వెవ్వెవ్వె..!
posted on Sep 17, 2022 @ 10:22AM
చెల్లి పెళ్లికి అక్కలు, అన్నలు అందరూ వచ్చారు. ఆ వీధంతా పెళ్లి సందడితో నానా హడావుడిగా ఉంది. బంధువులు అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ యిద్దరు తప్ప ఇద్దరూ ఎడమొహం పెడ మొహం పెట్టుకుని కుర్చీలో అలా కూర్చునే ఉన్నారు. ఒకాయన పేపరు, మరొకాయన కాఫీ గ్లాసుతో ఉన్నారు. పెళ్లికి రమ్మ న్నారే గాని తనకు ఇస్తానన్న స్కూటరు మాట ఏడాది నుంచి దాటేస్తున్నారని చిన్నాయన, చిన్నాయనకు మాట ఇచ్చి తనకు కనీసం ఒక్క ఉంగరం చేయిస్తాననీ అనలేదని పెద్దాయన ఆగ్రహిం చారు. బావుం ది చోద్యం.. అనుకుంటూ ఆ ఇంటి పెద్దావిడ మాట కలపడానికి వస్తే ససెమిరా అంటూ కుర్చీలు ఎత్తుకుని మరీ దూరంగా వెళ్లారు. అదుగో అలా ఉండి షాంగైలో సమావేశ దృశ్యం. పక్క దేశాలవారే పక్కింటి శతృ వుల్లా వ్యవహరించారు. ప్లాస్టిక్ నవ్వుల ఫోటోకి పరిమితమయ్యారు మోదీ.
షాంఘై సహకార సంఘం సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్థాన్‌లకు షాకిచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌తో ఆయన మాట్లాడలేదు. వాళ్లవైపు కన్నెత్తి కూడా చూడలేదు. కరచాలనం కూడా చేయలేదు. కేవలం గ్రూప్ ఫొటో మాత్రం దిగారు. అయితే ఆ గ్రూప్ ఫొటో లో అతి సమీపంలోనే ఉన్నా ఈ నేతలతో మోదీ మాట్లాడలేదు. సమావేశాల్లోని మిగతా సందర్భా ల్లోనూ మోదీ వారికి అతి సమీపంగా ఉన్నా మాట్లాడలేదు. డిన్నర్ సమావేశానికి కూడా మోదీ డుమ్మా కొట్టారు.
మరేం చేస్తారు? పక్కనే ఉంటూ, మిత్రదేశంలా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడ్డం ఎవరు భరిస్తారు? పైకి స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే, మరీ భూకబ్జాదారుల్లా చైనా సైన్యం వ్యవహరించి గొడవలకు దిగింది.
మా వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని అంటూనే గల్వాన్‌లో 2020 జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సై న్యం కుట్రపూరితంగా చేసిన దాడిలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు చనిపోయారు. భార త సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. గల్వాన్ ఘటన జరి గిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో వ్యాపార, వాణిజ్య సం బంధాలను ఆపివేసింది. నాటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించేం దుకు భారత్, చైనా సైన్యాల మధ్య చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే చైనా తీరులో భారత్ కోరుకున్న మార్పు రాకపోవడంతో మోదీ జిన్‌పింగ్‌తో మాట్లాడలేదని తెలుస్తోంది. షాంఘై సహకార సంఘం సమావేశాల సందర్భంగా మోదీ జిన్‌పింగ్‌ను పట్టించుకోకపోవడం కలకలం రేపింది.
ఇక పాక్ విషయానికి వస్తే, ఉగ్రవాదంపై పాకిస్థాన్ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తుండటంతో మోదీ, షరీఫ్‌తో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అయితే అంతర్జాతీయ వేదికలపై చైనా, పాకిస్థాన్‌లకు ఏకకాలంలో షాకివ్వడం భారత దృఢవైఖరిని తెలియజేసినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక్కడే చిన్న ట్విస్ట్.. ఇదే సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రస్తుతం యుద్ధకాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపా క్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ఆపివేయాలని కోరారు. యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందు కు సహకరించినందుకు మోదీ పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షికచర్చల్లో భాగంగా ఇద్దరు నేత లూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిం చారు.
యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై స్పందించిన పుతిన్ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధం ఆపాలనుకుంటున్నామని, సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని చెప్పారు. సంక్షోభ వేళ భారత్ ప్రతిస్పందనను తాము అర్థం చేసుకోగలమని పుతిన్ చెప్పారు.
షాంఘై సహకార సంఘంలో ప్రస్తుతం 8 సభ్య దేశాలుగా ఉన్నాయి. చైనా, భారత్, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగో లియా పరిశీలక దేశాలుగా పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. 1996లో షాంఘై సహకార సంఘం ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్నది 22వ సదస్సు.