా పేర్కొంది. న్యూ  లాన్సెట్ కోవిడ్19 కమిషన్ నివేదిక మేరకు  కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో  ప్రపంచ దేశాలు స్పందించిన తీరు అత్యంత నిరాశా జనకంగా ఉందని, వైరస్  వ్యాప్తిని నివారించడంలో  ప్రపంచ దేశాల వైఫల్యాలకు పారదర్శకతలోపం, జాత్యాహంకారం,  ప్రాజారోగ్యం పరిరక్షణ విషయంలో ప్రణాళికా రాహిత్యం కారణాలుగా ఆ నివేదిక పేర్కొంది.  చాలా  ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధత కనపరచలేదనీ బాదితుల పట్ల    శ్రద్ధ వహించలేదనీ పేర్కొంది.  అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించడం కూడా కరోనా విస్తృత వ్యాప్తికి కారణమని పేర్కొంది. కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడం లో మనకు ఒక గుణపాఠం తీసుకోవాలని నివేదిక పేర్కొంది.   దీర్ఘకాలిక ప్రణా ళిక తోనే సామాజిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పథంలో సాగాలని లాన్సేట్ నివేదికలో పేర్కొంది.               

 జ‌గ‌న్ గ‌ణాంకాలు...అయోమ‌యంలో జ‌నాలు!

