ఒక్క రాజ‌ధానికే నిధులు.. స్ప‌ష్టం చేసిన కేంద్రం  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై కేంద్రం ఈనెల 27న  రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శు ల‌తో స‌మావేశం కానుంది.  కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజయ్‌భ‌ల్లా ఆధ్వ‌ర్యంలో  స‌మావేశం జ‌ర‌గ నుంది.  ఈ స‌మావేశంలో తొమ్మిది విభాగాల‌కు సంబంధించిన 14 అంశాలు చ‌ర్చించ‌నున్నారు.  అయితే చ‌ర్చించాల్సిన అనేక అంశాల కంటే రాజ‌ధాని గురించిన అంశం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రిం చుకుంటుంది. ముఖ్యంగా రాజ‌ధాని నిర్మాణానికి నిధుల గురించి చ‌ర్చించ‌నున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందు అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌న్న‌ప్ప‌టికీ, త‌ర్వాత పాల‌నా సౌక‌ర్యానికి  మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని అన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డం, విప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆమోదిం చిన త‌ర్వాత మ‌రి రెండు న‌గ‌రాల‌ను రాజ‌ధానులుగా చేయ‌నున్న‌ట్లు, అందుకు అభ్యంత‌రాలు ఉండా ల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వ‌మే ప్ర‌చారం చేయించుకుంది.  కానీ అమ‌రావ‌తి రాజ‌ధానిగా చేస్తామ‌న్నందుకు దానికి సంబంధించి భూముల‌ను ఇచ్చిన‌వారు, రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కాద‌న్నారు. రాజ‌ధాని ఒక‌టే ఉండాలని, మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టిం చ‌డం అర్ధ‌ర‌హిత‌మ‌ని, ప్ర‌భుత్వం త‌మ‌కు తోచిన విధంగా మాట‌మారుస్తూండ‌డం రాజ‌కీయ ల‌బ్ధిని తెలి య‌జేస్తందే గాని ప్ర‌జాసంక్షేమాన్ని తెలియ‌జేయ‌ద‌ని ప్ర‌జ‌లు ఉద్య‌మించారు.  ఈ నేప‌థ్యంలో కేంద్రం కూడా అమ‌రావ‌తినే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా గుర్తించింది. ఈ కార‌ణంగా, రాజ ధాని నిర్మాణానికి నిధుల విష‌యంలో సందిగ్ధానికి అవ‌కాశ‌మే లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. ఒక రాజ‌ ధాని నిర్మాణానికే నిధులు స‌మ‌కూరుస్తామ‌ని కేంద్రం పేర్కొన్న‌ది. జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి మూడు రాజ‌ధానుల అంశా న్ని తెర‌మీద‌కి తెచ్చి ప్ర‌జ‌ల్ని కేంద్రాన్ని సందిగ్ధంలో ప‌డేశారు. కానీ కేంద్రం మాత్రం మొద‌టి నుంచి ఆంధ్రాకు ఒకే రాజ‌ధాని ఉంటుంద‌ని, అదీ ముందుగా ప్ర‌క‌టించిన అమ‌రావ‌తే అవుతుంద‌ని గ‌ట్టిగా వాదిస్తోంది. పైగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేయ‌డానికే నిధులు ఏర్పాటు చేస్తామ‌ ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు స్ప‌ష్టంగా చెప్పింది. ఈ అంశాన్నే కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్ర‌భుత్వ సి.ఎస్‌ల స‌మావేశంలో స్ప‌ష్టం చేయ‌నుంది. 

తెలంగాణలో విస్తృతంగా SVEEP ప్రచారం

* తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా SVEEP ప్రచారం ప్రారంభమైంది. * 69 లక్షల మంది ఓటర్లు తమ ఆధార్‌ను ఓటర్ కార్డులకు అనుసంధానం చేశారు. * జిల్లా ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున SVEEP కార్యకలాపాలను చేపట్టారు. * స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీలు ఓటరుతో ఆధార్‌ అనుసంధానంపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2023 యొక్క ప్రత్యేక సమ్మరీ రివిజన్ కి సంబంధించి విస్తృతంగా SVEEP ప్రచారం జరుగుతోందని ప్రధాన ఎన్నికల అధికారి (CEO) శ్రీ వికాస్ రాజ్ అన్నారు. స్వయం సహాయక బృందాలు(SHGs) మరియు అంగన్‌వాడీల నేతృత్వంలోని SVEEP కార్యాచరణలో 69 లక్షల మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేశారని ఆయన చెప్పారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం ని SVEEP అని పిలుస్తారు. ఇది ఓటర్లకు అవగాహన కలిగించడం కోసం భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యక్రమం. పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం మరియు ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో శ్రీ వికాస్ రాజ్ తెలిపారు. వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది తమ తమ జిల్లాల్లో SVEEP కార్యక్రమాలను వేగవంతం చేశారు. SHG సమావేశాలను ఏర్పాటు చేయాలని మరియు ఫారం-6b ని ఉపయోగించి ఆధార్ అనుసంధానంపై SHG మహిళలకు అవగాహన కల్పించాలని SERP డైరెక్టర్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ కి సూచించారు. ఆధార్ అనుసంధానం మరియు ఓటరు నమోదు గురించి పౌరులందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేయాలని PR & RD డిపార్ట్‌మెంట్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. సీఈవో శ్రీ వికాస్ రాజ్ మాట్లాడుతూ SHG సమావేశాల సమయంలో ఉపయోగించే పోస్టర్లు SHG గ్రూప్స్ కోసం జిల్లా నోడల్ అధికారికి అందించామని తెలిపారు. సెప్టెంబరు 12 నుంచి 16వ తేదీలోపు అంగన్‌వాడీలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ఆధార్ అనుసంధానం, ఎన్‌రోల్‌మెంట్‌పై అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లను ఆదేశించారు.

అమ్మా..ఆగు, నేనూ వ‌స్తా!

న‌డ‌క‌నేర్చిన‌ప్ప‌టి నుంచి తల్లితో అలా షికారుకి వెళ్ల‌డం పిల్ల‌ల‌కు స‌ర‌దా. న‌డ‌వ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం, ప‌క్క‌నే అమ్మ చేయిప‌ట్టుకున్నాన‌న్న న‌మ్మ‌కం అలా న‌డిపిస్తుంది. ఆ త‌ర్వాత స్కూలుకి  వెళ్ల‌డం, స్నేహితులు ఏర్ప‌డినా అమ్మ‌తో ఎక్క‌డిక‌న్నా వెళ్ల‌డానికే పిల్ల‌లు బాగా యిష్ట‌ప‌డ‌తారు. త‌న‌కు తెలీ కుండా వెళ్లినా, పిల్ల‌డికి క‌న‌ప‌డితే ముద్దుగా అలిగి, వెంట ప‌రిగెడ‌తారు..అదో అందం. దీనికి జంతు వులూ మిన‌హా యింపు కావు. జంతువుల్లోనూ ఆ త‌ల్లి, పిల్ల‌ల ప్రేమ ఉంటుంది. ఇక్క‌డో గుర్రం ఓ బ‌స్సు ద‌గ్గ‌రకి ప‌రుగున వ‌చ్చింది. బ‌స్సు మీద మ‌రో గుర్రం బొమ్మ చూసి, త‌న త‌ల్లే అనుకుంది! బ‌స్సు మీద ఏదో యాడ్ తాలూకు గుర్రం బొమ్మ‌. ఆ బ‌స్సు వెళుతూంటే ఓ గుర్రం చూసింది. అయ్యో అమ్మ త‌న‌ని పిల‌వ‌కుండా, ఎటో వెళిపోతోంద‌ని అనుకుంది. అంతే దాని వెంట‌ప‌డింది. బ‌స్సు వెళుతోం టే త‌ల్లి దూర‌మ‌వుతోన్న బాధ‌తో ఈ గుర్రం కూడా ప‌రిగెట్టింది. ఆ బ‌స్సు ఆగ‌గానే ద‌గ్గ‌రికి వెళ్లి త‌ల్లిలా ఉన్న గుర్రం బొమ్మ‌ని మూతితో తాకింది, త‌ల్లిని ముద్దెట్టుకున్న‌ట్టు. బ‌స్సువాడు టీ కోస‌మో, టిఫిన్ కోస‌మో ఆగిన‌ట్టు న్నా డు. అది ఈ గుర్రానికి న‌చ్చింది. అచ్చం త‌ల్లితో మాట్లాడుతున్న‌ట్టు ఆ బొమ్మ‌ను చూస్తుండిపోయింది.   త‌ల్లి ని చూసిన అనుభ‌వంతో అదేం మాట్లాడుతోందో మ‌న‌కు తెలుసుకోలేం. కానీ దాని బాధ మాత్రం తెలుస్తుంది. నిజంగానే త‌ల్లి త‌న‌ను వ‌దిలేసి ఎటో వెళిపోతోంద‌న్న బాధ‌తో కుమిలిపోతోంది. ఇక ఆ బ‌స్సు ఎటు వెళితే అటు వీల‌యినంత వేగంగా వెంబ‌డిస్తుందేమో! త‌ల్లి ప‌ట్ల ప్రేమ ఎంత క‌ష్టాన్న యినా మ‌రిపి స్తుంది. త‌మిళ‌నాడు కోయంబ‌త్తూర్  పేరూరు ప‌ట్టీశ్వ‌ర్ ఆల‌యం స‌మీపంలోని బ‌స్ స్టాండ్ ద‌గ్గ‌ర ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించారు. ఇపుడిది నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. 

