విమోచనదినోత్సవంలో కిషన్ .. మోదీ, షాల భజన
posted on Sep 17, 2022 @ 11:10AM
తెలంగాణా విమోచనదినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమరవీరులకు ఇది నిజమైన శ్రద్ధాంజలి అన్నారు. తెలంగాణా గడ్డ మీద కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించడం వల్ల అమరవీరులకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లయిందని అనడం బీజేపీ వారిదే దేశభక్తి అని ప్రచారం చేసుకున్నట్టే ఉంది.
సర్థార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరు లకు నివాళులు అర్పించిన అమిత్ షా సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. కానీ 75ఏళ్ళ తెలం గాణ ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం తెలంగాణా ప్రజల ఆకాంక్షలు కేవలం మోదీ, బీజేపీ వల్లే తీరాయనే భావాన్ని ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసం అని విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ సర్కార్ అధికారికంగా జెండాను ఎగురవేయనుండటం ప్రజల విజయమని కిషన్ రెడ్డి అన్నా రు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహిస్తోందనీ అన్నా రు. తెలంగాణా ప్రాంతీయుడయి తెలంగాణాచరిత్ర తెలిసి కూడా బీజేపీ వల్లే అన్నీ సాధ్యమ వుతున్నా యనడం ఆయన మోదీ భజనకు పరాకాష్టగానే చూడాల్సివస్తుంది.
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు.. ఎనిమిది కోట్ల కళ్ళతో ఎదురుచూస్తోన్న రోజని తెలిపారు. 75 ఏళ్ళ తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణగడ్డపై జాతీయ జెండాను కేంద్రమంత్రి అమిత్ షా ఆవిష్కరిం చారని...అమరవీరులకు నేడు నిజమైన శ్రద్ధాంజలని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణాను ఎన్న డూ ఏ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేవలం బీజేపీ సర్కార్ అందునా మోదీ వచ్చిన తర్వాతనే తెలంగాణా ఆశయాలు సిద్ధిస్తున్నాయన్నది మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయం కావచ్చు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి మొట్టికాయలే తప్ప మరేమీ లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్న ప్రేమతో పోలీస్తే తెలం గాణా మీద కేంద్రానికి ఉన్నది సవతి ప్రేమే.
కేవలం తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే ఇక్కడ బీజే పీ ప్రత్యేకించి విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నది అందరికీ తెలిసిందే. ఆజాద్ కా అమృత మహోత్సం కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా విమోచనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ , టీడీపీ , టీఆర్ఎస్‌లు అధికారికంలో ఉండగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించ లేదన్నారు.