ఏదో తేడాగా ఉంది.. నీకేమీ అనిపించ‌డం లేదా?.. అని హీరో ఒక క‌మిడియ‌న్‌ని అడుగుతాడు.. ఏం లేదే అన్న ఆ క‌మెడియ‌న్‌కి క్ష‌ణం త‌ర్వాత అస‌లు సంగ‌తి తెలిసి ప‌రుగుపెడ‌తాడు.. ఇది ఓ సినిమాలో సీన్‌.  ఇది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి విష‌యంలో తెలుగు రాజ‌కీయ‌నాయ‌కులు అన్వ‌యిస్తున్నారు. అధికా రంలోకి వ‌చ్చి నాలుగేళ్ల‌యినా జ‌గ‌న్‌లో ఎలాంటి విజ్ఞ‌తా  అస్మ‌దీయులు, త‌స‌మ‌దీయులూ గ‌మ‌నించక పోవ‌డ‌మే వింత‌. ఆయ‌న ఇటీవ‌లి కాలంలో మాట్లాడుతున్న ప్ర‌తీ మాటా వైసీపీ నాయకుల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది..పైకి ప్లాస్టిక్న‌వ్వులు న‌వ్వుతూనే ఇదేంద‌న్నా ..ఈనేనా మ‌న నాయ‌కుడు..అనుకుం టున్నా రు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్య‌నే ఏకంగా కులాల ప్ర‌స్థావ‌న తేవ‌డం వైసీపీ నాయ‌కుల‌కు కాళ్ల కింద నేల చీలినంత ప‌న‌యింది. ఆయ‌న‌కు త‌న‌వారిని, ప‌ర‌వారిని జ్ఞానుల‌ను చేయాల‌న్న ఆతృత మ‌రీ ఎక్కు వ యింది. ఆ వీరావేశంలో ఏం మాట్లాడుతున్నారో క‌నీసం ప‌ద ప్రయోగ‌మూ తెలీనంత దూకుడు ప్ర‌ద‌ర్శి స్తున్నారు.  కానీ ఇక్క‌డ కామెడీ ఏమిటంటే జ‌గ‌న్ మూడేళ్ల పాల‌న గురించి ఆయ‌న హామీలు, చేసిన చేత‌లు, మంత్రు ల భ‌జ‌న‌లు,కీర్త‌న‌లు అన్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసినంత‌గా, వారికున్నంత అవ‌గాహ‌నా  ప్ర‌భువుకీ, అను చరుల‌కీ బొత్తిగా లేదు. తామేదో వెల‌గ‌బెట్టామ‌ని ప్ర‌జాభిప్రాయం తెలుసుకోవాల‌ని వేగుల‌ను పంపితే వారికి వాత‌లు ప‌డి వెన‌క్కొచ్చి చొక్కా వేసుకుని రాజావారి ద‌గ్గ‌రికి న‌వ్వుతూ వెళ్లి అంతా బాగానే ఉంది అని చెప్ప‌డం. ఆన‌క ఏం జీవితంరా బాబూ అనుకోవ‌డం ఏక కాలంలో జ‌రిగాయి. వారికి ప్ర‌భువును సంతోష‌పెట్ట‌డం, త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికే నాలుగేళ్ల‌యిపోయింది మ‌రి. ఇక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కేవ‌లం చంద‌మామ తీసుకువ‌స్తాన‌ని రాకుమారుడి వాగ్దానం లాంటిది. గుర్రం ఎగ‌ర‌దు, చంద‌మామ చిక్క‌దు! దీనికి మించి జ‌గ‌న్ తెలివి లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌రింత స్ప‌ష్టంగా చూశారు. అంతా క‌రోనా తో గొల్లుమంటూంటే బ్లీచింగ్ పౌడ‌ర్ రాష్ట్ర‌మంతా అన్నీ గ‌ల్లీల్లో వేస్తే ఈగ‌లు, దోమ‌ల బెడ‌ద తీరుతుంది. ప్ర‌జ‌ల‌కు క‌రోనా పీడ విర‌గ‌డ‌వుతుంద‌ని చెప్ప‌డం. ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ‌కి తెలిస్తే అమాంతం చార్మినార్  ఎక్కి దూకే వారేమో! వారి ప‌రిశోధ‌న‌ల కాయితాలు పిల్ల‌ల‌కు ప‌డ‌వ‌ల‌య్యేవేమో!  నిజం క‌టువుగానే ఉంటుంది. కానీ స‌ర్కారు వారికి నిజాలు కూడా హోమియో తీపి గుళిక‌ల్లా చెప్పాలంటే ఎలా? అది ఒక్క అనుచ‌రుల‌కు, వీరాభిమానుల‌కే సాధ్య‌ప‌డుతుంది గాని ప్ర‌జ‌ల‌కు, విప‌క్షాల‌కు కుదురు తుందా?  వాస్త‌వాన్ని అద్దంలో చూపాలి, అబ‌ద్ధాల్ని చెవిలో చెప్పాలంటారుగ‌దా! కానీ ప్ర‌జ‌ల‌కు అవేమీ అక్క‌ర్లేదు.. రోడ్డు, ఆస్ప‌త్రి, బ‌స్సులు స‌రిగా ఉంటేచాలు. స‌రిగ్గా అవే ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తుంది. ఓట్ల‌ కు మాత్రం ప‌రిగెట్టే నాయ‌కులు అవేమీ చేయ‌కుండా ఒక ప్ర‌శ్నావ‌ళితో ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు వెళితే మురు క్కుంట చూపి బావుచేయ‌మ‌నే అంటారుగ‌దా! తాను ఐదు వేల రూపాయ‌లు ఇచ్చి నియమించిన వాలంటీర్లు నెలకు ఓ సారి లబ్దిరాలకు రూ. రెండు వేలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడాన్ని వికేంద్రీకరణ అనేశారు జగన్ రెడ్డి. అంతేనా ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ కూడా వికేంద్రీకరణ కోటానే. ఇది చాలా మందికి తెలియదు. పెద్ద పెద్ద మేనెజ్ మెంట్‌ ప్రొఫెస ర్లకు కూడా తెలి యదు. ఇంత చక్కగా వికేంద్రీకరణం చేసేశాకా మరి మూడు రాజధానులతో కొత్తగా చేసే దేముందని.. చాలా మందికి వచ్చే డౌట్. కానీ వారంతా జగన్ లాంటి విజ్ఞాన గని ముందు ఎందుకూ కొరగారు కాబట్టి వారి సందేహాలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన తెలివి తేటల్ని.. నాలెడ్దిని చూసి మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప వ్యక్తా అనుకోవాల్సిన పరిస్థితి.  ఆయనకు తోడు ఐఐటీలో చదివిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిండు సభలో కూర్చుని కిటీకీలే లేవు ఇదా కట్టించింది అని మాట్లాడటం ..నాయకుడికి తగ్గ అనుచరులు అనిపించుకున్నారు. వీరి విజ్ఞాన ప్రదర్శ న..వారి ఫ్యాన్స్‌కు నచ్చుతుందేమో కానీ కాస్త బుర్ర ఉన్న వాళ్లకు మాత్రం  ఇదేందిరా  అని అను కోకుండా ఉండలేరు. అమరావతికి అయ్యే ఖర్చుపై చెప్పిన లెక్కలకు ..గణితశాస్త్రంలో నోబెల్ ఇవ్వా ల్సిందే ! ఎప్పుడైనా ముఖ్యమంత్రిగారు చూసి రాసే ప్రసంగాల్లో అంకెలను చదవాల్సి వచ్చిన ప్పుడు…అయన చెప్పేలెక్కలు చాలా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అటూ చాలా మంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. నోరు తిరగక అలా అంటూ ఉంటారులేని అని చాలా మంది అనుకుంటారు. కానీ అమరావతి నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందని అదంతా ప్రభుత్వమే పెట్టుకోవాల ని.. అంత నా దగ్గర ఉంటే.. అభివృద్ధి చేయనా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేశారు.  ఎకరానికి మౌలిక సదుపాయాల కోసం రూ. కోటి ఖర్చవుతుందని చంద్రబాబు లెక్కలేశారని అది ఇప్పుడు అంత కంటే ఎక్కువ అవుతుందని కబుర్లు బాగానే చెప్పారు కానీ.. అసలు అమరావతి గురించి ఏమీ తెలియదా.. తెలియనట్లు నటించారా అన్నది జనాలకు కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఓ ప్రపంచ స్థాయి నగరం నాలుగైదులక్షల కోట్లకు రెడీ అయిపోతుంది. అందులో డౌట్ లేదు. ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న ఆస్తు లన్నీ ప్రభుత్వం ప్రజాధనంతో కట్టించిందా? . అక్కడ రోడ్లు , డ్రైనేజీ లాంటి మౌలిక సదుపా యా ల్నే కట్టించింది. మిగతా అంతా ప్రైవేటు వ్యక్తులు డెలవప్ చేశారు. అది హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడే. అంత మాత్రాన అది జనం సొమ్మంటారా?. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను చూసిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కూడా శభాష్ అనుకుండా ఉండలేకపోయారు. ఇంత భారీ సంపద సృష్టి ఆలోచన భేష్ అన్నారు.  ఒక‌రు వేసిన బొమ్మ‌ని లోకం మెచ్చుకున్న త‌ర్వాత  మ‌రొక‌రు వ‌చ్చి దాన్ని వంటింట్లో దాచి  నేను వేసిందే మ‌హాద్భుతం అంటూ  మ‌రోటి చూపే ప్ర‌య‌త్నాన్ని, ప్ర‌చారాన్ని ఎవ‌ర‌యినా మెచ్చుకుంటారా? రాజ‌ధాని విష‌యంలో ఇదే జ‌రుగుతోంది.  న‌లుగురు మెచ్చుకున్న‌దాన్ని కొన‌సాగించి కాస్తంత మెరు గులుదిద్ది అది పూర్తి చేయ‌డానికి కృషి చేస్తే అద‌రికీ మేలు జ‌రిగేది కానీ ఆ మేలు ఒక్క‌రికే ప్ర‌చార‌మ‌వుతుంద‌న్న బుద్ధిహీ నుల స‌ల‌హాల‌తో త్రోసిపుచ్చ‌డం అవమానాన్నే మిగిల్చింది. కానీ జ‌గ‌న్‌కి ఈ సంగ‌తి అర్ధం కావ‌డం లేదా లేక న‌టిస్తున్నారా అన్న‌ది తెలీడం లేదు. అన్నీ త‌న వూళ్లో జ‌రిగిన‌ట్టే జ‌ర‌గాలంటే ఎలా?  కాలం మారిం ది. ప్ర‌జ‌ల‌కు ఓటు విలువు, రాజ‌కీయాల విలువ‌, నాయ‌కుల మాట‌ స‌త్తా అన్నీ తెలుసు, అస‌లా మాట‌కు వ‌స్తే ఓట‌రు క‌న్నా నాయ‌కులు పెద్ద తెలివిమంతులు కార‌న్నది లోకోక్తి! 