భార‌త్ అధ్య‌క్ష‌త‌న 200  జీ20 స‌మావేశాలు

భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జీ20 అధ్యక్ష స్థానా న్ని చేపడుతుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావి స్తున్నారు. దేశ, ప్రభుత్వ అధిపతుల స్థాయిలో జీ20 లీడర్స్ సమ్మిట్ సెప్టెంబర్ 9-10, 2023 తేదీ లలో న్యూఢిల్లీలో జరగాల్సి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనను తెలియ‌ జేసింది. జీ20, లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ, ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషి యా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యుకె, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ (ఈయు) మొద‌లైన‌ 19 స‌భ్య‌దేశాలు ఉన్నాయి. సమిష్టిగా, జీ20 ప్రపంచ జీడీపి లో 85 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం,  ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉంది, ఇది అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా నిలిచింది. భారతదేశం ప్రస్తుతం ఇండోనేషియా, ఇటలీ, భారతదేశంతో కూడిన జీ20 ట్రాయికో (ప్రస్తుత, గ‌త‌, భ‌విష్య‌త్‌ జీ20 నాయ‌కులు)లో భాగం. ట్రాయికో  సమయంలో, భారతదేశం, ఇండో నేషియా, బ్రెజిల్  కొత్త ట్రాయికోను ఏర్పాటు చేస్తాయి. మూడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థ లను కలిగి ఉండటం, వారికి మ‌ద్ద‌తు అందించడం ఇదే మొదటి సారి అని ఒక ప్ర‌క‌ట‌న‌లో అధికారులు తెలియ‌జేశారు. ఫైనాన్స్ ట్రాక్, 8 కార్య‌వ‌ర్గ విభాగాలతో (గ్లోబల్ మాక్రో ఎకనామిక్ పాలసీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, ఇంట ర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, సస్టైనబుల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, హెల్త్ ఫైనా న్స్, ఇం టర్నేషనల్ టాక్సే షన్, ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్); షెర్పా ట్రాక్, 12 కార్య‌వ‌ర్గ విభాగాలతో (అవినీతి నిరో ధక, వ్యవసాయం, సంస్కృతి, అభివృద్ధి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పర్యావరణం, వాతావరణం, విద్య, శక్తి పరివర్తన, ఆరోగ్యం, వాణిజ్యం, పెట్టుబడి, పర్యా టకం); ప్రైవేట్ సెక్టార్/ సివిల్ సొసైటీ లేదా స్వతంత్ర సంస్థల 10 ఎంగేజ్‌మెంట్ గ్రూపులు (వ్యాపారం , సివిల్ , లేబర్ , పార్లమెంట్, సైన్స్ ,సుప్రీం ఆడిట్ సంస్థలు , థింక్ , అర్బన్ , మహిళలు , యూత్ ) ఉన్నాయి. జీ20 సభ్యులతో పాటు, జీ20 ప్రెసిడెన్సీ తన జీ20 సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని అతిథి దేశా లు అంతర్జాతీయ సంస్థలను (ఐఓ లు) ఆహ్వానించే సంప్రదాయం ఉంది. దీని ప్రకారం, సాధారణ అంత ర్జాతీయ సంస్థలతో పాటు (యుఎన్‌, ఐఎంఎఫ్‌, వరల్డ్ బ్యాంక్, డ‌బ్ల్యుహెచ్‌ఓ, డ‌బ్ల్యుటీఓ,ఐఎల్ ఓ, ఎఫ్ ఎస్‌బి,ఓఇసిడి), ప్రాంతీయ సంస్థల చైర్మన్లు ​​(ఏయు, ఏయుడిఏ-ఎన్ ఇపిఏడి ఏఎస్ ఇఏఎన్‌), జీ20 అధ్య క్షుడిగా భారత్‌, ఆహ్వానిస్తుంది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యుఏ ఇ అతిథి దేశాలు, అలాగే ఐఎస్ ఏ (ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్), సీడిఆర్ ఐ (కాలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), ఏడిబి (ఆసి యన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) గెస్ట్ ఐఓ లు, ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌లో అధికారులు పేర్కొన్నారు. భారత్‌ జీ20 ప్రాధాన్యతలు దృఢపరచబడే ప్రక్రియలో ఉండగా, కొనసాగుతున్న సంభాషణలు సమ్మి ళిత, సమానమైన స్థిరమైన వృద్ధి చుట్టూ తిరుగుతాయి; లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి); మహిళా సాధికా రత; ఆరోగ్యం, వ్యవసాయం, విద్య నుండి వాణి జ్యం, నైపుణ్యం-మ్యాపింగ్, సంస్కృతి, పర్యాటక రంగాల లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,  టెక్-ఎనేబుల్డ్ డెవలప్‌మెంట్; క్లైమేట్ ఫైనాన్సింగ్; వృత్తాకార ఆర్థిక వ్యవస్థ; ప్రపంచ ఆహార భద్రత; శక్తి భద్రత; గ్రీన్‌ హైడ్రోజన్; విపత్తు ప్రమాదం తగ్గింపు, అభివృద్ధి సహకా రం, ఆర్థిక నేరానికి వ్యతిరేకంగా పోరాటం, బహుపాక్షిక సంస్కరణలు  ప్రాధాన్య‌త‌లుగా ఉన్నాయి.

కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హుజురాబాద్ ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారా?ఈటల చేతిలో ఓటమిని అయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? ‘గులాబీ పార్టీకి ఓనర్లం మేమే’ అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించి తలెగరెసిన బడుగు వర్గాల నేతను కేసీఆర్ ఇప్పటికీ ఉపేక్షిచలేకుండా ఉన్నారా? అందుకేనా,  ఈటల అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, సభలో బడుగుల గళం వినిపించకుండా, ఏదో ఒక కారణం చూపించి, సస్పెండ్ చేయించి బయటకు పంపుతున్నారా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అవును, కొందరు తెరాస నాయకులు కూడా, వ్యక్తిగత సంభాషణల్లో ముఖ్యమంత్రి కేసీఆర్  ఈటల పట్ల వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకున్నారని అంగీకరిస్తున్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి అచనాలు, ఆలోచనలు భిన్నంగా ఈటల కాంగ్రెస్’లో కాకుండా బీజేపీలో చేరడం కూడా ఆయన కోపానికి కారణం అంటున్నారు. హుజురాబాద్’ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసేఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కోట్ల రూపాయలు కుమ్మరించారు. రాజకీయ తాయిలాలు ఎరగా వేశారు. హుజురాబాద్ నియోజక వర్గంలో గతంలో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి (కాంగ్రెస్) ఎల్. రమణ (టీడీపీ), పెద్ది రెడ్డి (బీజేపీ) ఇలా నియోజక వర్గంపై ఎంతోకొంత పట్టుందని భావించిన ఇతర పార్టీల నాయకులకు పదవులు ఎరగా వేసి, పార్టీలో చేర్చు కున్నారు.  నిజానికి ఇతర పార్టీల నాయకులు మాజీ ప్రజా ప్రతినిదులనే కాదు, సొంత పార్టీ కి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ఈటల వైపు వెళ్ళకుండా ఉండేందుకు, ఏమేమి చేయకూడదో అవ్వన్నీ చేశారు. నామినేటెడ్ పదవులు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాలు ఆశగా చూపి ఎవరూ గట్టు దాటకుండా కట్టడి చేశారు.ఇక ఓటు రేటు ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పనకరలేదు. ఇన్నెందుకు కానీ, కనివినీ ఎరగని రీతిలో ఇటు ప్రభుత్వ నిధులు, అటు పార్టీ ఫండ్స్ విచ్చల విడిగాఖర్చు చేసి, చివరకు, ‘అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక’ గా హుజురాబాద్ ఉప ఎన్నికను చరిత్ర పుటల్లో చేర్చారు. నిజానికి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసింది గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అయినా  ఓడి పోయింది మాత్రం కేసీఆర్, అనే అభిప్రాయం, జనంలోకి వెళ్ళింది. అందుకే, ఈటల గెలిచినా సభలో ఆయన కనిపించారదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని, ఈటల చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలిచిన తర్వాత గత మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి, ఇప్పడు మళ్ళీ ముచ్చటగా మూడు రోజులు వ్ర్శకాల్ సమావేశాలు జరిగాయి జరిగాయి. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజునే,ఈటలతో పాటుగా ముగ్గురు, బీజేపీ ఎమ్మెల్యేలను సహేతుకకారణం ఏదీ లేకుండానే, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్’ చేశారు. ఇప్పుడు మూడు రోజుల సభలో, సభ వెలుపల స్పీకర్’ గురించి చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపించి,సస్పెండ్ చేసారు. ఇలా, ఈటల చూడడం ఇష్టం లేకనో, ఈటల సభలో మాట్లాడితే, ఎవైనా నిజాలు బయటకు వస్తయ్యనో మొదటి రోజు నుంచి చివరి రోజువరకు ఈటల సభలో లేకుండా సస్పెండ్ చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  అయితే, ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందనే విమర్శలతో పాటుగా, ముఖ్యమంత్రి ఈటలకు భయపడుతున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజేందర్’కు తెరాస లోగుట్లు అన్నీ క్షుణ్ణంగా తెలుసనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంతే కాదు, ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలకు ప్రభుత్వ గుట్టుమట్లు కుడా అరచేతిలో లెక్కల్లా కొట్టిన పిండి అంటారు. నిజానికి, మూడు రోజుల సభలో చివరి రోజు ఎఫ్ఆరబిఎం పై చర్చ కారణంగానే తనను బయటకు పంపారని ఈటల పేర్కొన్నారు. అందుకే, సభలో ఈటల వాయిస్ వినిపించకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. అయితే, మోడీతో గోక్కోవడం ఏమో కానీ, ఈటలతో గోక్కోవడం మాత్రం బూమ్రాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు.ఒక బీసీ నేతను, అవినీతి ఆరోపణలు చేసి అత్యంత అవమానకరంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి బయటకు పపండమే కాకుండా, సభలో ప్రవేశించకుండా అడ్డుకోవడం, అవమానించడం తెరాసలోని బీసీ ఎమ్మెల్ల్యేలు, నాయకులు కూడా జీర్నిచుకోలేక పోతున్నారని అంటున్నారు. ఇతర విషయాలు ఎలా ఉన్నా ఈటల విషయంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం, ఇతర పార్టీలలో కంటే తెరాసలోనే ఎక్కువగా వినిపిస్తోందని, అంటున్నారు. మరో వంక ఈటల, కేసీఆర్’ ను  ఓడించక పొతే, నా పుట్టుకే వ్యర్థం అంటూ పరోక్షంగా క్యాస్ట్ కార్డు సంధించారని  అంటున్నారు. ఒక విధంగా తెరాసలో ఉండగా చేసిన ‘గులాబీ పార్టీకి ఓనర్లం మేమే’ అంటూ చేసిన సవాలుకు కొనసాగింపుగానే ఈటల తాజాగా చేసిన, ‘కేసీఆర్’ ను  ఓడించక పొతే, నా పుట్టుకే వ్యర్థం’ అంతో చేసిన సవాలును చూడవలసి ఉంటుంది అంటున్నారు. అదే నిజమే, రాష్ట్ర రాజకీయం  కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారితే మాత్రం,అది తెరాసకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటిన్లు.. చంద్రబాబు నిర్ణయం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు సజావుగా నడవనివ్వకుండా వైసీపీ సర్కార్  అల్లర్లు చేస్తుండడంతో పాటు పలుచోట్ల వైసీపీ నేతలు అన్న క్యాంటీన్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అసలు వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసేసింది. పేదవాడికి చౌకగా పట్టెడన్నం పెట్ట మహత్తర కార్యానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తున్న  క్రమంలో తెలుగుదేశ అంధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను  ఏర్పాటు చేసి, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎక్కడికక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, పేదలకు భోజన సదుపాయం కల్పించాలని టీడీపీ నేతలను ఆయన ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోను, నారా లోకేశ్ గతంలో పోటీ చేసిన మంగళగిరిలోను, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో, మరి కొన్నిచోట్ల మాత్రమే  ప్రస్తుతం అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా అన్న క్యాంటీన్లను ఆ పార్టీ నేతలు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్లను సొంత ఖర్చులతో నిర్వహించాలని,  స్వచ్ఛంద సంస్థలు కలిసివస్తే.. వాటి సహాయమూ తీసుకోవాలని, అలాగే తెలుగుదేశం   తరఫున కూడా  అన్న క్యాంటీన్ల నిర్వహణకు కొంత నిధి సమకూరుస్తామని చంద్రబాబు తమ పార్టీ నేతలకు చెప్పారు.తెలుగుదేశం నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలను అన్న క్యాంటీన్లలో నిర్వహించి, భోజనాలు వాటిలోనే ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లు సజావుగా నడిస్తే.. టీడీపీకి మంచి పేరొస్తుందని, తద్వారా  పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందనే అక్కసుతోనే జగన్ సర్కార్, ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అన్న క్యాంటీన్లకు అడ్డు తగులుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే.. అన్న క్యాంటీన్ ను కాసేపట్లో ఆయన ప్రారంభిస్తారనగా వైసీపీ నేతలు  ఆ క్యాంటీన్ బ్యానర్లను చింపి వేసి ఆహార పదార్థాలున్న పాత్రలను ధ్వంసం చేశారు.  గుంటూరు జిల్లా తెనాలిలోనూ, మరికొన్ని చోట్లా కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే సాకుతో అన్నా క్యాంటీన్లను వైసీపీ నేతలు కూల్చివేశారు. అన్నా క్యాంటీన్లపై ప్రజల్లో ఆదరణ పెరిగిపోతే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల వర్షం కురుస్తుందని, తద్వారా తమ అధికారానికి ఎండ్ కార్డ్ పడుతుందని వైసీపీ నేతల్లో గుబులు పెరిగిపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే అన్న క్యాంటీన్లకు అడుగడుగునా వైసీపీ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని పేర్కొంటున్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకోవడమే కాకుండా, కొన్ని చోట్ల పోలీసులతో లాఠీచార్జి కూడా చేయిస్తుండడంతో ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలపై దాడి చేసి, వారిని అరెస్టులు చేయిస్తున్న ఘటనలు చూసిన జనం ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దాడులకు గురైన టీడీపీ నేతల పట్ల జనంలో సానుభూతి వస్తుందని, అతి తక్కువ ధరకే పేదలకు పట్టెడన్నం పెడుతుంటే వైసీపీ అడ్డుకుంటోందనే ఆగ్రహం కూడా ప్రజల్లో వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారని అంటున్నారు.

