అటు బాబు, ఇటు అమిత్ షా.. ఒకటే క్లాసు!
posted on Sep 17, 2022 @ 4:45PM
చేతులే ఆయుధాలు కావాలి.. ఒక్కొక్కరూ ఒక్కో సైనికుడయి విజృంభించాలి.. ఇలాంటి ఆవేశంతోనే బాహు బలి తనచుట్టూ ఉన్న పదిమందినీ యుద్దానికి ప్రేరేపిస్తాడు. అటు ఆంధ్రాలో జగన్‌ను తోసేయ డంలో చంద్రబాబు తమ పార్టీవారికి బాహుబలిలానే ఉద్యమించే గట్టి ప్రసంగమే చేశారు. ఇటు తెలం గాణాలో కేసీఆర్ ని గద్దె దింపి రాజ్యం అధీనం చేసుకోవడానికి బీజేపీ అమిత్ షా కూడా బాబు పంథానే అనుసరిం చారు.
యుద్ధంలోనైనా, ఎన్నికల్లో నైనా గెలవాలంటే వ్యూహాలమాట ఎలా ఉన్నా, నాయకుడు ఒక్కడే కాలికి బలపం కట్టుకుని దేశమంతా, రాష్ట్రమంతా తిరగలేడు, భారీ ప్రసంగాలు, హెచ్చరికలు చేస్తూ దవడలు నొప్పి తెచ్చుకోలేడు. కాలం మారింది. ఇపుడంతా మొబైల్ ప్రచారాలే సాగుతున్నాయి.కానీ పార్టీలో ఇతర నాయకులు, వీరాభిమానులు అందరూ తమ తమ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా జనాల్లోకి వెళ్లాలి, తిరగాలి, ప్రజల్ని పార్టీపట్ల ఆకర్షితులయ్యేలా చేయాలి. అపుడే పార్టీ అధినేత అనుకున్న లక్ష్యాన్ని సాధిం చగల్గుతాడు, పార్టీకి ఎంతో ప్రతిష్ట ఉంటుంది. అలాగాకుండా పప్పురుబ్బడం, గారెలు వేసి పచ్చడితో ప్లేట్లో పెట్టడం.. అంతా నాయకుడు ఒక్కడే చేయాలంటే కుదరదు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా పరిగెట్టాలి. నాయకుడి కంటే ఒక అడుగు ముందుండాలి. అదే మాట తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ మధ్య తన పార్టీ ప్రతినిధులతో చాలా సీరియస్‌గానే చెప్పారు.
అంతేకాదు, పార్టీ విజయానికి పాటుపడటం కొందరి పనే కాదు, ప్రతీ ఒక్కరి బాధ్యత అంటూ హెచ్చరించారు. పార్టీ విజయా నికి ఎవరు నిజంగా కృషి చేస్తున్నారు, ఎవరు కేవలం ఉపన్యాసాలు, ప్రకటనలతో సరిపెట్టుకుంటున్నారన్న సమాచారం ఆల్‌రెడీ తన వద్ద ఉందని, చర్యలు తీసుకుం టానని హెచ్చరించారు. వాస్తవానికి ఆంధ్ర లో గెలవడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి గనుక బంగారు అవకాశాన్ని చేజార్చు కోరాదన్న ది ఆయన మాట. అదే శాసనంగా పార్టీ వర్గాలు తీసుకోవాలి, ముందడుగు వేయాలి. అంతే కాని పరిస్థితులు బాగానే ఉన్నాయి, జగన్‌కు అంతటా వ్యతిరేకతే ఉంది గనక మనం ఇంట్లో కూర్చుంటే చాలు గెలిచేస్తామ అని, పదవులు వచ్చేస్తాయని అనుకుంటే చంద్ర బాబు సాగనీయరు.
ఇదిలా ఉండగా, తెలంగాణాలో కేసీఆర్ పాలన పట్ల విముఖత ఎంతో ఉన్నందువల్ల బీజేపీ మరింత ఉద్య మించాల్సిన అవసరం ఉందని సేమ్ టు సేమ్ చంద్రబాబులానే కేంద్రమంత్రి అమిత్ షా బీజేపీ వర్గాల ను హెచ్చరించారు. ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వచ్చిన అవకాశాన్ని మనం సద్విని యోగం చేసుకోవాలని, ఇంతకంటే మంచి తరుణం మరోసారి దక్కదు గనుక మనసుపెట్టి కాస్తంత శ్రమించి పార్టీ ని ప్రజల్లోకి మరింత తీసికెళ్లి ఓట్లు పడేలా పనిచేయమని హెచ్చరించారు. దేశంలో వెలిగిపోతు న్నంత మాత్రాన తెలంగాణాలో అధికారంలోకి ఇట్టే వచ్చేస్తుందన్న భ్రమలో ఉండవద్దని షా తెలంగానా బీజేపీ నాయకులను హెచ్చరించారు. కేసీఆర్ కేంద్రంపై దృష్టిపెట్టి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు గనుక రాష్ట్ర ప్రజ లకు బీజేపీ దగ్గరయి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించి టిఆర్ ఎస్‌కు బుద్ధి చెప్పా ల్సి న అవసరం ఎంతో ఉందని అమిత్ షా మనసులో మాట. పార్టీ పథకాలు, పాలనా విధానాలు, తెలంగాణా రైతాంగం పట్ల ప్రత్యేక దృష్టి, అభివృద్ధికి పార్టీ ఎలా కంకణం కట్టుకుంది ప్రజల్లోకి తీసికెళ్లాలని అమిత్ షా తెలంగాణా బీజేపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు కూడా క్లాస్ తీసుకున్నారు.
మరి ఈ నాయకుల ప్రతిన, మనోభీష్టం ఏ మేరకు విజయాలను ఇస్తుందన్నది చూడాలి. అయితే చంద్ర బాబు హెచ్చరికలు ఆంధ్రాలో నాయకులు, పార్టీ అభిమానులు బాగా చెవికి ఎక్కించుకునే అవకా శం ఉంది. అక్కడ నాయకుని భాషా, ఆవేశం వారికి అవగతమే. కానీ అమిత్ షా ప్రసంగం, ఆయన ఆగ్రహం మరి తెలంగాణా బీజేపీ వారు ఏమాత్రం పూర్తిగా అర్ధంచేసుకున్నారన్నదే సందేహం.