జగన్ కు ఓటమి భయం.. ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ల భయం!

ఏపీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆయన ప్రతి మాటలోనూ ఆ భయం ప్రస్ఫుటమౌతోంది. మూడు రాజధానుల విషయంలో తన మొండితనం మొదటికే మోసం తెచ్చిందా అన్న అనుమానం కూడా ఆయనలో మొదలయ్యిందన్న భావన కనిపిస్తోంది. రేపల్లెలో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు, గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు, చీటికీ మాటికీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ ఆయనలో ఓటమి భయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొంచం కష్టపడితో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ గెలుపు మనదే అన్న ధీమా వ్యక్తం చేసిన నెలల వ్యవధిలోనే జగన్ తన ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. బుగ్గ కారుల్లో తిరగడం తప్ప మీరేం పని చేయడం లేదంటూ కేబినెట్ సహచరుల మీద ఫైర్ అవ్వడం, మంత్రి పదవులు పీకేస్తాను జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ భయానికి నిదర్శనాలని వారు అంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడంచబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పిన జగన్.. ప్రతి నియోజకవర్గానికీ మంత్రి పదవి హామీ ఇవ్వడం.. తన క్విడ్ ప్రొకో వ్యవహారాన్ని నియోజకవర్గ ప్రజల దగ్గరకు కూడా తీసుకువెళ్లారని అంటున్నారు. జగన్ ధీమా ప్రకటనలతో క్యాడర్ భరోసాతో ఉండటంతో.. తమతో సమావేశాలలో జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో వైసీపీ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ వస్తుందా అన్న భయం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే జగన్ ఆదేశాలు అమలు చేసే విషయంలో కూడా వారు గతంలోలా ఉత్సాహం చూపడం లేదంటున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కానీ, ఎంతగా ఒత్తిడి వస్తున్నా గడపగడపకూ కు మొహం చాటేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు.  జగన్ తనలో ఓటమి భయాన్ని దాచుకుని బయటకు చూపుతున్న గాంభీర్యం ‘రాజుగారి దేవతా వస్త్రం’లాగే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఓటమి భయంతో.. తన వల్ల కాదు.. ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు పార్టీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయని జగన్ చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనీ, అందుకే ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీ అయిన రెండు సందర్భాలలోనూ ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బటన్ నొక్కి తాను ప్రజాభిమానాన్ని చూరగొని పార్టీ గ్రాఫ్ పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం తన వ్యవహార శైలితో ప్రజలలో చులకన కావడమే కాకుండా పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ పరువును మంటగలుపుతున్నారని జగన్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యేల ముఖం మీదే చెప్పేస్తున్నారు. జగన్ కు అవకాశం ఉంది కనుక బటన్ నొక్కు తున్నారనీ, తమకు ఆ అవకాశం ఇచ్చి నియోజకవర్గంలోని లబ్ధి దారులకు సంక్షేమం పంపిణీ చేసేందుకు ఆ బటన్ ను తమకు ఇస్తే తమ గ్రాఫ్ కూడా పెరుగుతుంది కదా అని వారంటున్నారు. ఒక వైపు ఇన్ చార్జిలు, మరో వైపు వాలంటీర్లు తమపై పెత్తనం చెలాయిస్తుంటే.. నియోజకవర్గంలో డమ్మీలుగా మిగిలిపోయామనీ, అందుకే ప్రజా వ్యతిరేకత అనేది ప్రభుత్వ విధానాల వల్ల, వాలంటీర్ల నిర్వాకం వల్లా వచ్చిందే తప్ప తమ వల్ల కాదనీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో సిట్టింగులకు సీటు గల్లంతేననిపిస్తోందని వారు అంటున్నారు.  ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పటికే తమకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ రాదన్న స్థిర నిశ్చయానికి వచ్చేసినట్లు అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్19)న ఎమ్మెల్యేలతో జగన్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ మళ్లీ పాత పాటే పాడితే ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మంత్రులకు పదవులు ఊడబీకేస్తానని హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడమే కాకుండా ఆయన హెచ్చరికలను లైట్ గా తీసుకున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చినా ఖండించనందుకు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా మంత్రులు లైట్ తీసుకోవడమే వారు జగన్ నాయకత్వంపై గతంలోలా విశ్వాసం చూపడం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇక ఈ నెల 19న జరిగే సమావేశం విషయంలో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. గత రెండు సమావేశాలలో ఎదురైన అనుభవమే మరో సారి ఎదురౌతుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని జగన్ క్లాస్ తీసుకుంటారనీ, అసలు నియోజకవర్గంలో పని చేసే అవకాశమే లేని తాము పని తీరు ఎలా మెరుగుపరుచుకోవాలని మధన పడుతున్నారు. ఈనెల19న జగన్ అన్ని నయోజకవర్గాలకు సంబంధించిన ఎమ్యెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యలు, సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు.   ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్న జగన్   ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లు ఇచ్చి క్లాస్ పీకే అవకాశాలున్నాయని ఎమ్మెల్యేలే అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి కూడా సమావేశం తమకు క్లాస్ పీకడానికే పరిమితమైతే మాత్రం తమ సమస్యలను కూడా అధినేతకు ఎలుగెత్తి చెబుతామని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ నెల 19న జరిగే నియోజకవర్గాల సమీక్ష వైసీపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  జగన్ సమక్షంలోనే అసమ్మతి కట్టలు తెంచుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు.