టీచర్ కోపాన్ని మాయం చేసిన బుడ్డోడి ముద్దులు

పిల్ల‌లు ఏది చేసినా బాగానే ఉంటుంది. అల్ల‌ర‌యినా, వేడుకోవ‌డ‌మైనా! వారిది అమాయ‌క‌త్వంతో కూడిన ఆట‌పాట‌లు, అల్ల‌రి. అది బ‌డిలోనైనా ఇంట్లోనైనా! అమ్మ‌యినా, టీచ‌ర‌యినా వారికి అంత‌గా ప‌ట్టింపు ఉండ‌దు. అల్ల‌రీ చేస్తారు, భ‌య‌ప‌డ‌తారు, కొంద‌రు టీచ‌ర్‌నీ వేడుకుంటారు! మామూలుగా అయితే త‌ల్లిని వేడుకున్నంత ముద్దుగా టీచ‌ర్‌ని వేడుకోవ‌డం ఉండ‌దు. అందు లో ప్రేమే ఉంటుంది. కానీ ఇక్క‌డో బ‌డిలో ఓ బుడ‌త‌డు ఏకంగా వాడి త‌ల్లిని వేడుకుంటున్న‌ట్టు టీచ‌ర్‌నీ వేడుకున్నాడు. కోపంతో ఉన్న టీచర్ కి  చిన్న‌పిల్ల‌వాడి  క్షమాపణ  ప‌ద్ధ‌తి ఆమె హృదయాన్ని క‌రిగించింది. ఇంకెప్పుడూ  అల్ల‌రి  చేసి ఇబ్బంది పెట్ట‌న‌ని వేడుకున్నాడు. కొట్ట‌బోయిన టీచ‌ర్ త‌ల్లిలా ద‌గ్గ‌ర‌కి తీసుకుంది! క్లాస్‌లో అసభ్యంగా ప్రవర్తించినందుకు తన స్కూల్ టీచర్‌ని క్షమించమని కోరిన ఓ చిన్న పిల్లవాడి వీడి యో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. విద్యార్థి ప్ర‌వ‌ర్త‌న‌పై కోపంగా అనిపించిన తన టీచ‌ర్‌ని ఒక చిన్న పిల్లవాడు శాంతింపజేశాడు. వాడు ఆమె బుగ్గలపై చాలాసార్లు ముద్దు పెట్టాడు. ఆమె ప్రేమను తిరిగి పొం దేందుకు ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది. క్లాసులో అల్ల‌రి చేయనని పదే పదే చెబుతున్నా, చేస్తావు. నేను మాట్లాడను.  మీరంతా  మళ్లీ  అల్ల‌రి చేయనని ఒకసారి చెప్పారు, కానీ మీరు మ‌ళ్లీ చేస్తున్నారు. అంటూ ఆ టీచ‌ర్ కోప‌గించుకుంది. అంతే పశ్చాత్తాపంతో చూస్తూ, చిన్న పిల్లవాడు ఆమెను కౌగిలించుకుని, నేను చేయను, మేడమ్ అని చెప్పాడు. వీడియో చివరలో, చిన్న విద్యార్థి టీచ‌ర్‌ని ఒప్పించగలిగాడు, అతను బదులుగా ఆమెకి ముద్దు పెట్టాడు. పాఠశాల, అలా విద్యార్ధి నుంచి ప్ర‌త్యేక గౌర‌వం పొందిన ఆ టీచ‌ర్‌ పేరు తెలియ‌దు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో మరో వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వేసవిశిబిరం చివరి రోజున ఢిల్లీ స్కూల్ టీచర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ సెషన్ చేస్తున్నట్టు అందులో చూపించారు. తరగతి గదిలో చిత్రీకరించిన క్లిప్, కిస్మత్ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ పాట కజ్రా మొహబ్బత్ వాలాకు విద్యార్థుల డాన్స్ వేయ‌డం క‌నిపించింది. 

ఏపీ, తెలంగాణా విభ‌జ‌న స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించ‌నున్న కేంద్రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై కేంద్రం బుధ‌వారం చ‌ర్చించ‌నుంది. కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజయ్‌భ‌ల్లా ఆధ్వ‌ర్యంలో జ‌రిగే స‌మావేశంలో అన్ని అంశాల మీదా చ‌ర్చించను న్నారు. చ‌ర్చించాల్సిన అంశాల‌కు సంబంధించిన అజెండాను రెండు రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు అంద‌ జేశారు.  షెడ్యూల్‌ 9లో  వున్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, 10లో వున్న రాష్ట్ర స్థాయి సంస్థల విభజ న, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  ఏ పీ హెవీ మిషనరీ  యిం జనీరింగ్ లిమిటెడ్ విభజన, నగదు, బ్యాంకు బ్యాలెన్సుల విభజన, తెలంగాణా పౌర సరఫరాల కార్పొరేష న్ నుంచి ఏపీ పౌర సరఫరాలకు రావాలసిన క్యాష్ క్రెడిట్ బకాయిలు మొదలైన సమస్యల పరిష్కరించా ల్సిన అంశా   ఎజెండాలో అనేక అంశాలను యీ రోజు కేంద్ర హోంశాఖ చర్చించనుంది. ఎజండాను  రెండు రాష్ట్రాలకు కేంద్రం పంపింది. రాజధాని నగరాభివృద్ధి కి  కేంద్ర మద్దతు, కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం తదితర అంశాలను కూడా ఎజండాలో చేర్చారు.  అలాగే విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న దుగ్గరాజపట్నం పోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్‌ రిఫైనరీ, విశాఖపట్నం విజయవాడల్లో మెట్రో రైలు నిర్మాణం వంటి అంశాలు మాత్రం యెజండాలో లేవు. అంతేగాక, విద్యుత్ బకాయిల అంశం కూడా లేకపోవడం గమ నార్హం. ఇక  కేంద్ర రాష్ట అంశాల విషయానికి వస్తే,  ఏపీ విభజన చట్టంలోని సెక్ష‌న్  94 (1)(2)  ప్రకారం  పన్ను ప్రోత్సాహకాలు, రాయలసీమ,  ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు అభివఈద్ధి నిధి, రెవె న్యూ లోటు భర్తీ, కొత్తరాజధానికి కేంద్రం మద్దతు, విద్యాసంస్థల ఏర్పాటు మొద‌లైన అంశాలు చ‌ర్చిం చ‌వ‌చ్చు. 

ప్రైవేటు భవనాల్లో ఈవీఎంలు.. మునిసిపల్ చట్టానికి సవరణ..దీని భావమేమి తిరుమలేశా?

