షా వచ్చిన వేళ.. బయటపడ్డ సెక్యూరిటీ లోపం
posted on Sep 17, 2022 @ 3:54PM
ఒక పారిశ్రామికవేత్త ఇంట్లో బారసాల వేడుక. కేంద్రమంత్రి రివ్వున కారులో వచ్చి అందర్నీ పలకరి స్తాడు. తీరా వెళ్లేముందు ఒక కుర్రాడు బైక్ మీద వచ్చి అడ్డుకుంటాడు. కోపంతో మంత్రి చూస్తాడు, సెక్యూరిటీ కొట్టబోతారు, అంతలో వెనగ్గావున్న కాన్వాయ్ వాహనాల్లో రెండు గాల్లోకి లేస్తాయి..హీరో నలు గుర్ని తన్ని మంత్రి ని వెక్కిరించి మరీ పారిపోతాడు.. ఇదంతా సినిమా సీన్. హరిత ప్లాజా దగ్గర ఇలాం టివేమీ జరగలేదు కానీ కేంద్రహోంమంత్రి అమిత్ షా వాహనాన్ని మాత్రం ఒక కారు అడ్డు కుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అమి త్ షా హరిత ప్లాజా వైపు పయనమయ్యారు. అమిత్ కాన్వాయ్ వెళుతుండగా ఓ కారు అడ్డంగా రావ డంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగుల గొట్టారు. హరిత ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కొత్త కారు అమి త్ షా కాన్వాయ్ కి అడ్డుగా వచ్చింది. దాంతో అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయింది.
ఎంతకీ ఆ కారు పక్కకి తొలగకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగులగొట్టారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వస్తే ఇలా గేనా భద్రత ఏర్పాట్లు చేసేది? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రికే ఇలాం టి పరి స్థితి ఎదురైతే ఇతరులను ఎలా రక్షిస్తారని మండిపడ్డారు.
కేంద్రప్రభుత్వం కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో తెలంగాణా విమోచన కార్యక్రమా నికి ప్రత్యేక ఆహ్వానం మేరకు షా వచ్చారు. కనుక ఇక్కడ ప్రభుత్వం రక్షణ పరంగా ప్రత్యేక శ్రద్ధ కన పరచ లేదని బీజేపీ వర్గాల ఆగ్ర హం. ఎలా వచ్చినా వచ్చింది కేంద్రమంత్రి గనుక రాష్ట్ర ప్రభుత్వం రక్షణ విష యంలో నిర్లక్ష్యం చేసిందనేది ప్రస్ఫుటంగా కనపడుతోంది.