విమోచ‌న‌దినోత్స‌వంలో  కిష‌న్ .. మోదీ, షాల భ‌జ‌న‌

తెలంగాణా విమోచ‌న‌దినోత్స‌వం సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ అమ‌ర‌వీరుల‌కు ఇది నిజ‌మైన శ్ర‌ద్ధాంజ‌లి అన్నారు. తెలంగాణా గ‌డ్డ మీద కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌డం వ‌ల్ల అమ‌ర‌వీరులకు నిజ‌మైన శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన‌ట్ల‌యింద‌ని అన‌డం బీజేపీ వారిదే దేశ‌భ‌క్తి అని ప్ర‌చారం చేసుకున్న‌ట్టే ఉంది.  సర్థార్ వల్లభాయ్ పటేల్ చిత్ర‌ప‌టానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరు లకు నివాళులు అర్పించిన అమిత్ షా  సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. కానీ  75ఏళ్ళ తెలం గాణ ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన‌డం తెలంగాణా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కేవ‌లం మోదీ, బీజేపీ వ‌ల్లే తీరాయ‌నే భావాన్ని ప్ర‌చారం చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అని విశ్లేష‌కులు అంటున్నారు.  తెలంగాణ సర్కార్  అధికారికంగా జెండాను ఎగురవేయనుండటం ప్రజల విజయమ‌ని  కిష‌న్ రెడ్డి అన్నా రు.  తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహిస్తోందనీ అన్నా రు. తెలంగాణా ప్రాంతీయుడ‌యి తెలంగాణాచ‌రిత్ర తెలిసి కూడా బీజేపీ వ‌ల్లే అన్నీ సాధ్య‌మ‌ వుతున్నా య‌న‌డం ఆయ‌న మోదీ భ‌జ‌న‌కు ప‌రాకాష్ట‌గానే చూడాల్సివ‌స్తుంది.  తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు.. ఎనిమిది కోట్ల కళ్ళతో ఎదురుచూస్తోన్న రోజని తెలిపారు. 75 ఏళ్ళ తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణగడ్డపై జాతీయ జెండాను కేంద్రమంత్రి అమిత్ షా ఆవిష్కరిం చారని...అమరవీరులకు  నేడు నిజమైన శ్రద్ధాంజలని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణాను ఎన్న‌ డూ ఏ కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు, కేవ‌లం బీజేపీ స‌ర్కార్ అందునా మోదీ వ‌చ్చిన త‌ర్వాత‌నే తెలంగాణా ఆశ‌యాలు సిద్ధిస్తున్నాయ‌న్న‌ది మంత్రి కిష‌న్రెడ్డి అభిప్రాయం కావ‌చ్చు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి  మొట్టికాయ‌లే త‌ప్ప మ‌రేమీ లేదు. ప‌క్క‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద చూపుతున్న ప్రేమ‌తో పోలీస్తే తెలం గాణా మీద కేంద్రానికి ఉన్న‌ది స‌వ‌తి ప్రేమే.  కేవ‌లం తెలంగాణాలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌తీయ‌డానికి వేస్తున్న ఎత్తుగ‌డ‌ల్లో భాగంగానే ఇక్క‌డ బీజే పీ ప్ర‌త్యేకించి విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఆజాద్ కా అమృత మహోత్సం కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా విమోచనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ , టీడీపీ , టీఆర్ఎస్‌లు అధికారికంలో ఉండగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించ లేదన్నారు. 

కేంద్రం మౌనం.. ఏపీలో బీజేపీకి డ్యామేజ్!

మూడు రాజధానుల విషయంలో వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. జనం వ్యతిరేకిస్తున్నా.. కోర్టులు మొట్టికాయలు వేసినా, చివరాఖరికి నిన్న మొన్నటి దాకా అన్నందాలా అండగా నిలిచిన బీజేపీ సైతం అమరావతే ఏకైక రాజధాని అని నిక్కచ్చిగా చెబుతున్నా జనం తీరు మారడం లేదు. అయితే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టినా, ప్రకటనలు గుప్పించినా ఏపీ ప్రజలు మాత్రం జగన్ ప్రతి నిర్ణయానికీ బీజేపీ అండ ఉందనే ఇంకా నమ్ముతున్నాయి. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకూ ఏపీ ప్రజలలో బీజేపీ తాను జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని నమ్మించగలిగే అవకాశం లేదు.అమరావతే రాజధాని అంటే బీజేపీ విస్పష్టంగానే ప్రకటనలు గుప్పిస్తోంది. ఎలాంటి బేషజాలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్నీ వెలిబుచ్చుతోంది. అసెంబ్లీలో జగన్ మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన రోజునే కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఏపీ రాజధాని అమరావతే అని విస్పష్టంగా ప్రకటించారు. రాజధాని విషయంలో జగన్ రాజకీయాలు చేస్తున్నారనీ, అవేవీ నడవవనీ, అసెంబ్లీ ఎక్కడ ఉంటే అదే రాజధాని అనీ విస్పష్టంగా తేల్చేశారు. కేంద్ర మంత్రి ఏదో యథాలాపంగా వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేము. కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్న తరువాతనే ఆయన రాజధాని అమరావతే నని విస్పష్టంగా ప్రకటించగలిగారు. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ కూడా రాజధాని అమరావతేననీ, ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదని తేల్చేశారు. ఇప్పుడు జగన్ అనుకున్నంత మాత్రాన రాజధాని మార్చడం అయన వల్ల కాదన్నారు. అయితే ఇదే బీజేపీ, కేంద్రం, కేంద్ర మంత్రులు కొంత కాలం కిందటి వరకూ రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమనీ, కేంద్రానికి సంబంధం లేదనీ చేసిన వ్యాఖ్యలను జనం మరచిపోలేదు. బీజేపీ గత మూడేళ్లుగా మూడు రాజధానుల విషయంలో జగన్ కు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చిందనే భావనే వారిలో బలంగా నెలకొని ఉంది. ఇప్పుడు రాజధాని విషయంలో బీజేపీ అమరావతికి మద్దతు అని ప్రకటనలు గుప్పిస్తున్నా.. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలుగానే ఏపీ ప్రజ భావిస్తోంది. కేంద్రం నుంచి రాజధాని అమరావతికి అనుకూలంగా చర్యలు కనిపిస్తే తప్ప ప్రజలు కమలం పార్టీ ఏపీ నేతల ప్రకటనలు విశ్వసించే పరిస్థితి లేదు. హై కోర్టు తీర్పును పట్టించుకోకుండా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ పై ఒత్తిడి తేవడంతో పాటు విభజన హామీల మేరకు కేంద్ర సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేసే విషయంలో వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుంది.  అప్పుడే ఏపీ జనం బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని, రాజధానిగా అమరావతే ఉండాలన్న విషయంలో ఆ పార్టీ చిత్తశుద్ధితోనే ఉందనీ నమ్మే అవకాశం ఉంది.