తెలంగాణ సర్కార్ ఎన్నికలు గెలవాలంటే.. మరిన్ని అధికారాలు, వెసులు బాట్లు కావాలని భావిస్తోందా? అందుకు అవసరమైన విధంగా చట్ట సవరణలకు పాల్పడుతోందా అంటే మంగళవారం(సెప్టెంబర్13) అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లులో పొందుపరిచిన ఒక అంశాన్ని గమనిస్తే ఔననే చెప్పాలని పరిశీలకులు అంటున్నారు. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. మునిసిపల్ ఎన్నికలలో ఈవీఎంలను భద్ర పరుచడానికి అవసరమైతే ప్రైవేటు భవనాలను వినియోగానికి అవకాశం కల్పించేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఈవీఎంలను స్టోర్ చేసేందుకు, వాటికి అవసరమైన భద్రతను కల్పించేందుకు ప్రైవేటు భవనాలను వినియోగించుకునే వెసులు బాటు ఈ ఈ సవరణ ద్వారా లభిస్తుంది. ఇప్పటికే ఈవీఎంల భద్రత, విశ్వసనీయతపై దేశ వ్యాప్తంగా అనుమానాలూ, సందేహాలూ వ్యక్తమౌతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంల స్టోరేజీ భద్రత కోసం ప్రైవేటు భవనాల వినియోగం కసం మునిసిపల్ చట్టంలో సవరణ తీసుకురావడం పలు అనుమానాలకు విమర్శలకు తావిస్తోంది. విపక్షాలు ఈ విషయంపై పలు అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భంగపాటుతో కేసీఆర్ సర్కార్ ఇక ఎన్నికలు గెలిచేందుకు దొడ్డిదారులు వెత్తుక్కుంటోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చట్ట సవరణ మునిసిపల్ ఎన్నికలతో ఆగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పునాదులు కదులు తున్నాయన్న భయంతోనే ఈవీఎంల భద్రత విషయంలో తనకు అనూకూలంగా ఉండే విధంగా   టీఆర్ఎస్ సర్కార్ చట్టాన్ని సవరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

మూడేళ్ల బాలికపై స్కూలు బస్సులో అత్యాచారం

పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై  ఆమె రోజూ స్కూలుకు తీసుకువెళ్లి తీసుకువచ్చే బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న బాలిక ప్రతి రోజూ స్కూలు బస్సులోనే స్కూలుకు వెళ్లి వస్తుంది. ఆ బస్సు డ్రైవరే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇందుకు ఓ మహిళా అటెండర్ సహకరించింది.  సాధారణంగా నర్సరీ పిల్లలకు వారి తల్లిదండ్రులు యూనిఫాం తో స్కూలుకు పంపినా స్కూల్ బ్యాగ్ లో అదనంగా మరో డ్రెస్ పెడతారు. ఓ రోజు ఆ చిన్నారి యూనిఫాం లో కాకుండా బ్యాగ్ లో పెట్టిన అదనపు డ్రెస్ ధరించి ఇంటికి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ఆరా తీశారు. స్కూల్ లో టీచర్లు, ఆయాలు ఎవరూ ఆ పాపకు డ్రెస్ మార్చలేదని చెప్పారు. కాగా ఈ లోగా ఆ పాపను అడిగితే జరిగిన విషయం చెప్పింది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ ను అతడికి సహకరించిన మహిళను అరెస్టు చేశారు. కాగా ఈ దారుణ ఘటన పట్ల  రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశ వ్యాప్తంగా  ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చిన్నారిపై అత్యాచార ఘటనను దాచి పెట్టేందుకు ప్రయత్నించిన స్కూలు యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఇక ఇప్పుడు నియోజకవర్గ పరిశీలకులు.. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలలో గాభరా

వైసీపీలో రానున్న ఎన్నికలలో విజయంపై రోజు రోజుకూ ఖంగారు పెరిగిపోతోంది. భయం గూడు కట్టుకుంటోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ లో ఈ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో రోజుకో కొత్త నిర్ణయం, పూటకో కొత్త నియామకం చేపడుతున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే   నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇన్ చార్జిగా ఉన్నారు.ఇప్పుడు   అదనంగా పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించారు. ఆ పరిశీలకుల జాబితా ఇప్పటికే ఖరారైందని కూడా పార్టీ వర్గాలుచెబుతున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గ ఇన్ చార్జ్ కాకుండా ఒక పరిశీలకుడు కూడా ఉంటారన్న మాట. జగన్ నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గాభరా పెరిగింది. అయితే ఈ పరిశీలకులు ఏం చేస్తారు, ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏమిటి అన్నది మాత్రం ఇతమిథ్థంగా తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి తార స్థాయిలో ఉందన్న ఐ ప్యాక్ నివేదిక ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని జనాలలోకి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తాను బటన్లు నొక్కడం ద్వారా లబ్ధిదారులు పొందిన ప్రయోజనాలను ప్రజలకు వివరించి మరో సారి వైసీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సోపానంగా మారుతుందని భావించిన గడపగడపకూ కార్యక్రమం దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా బూమరాంగ్ అయ్యి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను ఫేస్ చేయలేని పరిస్థితులు ఎదురు కావడంతో ఆయనలో ఖంగారు మొదలైందని పరిశీలకులు అంటున్నారు.  ఆ కారణంగానే పని చేసే వారికే పార్టీ టికెట్లు, విపక్ష విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వని మంత్రులకు ఉద్వాసన అంటూ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా నియోజకవర్గ పరిశీలకులు నియామకానికి సిద్ధం కావడంతో నియోజకర్గాలలో ఇప్పటికే ఉన్న వర్గ విభేదాలతో అయోమయంలో ఉన్న పార్టీ క్యాడర్ మరింత గందరగోళానికి గురి చేసే నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇప్పుడు నియమితులు కానున్న పరిశీలకులు ఇప్పటికే ఉన్న ఇన్ చార్జీలకు అదనం కావడంతో పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందని పార్టీ క్యాడర్ అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రతి నియోజకర్గంలోనూ గ్రూపు తగాదాలు ఉన్నాయి. పార్టీ టికెట్ ఆశావహుల సంఖ్యా భారీగానే ఉంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదంటూ జగన్ ఇప్పటికే ప్రకటించడంతో దాదాపు 151 నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేలలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఆ కారణంగానే దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉంది. ఇప్పుడు పరిశీలకుల నియామకం నిర్ణయంతో గ్రూపులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. దాదాపుగా అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేనే ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం ఉందంటూ జగన్ పరిశీలకుల నియామకానికి తెరతీశారు. అసలు వాస్తవంగా ప్రతి నియోజకవర్గానికి అదనపు ఇన్ చార్జిని అంటే ఎమ్మెల్యేకు పోటీగా ఒకరిని నియమించాలన్నది ఆయన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  అయితే ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గానికి ఇన్ చార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడానికి వ్యతిరేకంగా గళమెత్తడం, ఆమె వర్గీయులు ఆందోళనకు దిగడంతో జగన్ వెనక్కు తగ్గారని అంటున్నారు. అందుకే ఇప్పుడు పరిశీలకుల పేర అదనపు ఇన్ చార్జిలను నియమిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. గతంలోలా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం జగన్ కోల్పోయారనీ, పార్టీలో అసంతృప్తి, తన నిర్ణయాలను ధిక్కరించి ఆందోళనలకు సైతం దిగుతున్న పరిస్థితులను గమనించి భయపడుతున్నారనీ అంటున్నారు. ఏది ఏమైనా పేరు పరిశీలకుడే అయినా ఆ పరిశీలకుడి పాత్ర మాత్రం అదనపు ఇన్ చార్జి అనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు సహజంగానే పరిశీలకుడికి సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొత్తంగా ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనంత అయోమయ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ, ఆ పార్టీ నేతలు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ కు కోపం వస్తుందేమోనని పార్టీ నాయకులు భయపడేవారని ఇప్పుడు నేతలు అసమ్మతి గళం విప్పుతారేమోనని జగన్ భయపడే పరిస్థతి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ ప్రకంపనలు ?

దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం, ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులనే తడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కుటుంబ సభ్యులతో పాటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఇందులో పాత్ర ఉందని టీడీపి ఆరోపిస్తోంది. ఢిల్లీలో తీగలాగితే, తాడేపల్లి డొంకంతా కదులు తోందని అంటున్నారు. అలాగే, ఢిల్లీ కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో బయటపడుతున్నాయని చెబుతున్నారు.  సరే, ఆ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముఖ్యమంత్రి సతీమణి భారతి ప్రమేయం ఏమైనా వుందా? విజయ సాయి రెడ్డి పాత్ర ఏమిటి? అనేది, సిబిఐ విచారణలో తేలుతుంది. అంతవరకు ఎవరు ఏది చెప్పినా, ఏ ఆరోపణ చేసినా, అది ఉహజనితమే అవుతుంది.   అయితే, ఢిల్లీ కుంభకోణంతో ప్యాలెస్ సంబంధాల ప్రకంపనలు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి సతీమణి భారతి టార్గెట్’గా ఆరోపణలు చేస్తున్నా, మంత్రులు ఎవరూ స్పందించక పోవడాన్ని, ముఖ్యమంత్రి నేరంగా పరిగణించి, శిక్ష తప్పదని హెచ్చరించడం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు ప్యాలెస్ లో ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే, రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డిని మెల్లమెల్లగా దూరం పెడుతున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, భారతి పేరుతొ పాటుగా విజయసాయి రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో  విజయసాయి రెడ్డికి ప్యాలెస్ ఎంట్రీ లేదని వస్తున్న వార్తలు అనుమానాలు ఇంకొంత పెంచుతున్నాయి.  అదలా ఉంటే, ఇప్పడు కొత్తగా ఇంకొక వార్త వినవస్తోంది. జగన్ రెడ్డి, విజయసాయి మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో సజ్జల మరోమారు,, ప్యాలెస్ పాలిటిక్స్ లో పై చేయి సాధించారని, అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా అంటే ముందు నుంచి కూడా విజయసాయి రెడ్డి పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే చెప్పాపెట్టకుండా, సోషల్ మీడియా బాధ్యతలను, సజ్జల టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి అదేశాల మేరకు సోషల్ మీడియాలో మార్పులు చేర్పులు జరిగినట్లు చెపుతున్నారు. విజయసాయి రెడ్డి బాధ్యతలను మరో ముఖ్యనేత కుమారుడికి అప్పగించారని తెలుస్తోంది.  నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ కోసం చాలా కాలంగా, సజ్జల, విజయసాయి మధ్య పోటీ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సర్వం విజయసాయి చేతుల్లోనే ఉండేది. అయితే విశాఖ ఎల్జీ పాలిమర్స్‌’లో ప్రమాదం సంభవించిన సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రితో పాటు బయలుదేరిన విజయ సాయి రెడ్డిని కారు దించి వెనక్కి పంపించడంతో మొదలైన జగన్ రెడ్డి బొమ్మా బొరుసు ఆట  .... చాలా చాలా మలుపులు తిరిగింది. విజయసాయి ముఖ్యమంత్రికి దూరమయ్యారు. సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గరయ్యారు. సర్వ శాఖల మంత్రిగా చక్రం తిప్పారు. విజయసాయి పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు.తర్వాత ఏమైందో కానీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కూడా ఆయనకే అప్పగించారు.కానీ ఇప్పుడు అనధికారికంగా అయినా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటున్నారు. ఈ మార్పుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరు పైకి రావడమే ప్రధాన కారణం అంటున్నారు. విజయసాయి రెడ్డి ప్రమేయంతోనే భారతి పేరు బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ఆయన్ని దూరంగా ఉంచుతున్నారని అంటున్నారు. నిజానికి గతంలోనూ జగన్ రెడ్డి విజయసాయి విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నా, ముఖ్యమంత్రి సతీమణి భారతి జోక్యంతో విజయసాయి పోయిన ప్రాధాన్యతను తిరిగి తెచ్చుకున్నారని  అంటున్నారు. అయితే ఇప్పడు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి పేరుతొ పాటు భారతి పేరు కూడా బయటకు రావడంతో, ఇప్పుడు ఆమె విజయసాయిని బయట పడేసే అవకాశమే లేదని అంటున్నారు. సో .. జగన్ రెడ్డి పరమ పద సోపాన పటంలో మరోమారు, సాయి డౌన్ అయ్యారు. సజ్జల నిచ్చెన ఎక్కారు , అంటున్నారు.

ముందు గెజిట్ నోటిఫికేషన్.. ఆ తరువాత బిల్లుల ఆమోదం.. ఇదెక్కడి చోద్యం!

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టంఅన్నట్లుగా ఉంది తెరాస ప్రభుత్వం తీరు. విలువలు, నిబంధనల ఊసే లేకుండా ఇష్టాను సారంగా సభా వ్యవహారాలను సాగించేస్తున్నదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేదిగానే ప్రభుత్వం తీరు ఉంది. ఏదైనా ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టిన తరువాత దానిపై చర్చ జరుగుతుంది. సభ్యులు తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. ప్రభుత్వం వాటిని పరిగణనలోనికి తీసుకుంటే మళ్లీ సవరణలు చేస్తారు.  ఆ తరువాత సదరు బిల్లు పాస్ అవుతుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాతనే దానిని గెజిట్ లో ప్రచురిస్తారు.  అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రొసీజర్ ఇది కాగా,    కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విధానాలన్నిటికీ తిలోదకాలిచ్చేసింది.  అధికారం చేతిలో ఉంది, సభలో ప్రశ్నించే విపక్షాలకు సంఖ్యా బలం లేదు. ఏ విషయాన్నైనా బుల్ డోజ్ చేసేందుకు అవసరమైన మంద బలం ఉందన్న ధీమాతో తెరాస సర్కార్ అసెంబ్లీ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తోందనడానికి నిదర్శనమే  మంగళవారం సభలో ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం తేదీతో ముద్రించి దానినే సభ్యులకు మీడియాకు సర్క్యులేట్ చేయడం. అలాగే సభలో మంగళవారం (సెప్టెంబర్ 13న) ప్రవేశపెట్టిన బిల్లులను 12నే ప్రవేశపెట్టినట్లుగా పేర్కొంటూ అదే 12వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం. తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు   మంగళవారం (సెప్టెంబర్ 13) ప్రభుత్వం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, కావేరి వ్యవసాయ, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్‌, నిక్ మార్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది. అలాగే కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 25 శాతం తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఆమోదించింది. రేపు సభలో ఏం జరగాలో ఈ రోజే నిర్ణయించేసి, అందుకు అనుగుణంగా పేపర్లు రూపొందించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చందంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్నది. చట్ట సభల ప్రతిష్టను మసకబార్చే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట సభలలో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వమేదీ గతంలో లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

ఆకాశంలో మెరుపుల రైలు!

