ఈడీ నోటీసుల ప్రచారం అబద్ధం.. ఇదంతా ఢిల్లీ ప్రచారం: కవిత
posted on Sep 17, 2022 6:30AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఈడీ నోటీసులు వచ్చాయని జరుగుతున్నప్రచారాన్ని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ లో ఢిల్లీలో కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
అదలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ 18 కంపెనీలు, 12 మంది వ్యక్తులకు నోటసులు ఇచ్చింది. ఈడీ నోటీసులు జారీ చేసిన వారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, చందన్ రెడ్డి, వై. శశికళ, మాగుంట రాఘవలు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే మరో వ్యక్తి పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ వ్యక్తి ఎమ్మెల్సీ కవితేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి పన్నెండో వ్యక్థి ఎవరన్నది మాత్రం స్పష్టత లేదు. ఆ వ్యక్తి కవితేనని మీడియాలో ప్రచారమౌతోంది. దీంతో కవిత ట్విట్టర్ వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారు. కరోనా కారణంగా ప్రస్తతం ఎమ్మెల్సీ కవిత క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ కారణంగానే ఈడీ ఆమెకు నోటీసులు అందజేయలేదనీ, మిగిలిన వారందరినీ నోటీసులు అందాయనీ అంటున్నారు. అన్నిటికీ మించి నోటీసులు అందుకున్న వారిలో బుచ్చిబాబు గోరంట్ల కవిత ఆడిటర్ కాగా.. అరుణ్ పిళ్లై, అభిషేక్ సన్నిహితులు.