వెవ్వెవ్వె..!

చెల్లి పెళ్లికి అక్క‌లు, అన్న‌లు అంద‌రూ వ‌చ్చారు. ఆ వీధంతా పెళ్లి సంద‌డితో నానా హ‌డావుడిగా ఉంది. బంధువులు అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ యిద్ద‌రు త‌ప్ప ఇద్ద‌రూ ఎడ‌మొహం పెడ మొహం పెట్టుకుని కుర్చీలో అలా కూర్చునే ఉన్నారు. ఒకాయ‌న పేప‌రు, మ‌రొకాయ‌న కాఫీ గ్లాసుతో ఉన్నారు. పెళ్లికి ర‌మ్మ న్నారే గాని త‌న‌కు ఇస్తాన‌న్న స్కూట‌రు మాట ఏడాది నుంచి దాటేస్తున్నార‌ని చిన్నాయ‌న‌, చిన్నాయనకు మాట ఇచ్చి త‌న‌కు క‌నీసం ఒక్క ఉంగ‌రం చేయిస్తాన‌నీ అన‌లేద‌ని పెద్దాయ‌న ఆగ్ర‌హిం చారు. బావుం ది చోద్యం.. అనుకుంటూ ఆ ఇంటి పెద్దావిడ మాట క‌ల‌ప‌డానికి వ‌స్తే స‌సెమిరా అంటూ కుర్చీలు ఎత్తుకుని మ‌రీ దూరంగా వెళ్లారు. అదుగో అలా ఉండి షాంగైలో స‌మావేశ దృశ్యం. ప‌క్క‌ దేశాల‌వారే ప‌క్కింటి శ‌తృ వుల్లా వ్య‌వ‌హ‌రించారు.  ప్లాస్టిక్ న‌వ్వుల ఫోటోకి ప‌రిమిత‌మ‌య్యారు మోదీ. షాంఘై సహకార సంఘం సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్థాన్‌లకు షాకిచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌‌తో ఆయన మాట్లాడలేదు. వాళ్లవైపు కన్నెత్తి కూడా చూడలేదు. కరచాలనం కూడా చేయలేదు. కేవలం గ్రూప్ ఫొటో మాత్రం దిగారు. అయితే ఆ గ్రూప్‌ ఫొటో లో అతి సమీపంలోనే ఉన్నా ఈ నేతలతో మోదీ మాట్లాడలేదు. సమావేశాల్లోని మిగతా సందర్భా ల్లోనూ మోదీ వారికి అతి సమీపంగా ఉన్నా మాట్లాడలేదు. డిన్నర్ సమావేశానికి కూడా మోదీ డుమ్మా కొట్టారు.  మ‌రేం చేస్తారు? ప‌క్క‌నే ఉంటూ, మిత్ర‌దేశంలా వ్య‌వ‌హ‌రిస్తూ దాడుల‌కు పాల్ప‌డ్డం ఎవ‌రు భ‌రిస్తారు?   పైకి  స్నేహ‌పూర్వ‌కంగా మాట్లాడుతూనే, మ‌రీ భూక‌బ్జాదారుల్లా చైనా సైన్యం వ్య‌వ‌హరించి గొడ‌వ‌ల‌కు దిగింది. మా వ‌ల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండ‌ద‌ని అంటూనే గ‌ల్వాన్‌లో 2020 జూన్‌ 15న గల్వాన్ లోయలో చైనా సై న్యం కుట్రపూరితంగా చేసిన దాడిలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు చనిపోయారు. భార త సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. గల్వాన్ ఘటన జరి గిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో వ్యాపార, వాణిజ్య సం బంధాలను ఆపివేసింది. నాటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించేం దుకు భారత్, చైనా సైన్యాల మధ్య చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే చైనా తీరులో భారత్ కోరుకున్న మార్పు రాకపోవడంతో మోదీ జిన్‌పింగ్‌తో మాట్లాడలేదని తెలుస్తోంది. షాంఘై సహకార సంఘం సమావేశాల సందర్భంగా మోదీ జిన్‌పింగ్‌ను పట్టించుకోకపోవడం కలకలం రేపింది.  ఇక  పాక్ విష‌యానికి వ‌స్తే, ఉగ్రవాదంపై పాకిస్థాన్ రెండు నాల్కల  ధోరణిలో వ్యవహరిస్తుండటంతో మోదీ, షరీఫ్‌తో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అయితే అంతర్జాతీయ వేదికలపై  చైనా, పాకిస్థాన్‌లకు ఏకకాలంలో షాకివ్వడం భారత దృఢవైఖరిని తెలియజేసినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.  ఇక్క‌డే చిన్న ట్విస్ట్‌.. ఇదే సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రస్తుతం యుద్ధకాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపా క్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ఆపివేయాలని కోరారు. యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందు కు సహకరించినందుకు మోదీ పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షికచర్చల్లో భాగంగా ఇద్దరు నేత లూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిం చారు.    యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై స్పందించిన పుతిన్ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధం ఆపాలనుకుంటున్నామని, సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని చెప్పారు. సంక్షోభ వేళ భారత్ ప్రతిస్పందనను తాము అర్థం చేసుకోగలమని పుతిన్ చెప్పారు.  షాంఘై సహకార సంఘంలో ప్రస్తుతం 8 సభ్య దేశాలుగా ఉన్నాయి. చైనా, భారత్, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగో లియా పరిశీలక దేశాలుగా పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. 1996లో షాంఘై సహకార సంఘం ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్నది 22వ సదస్సు. 

