కోవిడ్ మరణాల నివారణలో ఘోరం వైఫల్యం: లాన్సెట్ నివేదిక
posted on Sep 17, 2022 @ 12:28PM
కోవిడ్ 19 మరణాల నివేదికలో ప్రపంచ దేశాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని లన్సెట్ నివేదిక పేర్కొంది. లాన్సెట్ వెల్లడించిన నివేదిక ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనా మేరకు 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారు. ఇది జూలై 1-2021 నాటి నివేదిక కాగా, మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమైన కారణంగా ప్రజలు ఏమిజరుగుతుందో ఆర్ధం చేసుకునేలోగా పిట్టల్ల రాలిపోయారని నివేదిక పేర్కొంది.
ఘటన తీవ్రంగా కలిచివేసిందని. ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని.లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ నివేదిక పేర్కొంది. ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని అయితే కోవిడ్ మరణాలన్నిటినీ సక్రమంగా నమోదు చేయని కారణంగా వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని నివేదిక విశద పరిచింది. కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రపంచ దేశాలు సంప్రదింపుల సంప్రదాయాన్ని విస్మరించడమే ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో వైఫల్యం కారణంగానే అభివృద్ధి కుంటుపడి పురోగమనం నుంచి తిరోగమనం వైపు వేగంగా పయనించిందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ పతనం కావడాన్ని ఉదాహరణగా పేర్కొంది. న్యూ లాన్సెట్ కోవిడ్19 కమిషన్ నివేదిక మేరకు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రపంచ దేశాలు స్పందించిన తీరు అత్యంత నిరాశా జనకంగా ఉందని, వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రపంచ దేశాల వైఫల్యాలకు పారదర్శకతలోపం, జాత్యాహంకారం, ప్రాజారోగ్యం పరిరక్షణ విషయంలో ప్రణాళికా రాహిత్యం కారణాలుగా ఆ నివేదిక పేర్కొంది. చాలా ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధత కనపరచలేదనీ బాదితుల పట్ల
శ్రద్ధ వహించలేదనీ పేర్కొంది. అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించడం కూడా కరోనా విస్తృత వ్యాప్తికి కారణమని పేర్కొంది. కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడం లో మనకు ఒక గుణపాఠం తీసుకోవాలని నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక ప్రణా ళిక తోనే సామాజిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పథంలో సాగాలని లాన్సేట్ నివేదికలో పేర్కొంది.