తార‌లు దిగివ‌చ్చిన వేళ‌.. అంటూ పాత సినిమాల్లో హీరో పాడుకుంటూ తోట‌లో తిరుగుతూంటాడు.. చంద మామా రావే.. అంటూ త‌ల్లి పిల్ల‌డి కోసం పిలుస్తూంటుంది.. తార‌లు దిగివ‌స్తారో రారో, చంద‌మామ పిల్ల‌డి కోసం వ‌స్తాడో రాడో కానీ,  ల‌క్నోలో ప్ర‌జ‌లు హ‌ఠాత్తుగా ఆకాశంలో చాలామంది దివిటీలు ప‌ట్టుకుని అలా సంచ‌రిస్తున్న‌ట్టు.. వెలుగు రైలుని చూసి ఆశ్చ‌ర్య పోయారు! ఆకాశం ఎప్పుడూ వింత‌ల కేంద్ర‌మే. వింత వింత ఆకారాల మ‌బ్బులు, మెరుపుల వెలుగురేఖ‌లు.. ఎంత ఆక‌ట్టుకుంటాయో అంత‌గా భ‌య‌పెడ‌తాయి కూడా! ఎండాకాలం వెండిమేఘాలు, వ‌ర్షాకాలం వాన మ‌బ్బు లు ఎప్పుడూ చిత్ర విచిత్రాల‌నే చూపుతుంటాయి. ప్ర‌పంచంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక స‌మ‌యం లో ఆకాశంలో ఏదో అద్భుతం జ‌ర‌గుతూనే ఉంటుంది. అంత‌రిక్షం ఎప్పుడూ మిస్ట‌రీయే అంటారు శాస్త్ర‌ వేత్త‌లు.  ఇటీవ‌లి కాలంలో శాస్త్ర‌వేత్త‌లు యు ఎఫ్ ఓలు వ‌స్తూ పోతున్నాయంటున్నారు. వేరే గ్ర‌హం నుంచి ఎవ‌రో వ‌స్తూ పోతున్నార‌న్న వాద‌నా వినప‌డుతోంది. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎంత వ‌ర‌కూ న‌మ్మాల‌న్న‌దే ఇంకా ఇద‌మిద్ధం తేల లేదు. ఈమ‌ధ్య‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌క్నోలో ప్ర‌జ‌లు హ‌ఠాత్తుగా ఆకాశం లో ఏదో రైలు వెళుతూన్న దృశ్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.  ఆకాశంలో వెలుగు చుక్క‌లు అలా పెద్ద రైలు వెళ్లిన‌ట్టు వెళ్ల‌డం స్థానికులు చూశారు. అదేదో పిల్ల‌ల ఆట‌లో రైలు వెళుతోన్న‌ట్టు సాగిపోవ‌డం చూసి పిల్ల‌లూ కేరింత‌లు కొట్టారు. చూడ్డానికి ఎంతో బావుంద‌ న్నారు అం తా. ఇటువంటివి ఎన్న‌డూ గ‌మ‌నించ‌లేద‌న్నారు.  అయితే అదేమీ భ‌య‌ప‌డాల్సినది కాద‌ని, అది స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్  అయి ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అన్నారు. అంతే త‌ప్ప అదేమి వేరే గ్ర‌హాల‌నుంచీ దివిటీలు ప‌ట్టుకుని ఎవ్వ‌రూ కింద‌కి దిగ‌డం లేద‌ని, అలా భావించి భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని అన్నారు. చాలామంది ఆ వెలుగుల రైలును కెమెరాల్లో, ఫోన్‌ల లో బంధించారు. కాగా, చాలామంది ఛాంద‌సులు ఇది దైవ‌మ‌హ‌త్యం అని అంటున్నారు. చాలామంది ట్విట‌ర్ వినియోగ‌దారులు ర‌క‌ర‌కాల అభిప్రాయాల‌ను పోస్టు చేస్తున్నారు. కొంద‌రు నాసా సంబంధించిం ద‌ని, మ‌రికొంద‌రు ఇస్రో స్పేస్ ఎక్స్ సంబంధించిన‌ద‌ని కామెంట్లు పెట్టారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ, పెద్దగా భ‌య‌పడాల్సిన అవ‌స‌రంలేద‌ని అంటున్నారు. ఆకాశంలో క‌న‌ప‌డుతున్న అనేక విచిత్రాల్లో ఇదొక‌టిగా భావించాలి. 

స‌హ‌కార‌చ‌ట్టం స‌వ‌రించ‌నున్న జ‌గ‌న్ స‌ర్కార్‌

స‌హ‌కార వ్య‌వ‌స్థ‌లో అనేక మార్పుల‌ను ఏపీ  రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జి క‌మి టీల గ‌డువు వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కూ పొడిగించడంతో ఈలోగా స‌హ‌కార‌చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని నిర్ణ‌యిం చింది. ఆ త‌ర్వాత‌నే స‌హ‌కార సంఘాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో స‌గం మండలాల‌కు డీసీసీబీల నెట్‌వ‌ర్క్ అనుసంధానం కాక‌పోవ‌డం వ‌ల్ల రుణాలు ఎక్కువ‌గా ఇవ్వ‌లేక‌ పోతున్నా మ‌ని అధికారులు ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు.   ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)ల్లో క్రమం తప్పకుండా ఆడిటింగ్‌ జరపాలని, నివేది క‌ల్లో  వ్యత్యాసం కనిపిస్తే, థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని, ఇందుకోసం ఆప్కాబ్‌, డీసీ సీబీల్లో నిపుణులను నియమించాలని ప్ర‌తిపాదిస్తున్నారు. ఆప్కాబ్‌, డీసీసీబీ, పీఏసీఎస్‌ బోర్డుల్లో మూడింట ఒకవంతు మంది నిపుణులను డైరెక్టర్లుగా నియమించాలని, సగం మంది ప్రతి రెండున్న రేళ్లకు విరమించేలా చట్టసవరణ చేయాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయల్లోని వ్యవసాయ సహాయ కులను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావడం..సహకార రంగంలో సమగ్ర బ్యాంకింగ్‌ సేవలకోసం ఆప్కా బ్‌, డీసీసీబీలు, పీఏసీఎస్‌ల‌నువచ్చేనెలలో కంప్యూటరీకరణ చేయడం ప్ర‌తిపాద‌న‌ల్లో ఉన్నాయి.  ఇదిలా ఉండ‌గా, అధికారులు సహకార ఎన్నికల ప్రక్రియకు చర్యలు చేపట్టారు. సహకార సంఘాల్లో ఎంతమంది అర్హులైన ఓటర్లున్నారు, కొవిడ్‌ సమయంలో ఎంత మంది సభ్యులు మరణించారు, పీఏసీ ఎస్‌ల్లో పంటరుణాలు, ఇతరత్రా రుణాలు తీసుకున్న వారిలో సకాలంలో రుణాలు చెల్లించని డిఫా ల్టర్స్‌ ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రొఫార్మాను రూపొందించి క్షేత్రస్థాయి అధికారులకు పంపిన ఉన్నతాధికారులు..డిఫాల్టర్స్‌ జాబితాలను స్థానిక ఎమ్మెల్యేలకు అందజే యాలని డివి జనల్‌ సహకార అధికారులను ఆదేశించారు.  అయితే డిఫాల్టర్స్‌కు ఓటు హక్కు తొలగించేందుకు రాజకీయంగా వ్యూహాలు రూపొందించేందుకు ఎన్న డూ లేని విధంగా ఎమ్మెల్యేలకు డిఫాల్టర్స్‌ జాబితాలు ఇవ్వనున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సహకార ఎన్నికలు నిర్వహించే క్రమంలో హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు కూడా చట్టసవరణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం జీవో ద్వారా హెచ్‌ఆర్‌ పాలసీ తెచ్చి, ఉద్యోగుల బదిలీలు చేపట్టడం చట్టరీత్యా సాధ్యం కాదని చెబుతున్నారు. 

రాజకీయాల్లోనూ రాజే.. కానీ.. స్టెప్పులే ప్చ్!