మోడీ వర్సెస్ ఎవరు? రేసులో నలుగురు సీఎంలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆతర్వాత ప్రధాన మంత్రి అయ్యారు. అలాగే, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, రేపు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అయితే,ఆ ఇద్దరి మధ్య ఉన్న పోలిక ఇద్దరు ముఖ్యమంత్రులు కావడం ఒక్కటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా, అంటే  చెప్పుకోదగ్గ సారూప్యాలు అయితే ఉన్నట్లు కనిపించడం లేదు.   ఆ ఒక్క కామన్ ఫాక్టర్  తోనే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? అంటే, కానూ వచ్చును కాకపోనూ వచ్చును, కొయ్య గుర్రం ఎగరా వచ్చును.  కానీ, ముఖ్యమంత్రి మోడీ ప్రధాని మోడీ అయ్యారు కాబట్టి, అదే ఫార్ముల ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అవుతారని అనుకుంటే మాత్రం అది అయ్యే పని కాదు. మోడీకి ఉన్న బలం కేవలం ముఖ్యమంత్రి పదవి కాదు. ఆయన వెనక జాతీయ వాదం  పునాదుల మీద ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగిన  బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలున్నాయి.  ఆ విషయం అలా ఉంటే, నిజానికి, మోడీకి ముందు గతంలోనూ మొరార్జీ దేశాయ్ మొదలు మన పీవీ వరకు ప్రధాని పీఠాన్ని అలంకరించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. దేవెగౌడ, చరణ్ సింగ్ కూడా ఆ కోవలోకే వస్తారు. అయితే, అందులో ఏ ఒక్కరూ కూడా, కష్టపడి నిచ్చెన మెట్లు ఎక్కిన వారు కాదు. అనుకోకుండా, ఆశించకుండానే ప్రధానులయ్యారు. అందులో, రిటైర్మెంట్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన పీవీ మినహా మిగిలిన ఏ ఒక్కరు కూడా ఐదేళ్ళు కాదు, అందులో సగం రోజులు కూడా ప్రధాని కుర్చీలో స్థిరంగా కూర్చో లేదు. చరణ్ సింగ్ అయితే పార్లమెంట్ ముఖం అయినా చూడకుండానే ఇంటి ముఖం పట్టారు.  అయితే ప్రధాని నరేంద్ర మోడీ అలా కాదు, ప్రజామోదంతో ప్రదాని అయ్యారు.అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు ప్రధాని అయ్యారు. రెండుసార్లు కూడా సొంత (పార్టీ) బలంతోనే అధికారాన్నిఅందుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ/ఎన్డీఎ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుగానే ప్రకటించింది. మోడీ నాయకత్వంలోనే ఎన్నికల బరిలో దిగింది. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా సాగిన సంకీర్ణ శకానికి చుక్క పెట్టింది. ఎన్డీఎ కూటమిగా పోటీ చేసినా, ఒక్క బీజేపీకే 283 (మ్యాజిక్ ఫిగర్ 272) సీట్లు దక్కాయి. 2019లో బీజేపీ సొంత బలం మరింత పెరిగి 303 కి చేరింది. అవును, ఇప్పటికీ  మోడీ ప్రభుత్వం సాంకేతికంగా సంకీర్ణ ప్రభుత్వమే అయినా, నిజానికి సాగుతోంది, బీజేపీ  పాలనే,గిట్టని వాళ్ళు మోడీ షా పాలనా అంటారు అనుకోండి అది వేరే విషయం.  అదొకటి అలా ఉంటే, ఇప్పుడు ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్కోర్స్, కేసీఆర్ సహా ఏ ఒక్కరూ కూడా పీఎం రేసులో ఉన్నామని ప్రకటించక పోయినా, ఎవరి ప్రయత్నాలో వారున్నారు.చివరకు ఏమి జరుగుతుంది? ఏమి జరగదు? అనేది ప్రస్తుతానికి సమాధానం చిక్కని ప్రశ్న. నిజానికి, పీఎం రేసులో ఉన్న ముఖ్యమంత్రులు నలుగురు అయినా,  ప్రధాని పదవిని ఆశిస్తున్న రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఇలా మరి కొందరు మహా నాయకుల జాబితా మరొకటి ఉంది. ఈ జాబితాల్లో చివరకు మిగిలేది ఎవరో.. తెలితేనే కానీ, మోడీ వర్సెస్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం చిక్కదు.

