రేవంత్ మరో రాజకీయ ఎత్తు!
posted on Sep 17, 2022 @ 3:10PM
దేవతను పలురకాలుగా పూజిస్తారు. అమ్మవారు పలుపేర్లు కలది. విజయవాడ దుర్గ, కలకత్తా కాళి అంటారు. కాలక్రమంలో భాషాపర దేవతలూ వచ్చారు. తెలుగునాట తెలుగు తల్లి అంటూ చాలాకాలం నుంచి ప్రచారంలో ఉంది. ఇపుడు కొత్తగా తెలంగాణా తల్లి, తెలంగాణాలోనే తెలంగాణా కాంగ్రెస్ తల్లి విగ్రహాలు తయారయ్యాయి. ఈ విషయంలోనూ రాజకీయరంగు పులుము కోవడమే విడ్డూరం. రేవంత్రెడ్డి ఆలోచన ఆయన వరకూ బాగుండేదేమో. ఎవర్ని రెచ్చగొట్టడానికి ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్ తెలంగాణా తల్లి అంటూ కొత్త విగ్రహాన్ని తెరమీదకి తెచ్చారో కాంగ్రెస్ సీనియర్లు చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగుతల్లి విగ్రహం రూపు ఇలా ఉండాలని నిర్ధారించుకుని విగ్రహం ఏర్పా ట్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి మీద గీతాలు వచ్చాయి. కాలక్రమంలో సమై క్యాం ధ్రా కాస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాగా విడిపోయింది. తెలుగు నేల రెండు రాష్ట్రాలయింది. అటు వాళ్లు, ఇటు వాళ్లు అంతా బాగానే ఉన్నాం. కానీ తెలుగు తల్లికి పోటీగా తెలంగాణా తల్లి రూపొం దించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభ రణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రిం చారు. చీర, కరీంనగర్ వెండి మట్టెలు, కోహినూర వజ్రం, జాకబ్ వజ్రం, పాలమూరు, మెదక్, అది లాబాద్ మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు,నిజామాబాద్ వరంగల్, కరీంనగర్ జి ల్లాల సం స్కృ తికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా , రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీ టంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం,వడ్డాణం,జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుది మెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశే షాలు ప్రతిఫలించాయి.
ఆంధ్రాలో తెలుగు తల్లి, తెలంగాణా లో తెలుగు తల్లి అంటూ రెండు రకాల ఆరాధన ఉంది. ఇపుడు కొత్తగా తెలంగాణా కాంగ్రెస్ వారూ ఒక తెలుగు తల్లికి శ్రీకారం చుట్టారు. విగ్రహానికి కాంగ్రెస్ మూడు రంగుల చీర చుట్టారు. ఎడమచేతిలో జొన్న కంకులు పెట్టారు, మెడలో వెండి కడియం, కాళ్లకు మెట్టెలు అలంకరిం చారు. ప్రతీదీ రాజకీయ దృష్టితో చూడటం, ఆధిపత్య పోరులో అన్నింటినీ వదిలేయడం లేదా నిర్లక్ష్యం చేయడం ఒక పద్ధతిగా అమలు చేస్తూ రాజకీయ రంగంలో ప్రత్యర్ధి కంటే ఒక మెట్టు పైనే ఉన్నామని ప్రకటించుకోవడం, ప్రచారం చేసుకో వడంలో జాతీయ చిహ్నాలను, రాష్ట్ర చిహ్నాలను కూడా లెక్కలోకి తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది.
మరి రేపో మాపో.. అయితే గీతే అయినంపూడి సంబంధంలా.. బీజేపీవారూ తెలుగుమీద దేశభక్తి స్థాయిలో అమాంతం ప్రేమ పెంచుకుంటే మరి ఆ తల్లికి కాషాయం కడతారేమో, ఎడమచేతిలో కమలం పెడ తా రేమో! ఎందుకంటే, ఏకంగా మూడు సింహాల గుర్తే వీజీగా మార్చేశారు. కాస్తంత శాంతంగా కనిపించే సింహాలు బీజేపీ సర్కారు వారి ఆదేశానుసారం మనిషి కనిపిస్తే మింగేసేట్టు కోరలు బయటికి పెట్టుకు న్నాయి ప్రతీ విగ్రహంలోనూ! అయినా రాజు తలచుకోవాలేగాని, రాత్రి వచ్చిన కలని సాకారం చేయడం ఎంత సులువో దేశంలో!