రెబల్ స్టార్ కు రాజ్ నాథ్ సింగ్ నివాళి.. గోప్ప మానవతా వాది అని వ్యాఖ్య

రెబల్ స్టార్ కృష్ణం రాజుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆయన సంస్మరణ సభకు హాజరైన రాజ్ నాథ్ సింగ్  కృష్ణం రాజు గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతా వాది అని అన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణం రాజు సంస్మరణ సభలో ప్రసంగించిన ఆయన కృష్ణం రాజు మరణించారంటే నమ్మలేకపోతున్నానన్నారు. కృష్ణం రాజు కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. బాహుబలి సినిమా విడుదలకు ముందు ఆయన తనకు ఆ సినిమా చూపించారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పార్లమెంటులో గోవధ నిషేధం బిల్లును కృష్ణం రాజే ప్రవేశ పెట్టారని గుర్తు చేసుకున్నారు. సంతాప సభకు  ముందు కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా కృష్ణం రాజుకు సినీ, రాజకీయ రంగాలలో పలువురు అభిమానులు ఉన్నారు. కృష్ణం రాజు రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. సినిమాలలోనే కాదు.. రాజకీయాలలో కూడా ఆయన రారాజుగానే ఉన్నారని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే సినిమాలలో ఎలా అయితే డ్యాన్సులకు స్టెప్పులు వేయడంలో ఆయన ఎలా ఇబ్బంది పడ్డారో.. అలాగే రాజకీయాలలో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ అలాగే ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆయనకు రాజకీయ రంగంలో రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆయన అభిమానులు అంటుంటారు.  తెలుగు సినీరంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరోలు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు ఎంపీలు’ ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అయినా, అందులో మంత్రులై ఓ వెలుగు వెలిగిన వారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో రెబల్ స్టార్’గా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఒకరు.నిజానికి కృష్ణం రాజు కంటే ముందు ఆయత తర్వాత కూడా కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు వరకు, నిర్మాత రామానాయుడు మొదలు మోహన్ బాబు  వరకు, నటశేఖర కృష్ణ మొదలు సత్యనారాయణ వరకు మురళీ మోహన్ మొదలు మెగాస్టార్ చిరంజీవి వరకు, జమున, ఊర్వశి శారద మొదలు విజయశాంతి, జయప్రద వరకు ఇలా పార్లమెంట్ గడప తొక్కిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రలో మంత్రి పదవికి చేరుకుంది మాత్రం  కృష్ణం రాజు, ఆయన తర్వాత చిరంజీవి. ఈ ఇద్దరిని మంత్రి పదవి వరించింది.  అయితే, రెబెల్ స్టార్ సినిమా జీవితం’ ఆయన నటించిన సినిమాలు, చేసిన  పాత్రల విషయాన్ని పక్కన పెట్టి, రాజకీయ జీవితం విషయానికి వస్తే, కృష్ణం రాజు రాజకీయాల్లో ఎక్కడా స్థిరంగా నిలబడలేక పోయారు. సినిమాల్లో నవరసాలు, ముఖ్యంగా రౌద్ర రసాన్ని అద్భుత్వంగా పండించిన కృష్ణం రాజు, పాటలు స్టెప్పులు దగ్గర కొచ్చే సరికి తడబడి పోయేవారని, స్టెప్పులు సరిగా పడేవి కావని అంటారు. రాజకీయాల్లోనూ అంతే, ఆయన స్టెప్పులు సరిగా పడలేదు.నడక సరిగా సాగలేదు. ఏ పార్టీలోనూ స్థిరంగా నిలబడలేదు. అందుకే ఆయన రాజకీయ రంగంలో ఆశించిన పదవులను అందుకోలేక పోయారు. నిజానికి కృష్ణం రాజనే కాదు,సినిమా హీరోలు చాలా వరకు రాజకీయాల్లో అంతగా రాణించలేక పోవడానికి, నిలకడలేని తనం కూడా ఒక కారణమని  విశ్లేషకులు అంటారు. కృష్ణం రాజు తర్వాత కేంద్ర మంత్రి స్థాయికి చేరిన హీరో చిరంజీవి విషయాన్నే తీసుకుంటే, ఆయనా అంతే... ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒక్క ఎన్నికల్లో ఓడి పోగానే, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ గంగలో కలిపేశారు. అఫ్కోర్స్, అలా కాంగ్రెస్’లో కలిపేశారు కాబట్టే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యారు, అనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగా స్టార్, ఆ పార్టీలోనూ నిలవలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీని వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా మళ్ళీ అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. వేషం మార్చి మళ్ళీ రంగుల ప్రపంచంలోకి వచ్చేశారు.  కృష్ణం రాజు కూడా అంతే, 1991 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రాజకీయ అరంగేట్రం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత బీజేపీ తీర్థం పుచ్చున్నారు.1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప తెలుగుదేశం అభ్యర్ధి తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. అదే సమయంలో కేంద్రలో అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో, బీజేపీ సంకీర్ణ ప్రభుతం ఏర్పడింది. అయితే, సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఎన్నికలు రావడంతో, ఆయన 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై పోటీచేసి  1,65,948 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అంతే కాదు, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా రంగం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన తొలి హీరోగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు.2000 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 200 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు.ఆతర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో ఓటమి చెందారు.  ఆతర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు, 2009 మార్చిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు.అయినా, ఆయన 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గవర్నర్ పదవి ఆశించారు కానీ, అదీ దక్కలేదు. చివరకు, ఆ కోరిక తీరకుండానే, లోకాని విడచి వెళ్ళిపోయారు. 

రైతుల పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీల వివాదం

వివాదం లేకపోతే వైసీపీకి పూటగడవదన్నట్లుడగా తయారైంది పరిస్థితి. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. బాపట్ల జిల్లా రేపెల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానేలే ముద్దు అన్న నినాదంతో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రలో  ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా వైసీపీ ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎక్కడా అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకత వ్యక్తం కాలేదు. రేపల్లెలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల లక్ష్యం రైతులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే అన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలకు ముందు ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు వైసీపీ మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా రేపల్లెలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని రైతులు నిరసిస్తున్నారు. రేపల్లెలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు మిగిలిన ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు కూడా ఇలాంటి చర్యలే చేపట్టేలా ప్రోత్సహిస్తాయని రైతులు అంటున్నారు. రైతులది పాదయాత్ర కాదు దండ యాత్ర అని మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు, ఇతర ప్రాంతాల ప్రజలు మీ దగ్గర పనివాళ్లుగా ఉండాలా అంటూ మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని చేసి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అంతే కాకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా కూడా రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ కుట్ర పూరితంగా రైతల పాదయాత్రలో ఉద్రిక్తతలు సృష్టించి శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా జగన్ సర్కార్ వ్యవహరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టడమే లక్ష్యం వినా జగన్ సర్కార్ కు నిజంగా మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఇసుమంతైనా లేదని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ధైర్యం లేక జగన్ వెనకడుగు వేశారని పరిశీలకులు అంటున్నారు. అందుకే అసెంబ్లీలో మూడు రాజధానుల విషయం స్వల్పకాలిక చర్చకే పరిమితం చేశారని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి జగన్  అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ప్రసంగించారే తప్ప   బిల్లు విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. చర్చ జరుగున్నప్పుడు కానీ, చర్చ ముగిసిన తరువాత కానీ ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ సభలో ప్రవేశపెడుతున్నామని మాట మాత్రంగానైనా  చెప్పలేదు. వికేంద్రీకరణే విధానమని పదే పదే చెప్పిన సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు గురించి మాటమాత్రమైనా చెప్పలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందు మాత్రం వైసీపీ వర్గాలు ఈ సమావేశాలలోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమన్నట్లుగా ప్రచారం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉందనీ, బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే తరువాయి అనీ గట్టగా ప్రచారం చేసుకున్న వైసీపీ  బిల్లు ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గింది. అడుగు గడప దాటలేదు కానీ  మంత్రుల మాటలు మాత్రం కోటలు దాటేశాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పరిపాలనా రాజధాని  అంటూ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ బయట ఎప్పుడో ప్రకటనలు గుప్పించేశారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడో రోజుకు చేరినా బిల్లు ప్రస్తావనే లేదు. కానీ మూడు రాజధానులే మా విధానమని ముఖ్యమంత్రి సహా మంత్రులు, వైసీపీ సభ్యులు సభలో ప్రసంగాలు ఘనంగా చేసేశారు. అసలు వాస్తవమేమిటంటే సాంకేతికంగా కానీ, న్యాయపరంగా కానీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు. ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్నిపట్టించుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో బిల్లును ఉపసంహరించుకుంటామని ప్రకటించి వెనక్కు తీసుకున్నారు.  ఇక  రాజధాని రైతులు వేసిన పిటిషన్‌ విచారించిన హై కోర్టు ఆ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజధాని అమరావతిని మార్చే అధికారం అసెంబ్లీకి   లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోర్టు తీర్పును ఉల్లంఘించడం అవుతుంది.  మొండికేసి జగన్ ముందడుగు వేస్తే  ప్రభుత్వానికి చిక్కులు తప్పవని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కోర్టు అక్షింతలు వేయించుకున్న జగన్ సర్కార్ మరో సారి అందుకు సిద్ధంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సందర్భాలలో కోర్టు అధికారులను విస్పష్టంగా హెచ్చరించింది. ధిక్కరణకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఐఏఎస్ లకు కోర్టు తీర్పు ఉల్లంఘించిన కారణంగా సామాజిక సేవ శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మరో సారి కోర్టు ధిక్కరణకు పాల్పడి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే ధైర్యం చేయదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మూడు రాజధానుల బిల్లు ఇక అంతేనా? జగన్ వెనకడుగు వేశారా?

అంతన్నారింతన్నారు.. చివరకు స్వల్ప కాలిక చర్చతో సరిపెట్టేశారు. ముఖ్యమంత్రి జగన్  అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ప్రసంగించారు. అంతే మూడు రాజధానుల బిల్లు విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చర్చ జరుగున్నప్పుడు కానీ, చర్చ ముగిసిన తరువాత కానీ ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ సభలో ప్రవేశపెడుతున్నామన్న మాట చెప్పాలేదు. వికేంద్రీకరణే విధానమని పదే పదే చెప్పిన సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు గురించి మాటమాత్రమైనా చెప్పలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందు మాత్రం వైసీపీ వర్గాలు ఈ సమావేశాలలోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమన్నట్లుగా ప్రచారం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉందనీ, బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే తరువాయి అనీ గట్టగా ప్రచారం చేసుకున్న వైసీపీ  బిల్లు ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గింది.  బిల్లు ప్రవేశ పెట్టడానికి ధైర్యం లేదు కానీ మంత్రుల మాటలు మాత్రం కోటలు దాటేశాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పరిపాలనా రాజధాని  అంటూ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ బయట ఎప్పుడో ప్రకటనలు గుప్పించేశారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడో రోజుకు చేరినా బిల్లు ప్రస్తావనే లేదు. కానీ మూడు రాజధానులే మా విధానమని ముఖ్యమంత్రి సహా మంత్రులు, వైసీపీ సభ్యులు సభలో ప్రసంగాలు ఘనంగా చేసేశారు. అసలు వాస్తవమేమిటంటే సాంకేతికంగా కానీ, న్యాయపరంగా కానీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు. ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో బిల్లును ఉపసంహరించుకుంటామని ప్రకటించి వెనక్కు తీసుకున్నారు.  అదే సమయంలో రాజధాని రైతులు వేసి పిటిషన్‌ విచారించిన హై కోర్టు ఆ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజధాని అమరావతిని మార్చే అధికారం అసెంబ్లీకి   లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోర్టు తీర్పును ఉల్లంఘించడం అవుతుంది. మొండికేసి జగన్ ముందడుగు వేస్తే  ప్రభుత్వానికి చిక్కులు తప్పవని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కోర్టు అక్షింతలు వేయించుకున్న జగన్ సర్కార్ మరో సారి అందుకు సిద్ధంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సందర్భాలలో కోర్టు అధికారులను విస్పష్టంగా హెచ్చరించింది. ధిక్కరణకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఐఏఎస్ లకు కోర్టు తీర్పు ఉల్లంఘించిన కారణంగా సామాజిక సేవ శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మరో సారి కోర్టు ధిక్కరణకు పాల్పడి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే ధైర్యం చేయదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈడీ నోటీసుల ప్రచారం అబద్ధం.. ఇదంతా ఢిల్లీ ప్రచారం: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఈడీ నోటీసులు వచ్చాయని జరుగుతున్నప్రచారాన్ని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ లో ఢిల్లీలో కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అదలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ 18 కంపెనీలు, 12 మంది వ్యక్తులకు నోటసులు ఇచ్చింది. ఈడీ నోటీసులు జారీ చేసిన వారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, చందన్ రెడ్డి, వై. శశికళ, మాగుంట రాఘవలు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మరో వ్యక్తి పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ వ్యక్తి ఎమ్మెల్సీ కవితేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే  మరి పన్నెండో వ్యక్థి ఎవరన్నది మాత్రం స్పష్టత లేదు. ఆ వ్యక్తి కవితేనని మీడియాలో ప్రచారమౌతోంది. దీంతో కవిత ట్విట్టర్ వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారు. కరోనా కారణంగా ప్రస్తతం ఎమ్మెల్సీ కవిత   క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ కారణంగానే ఈడీ ఆమెకు నోటీసులు అందజేయలేదనీ, మిగిలిన వారందరినీ నోటీసులు అందాయనీ అంటున్నారు. అన్నిటికీ మించి నోటీసులు అందుకున్న వారిలో బుచ్చిబాబు గోరంట్ల కవిత ఆడిటర్ కాగా.. అరుణ్ పిళ్లై, అభిషేక్ సన్నిహితులు.