తెలుగు సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరోలు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అయినా, అందులో మంత్రులై ఓ వెలుగు వెలిగిన వారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో రెబల్ స్టార్ గా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఒకరు. నిజానికి కృష్ణం రాజు కంటే ముందు ఆయన తర్వాత కూడా కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు , నిర్మాత రామానాయుడు   వరకు, నటశేఖర కృష్ణ మొదలు సత్యనారాయణ వరకు మురళీ మోహన్ మొదలు మెగాస్టార్ చిరంజీవి వరకు, జమున, ఊర్వశి శారద మొదలు విజయశాంతి, జయప్రద వరకు ఇలా పార్లమెంట్ గడప తొక్కిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రలో మంత్రి పదవికి చేరుకున్నది మాత్రం  కృష్ణం రాజు, ఆయన తర్వాత చిరంజీవి. ఈ ఇద్దరిని మాత్రమే మంత్రి పదవి వరించింది.  అయితే, రెబెల్ స్టార్ సినిమా జీవితం ఆయన నటించిన సినిమాలు, చేసిన  పాత్రల విషయాన్ని పక్కన పెట్టి, రాజకీయ జీవితం విషయానికి వస్తే, కృష్ణం రాజు రాజకీయాల్లో ఎక్కడా స్థిరంగా నిలబడలేక పోయారు. సినిమాల్లో నవరసాలు, ముఖ్యంగా రౌద్ర రసాన్ని అద్భుత్వంగా పండించిన కృష్ణం రాజు, పాటలు స్టెప్పులు దగ్గర కొచ్చే సరికి తడబడి పోయేవారని, స్టెప్పులు సరిగా పడేవి కావని అంటారు. రాజకీయాల్లోనూ అంతే, ఆయన స్టెప్పులు సరిగా పడలేదు. నడక సరిగా సాగలేదు. ఏ పార్టీలోనూ స్థిరంగా నిలబడలేదు. అందుకే ఆయన రాజకీయ రంగంలో ఆశించిన పదవులను అందుకోలేక పోయారు.  నిజానికి కృష్ణం రాజనే కాదు,సినిమా హీరోలు చాలా వరకు రాజకీయాల్లో అంతగా రాణించలేక పోవడానికి నిలకడలేని తనం కూడా ఒక కారణమని  విశ్లేషకులు అంటారు. కృష్ణం రాజు తర్వాత కేంద్ర మంత్రి స్థాయికి చేరిన హీరో చిరంజీవి విషయాన్నే తీసుకుంటే, ఆయనా అంతే... ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒక్క ఎన్నికల్లో ఓడి పోగానే, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ గంగలో కలిపేశారు. అఫ్కోర్స్, అలా కాంగ్రెస్ లో కలిపేశారు కాబట్టే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యారనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగా స్టార్, ఆ పార్టీలోనూ నిలవలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీని వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా మళ్ళీ అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. వేషం మార్చి మళ్ళీ రంగుల ప్రపంచంలోకి వచ్చేశారు.  కృష్ణం రాజు కూడా అంతే, 1991 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రాజకీయ అరంగేట్రం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చున్నారు. 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్ధి తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. అదే సమయంలో కేంద్రలో అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో బీజేపీ సంకీర్ణ ప్రభుతం ఏర్పడింది. అయితే, సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఎన్నికలు రావడంతో, ఆయన 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై పోటీచేసి  1,65,948 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అంతే కాదు, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా రంగం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన తొలి హీరోగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు. 2000 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 2000 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు.ఆ తర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై 1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.  2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో ఓటమి చెందారు.  ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు, 2009 మార్చిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.  రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయినా, ఆయన 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గవర్నర్ పదవి ఆశించారు కానీ, అదీ దక్కలేదు. చివరకు ఆ కోరిక తీరకుండానే, లోకాన్ని విడచి వెళ్ళిపోయారు.

లాంఛనం పూర్తయ్యింది..ఈటల సస్పెండయ్యారు!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు. ముఖ్యమంత్రి తలకుచుంటే ఎమ్మెల్యేకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఎంత మాత్రం లభించదు అని ఇప్పుడు  అనుకోవలసిన పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస బహిష్కృతుడు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినా.. కేవలం కేసీఆర్ కు ఇష్టం లేని కారణంగా ఇప్పటి వరకూ అసెంబ్లీలో కూర్చో లేని పరిస్థితి. తాజాగా ఆయనను మంగళవారం (సెప్టెంబర్ 13) మరో సారి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన సభలోకి అడుగుపెట్టకుండానే.. అంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభం కావడానికి ముందే స్పీకర్ కార్యాలయం నుంచి ఈటలపై సస్పెన్షన్ వేటు నిర్ణయం వెలువడింది. అసలు ఆయనను  సోమవారమే (సెప్టెంబర్ 12)సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. అయితే సోమవారం ఈటల సభకురాకపోవడంతో ఆయన సస్పెన్షన్ విషయాన్ని అధికార టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఈటల సోమవారం సభకు గైర్హాజర్ కావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వాటికి చెక్ పెట్టేందుకా అన్నట్లుగా మంగళవారం సభకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఆయనకు ఆ అవకావం ఇవ్వలేదు. అసెంబ్లీకి వచ్చిన ఈటలను పోలీసులు బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. అసెంబ్లీకి వెళుతున్నట్లుగా ఈటల మీడియాకు సమాచారం అందించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతకీ  ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ వేటుకు కారణమేమిటంటే.. సభ ప్రారంభం రోజున బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులకు ఆహ్వానం అందకపోవడంపై ఈటల విమర్శించడమే. బీఏసీ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడంపై ఈటల స్పీకర్ మరమనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ మండిపడింది. తన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తప్పవనీ హెచ్చరించింది. అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు అనివార్యమని అంతా ఊహించారు. అందరూ ఏం ఊహించారో అదే జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఈటల అసెంబ్లీకి  హాజరు కాకుండా కుట్ర చేస్తున్నారనీ, ఆయన గొంతు నొక్కేయాలని చూస్తున్నారనీ బీజేపీ విమర్శిస్తున్నది. గత సమావేశాలలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న కారణంతో స్పీకర్ పోచారం సభ నుంచి బీజేపీ సభ్యులు ముగ్గురినీ ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను సస్పెండ్ చేశరు. ఇక ప్రస్తుత సమావేశాలకు వచ్చే సరికి ఈటల సస్పెండ్ కాగా, మరో ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉన్నారు. ఇక సభలో మిగిలిన ఏకైక సభ్యుడు రఘునందనరావు మాత్రమే. ఇలా ఉండగా కేసీఆర్ కు ఈటల పట్ల ఉన్న అయిష్టత కారణంగానే ఆయనపై పదే పదే సస్పెన్షన్ వేటు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గోమూత్రంతో   ప్ర‌క్షాళ‌న‌!

అబ్బాయి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ని తెలిసి పెద్దావిడ వెళ్లింది. గృహ‌ప్ర‌వేశం రోజు ఇల్లంతా ప‌సుపునీల్లు జ‌ల్లి, ద్వారాల‌కు ప‌సుపు కుంకుమ బొట్లు పెట్టి తోర‌ణాలు క‌ట్టి  నానా హ‌డావుడీ చేసిందామె. ఎవ‌రో ఛాద‌స్తం అన్నారు. కాదు సంప్ర‌దాయ‌మ‌న్న‌దామె. ప‌క్క‌వీధిలో మొన్న‌టికి మొన్న ఆవే ఈనితే ల‌క్ష్మీదేవి అంటూ పూజ‌లు చేసి గోశాలంతా ప‌సుపునీల్లు చిల‌క‌రించి ద‌ణ్ణాలు పెట్టి ఇల్లంతా పండ‌గ చేసుకున్నారు. కానీ చిత్రంగా ముంబైలో ఉద్ధ‌వ్ థాక్రే అనుచ‌రులు మాత్రం గోమూత్రాన్ని రోడ్డంతా చిల‌క‌రించారు! అస‌లే అక్క‌డ ఉద్ధ‌వ్ థాక్రే, షిండేల మ‌ధ్య విభేదాలతో ఇరువ‌ర్గాల వారూ ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. అది ఇప్పుడు మ‌రింత రోడ్డు మీద‌కి వ‌చ్చేసింది. త‌మ నాయ‌కుడిని గ‌ద్దె దించాడ‌ని థాక్రేవ‌ర్గీయులు పీక ల్లోతు కోపంతో ఉన్నారు. షిండే  ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆయ‌న అనుచరులు  థాక్రే వ‌ర్గీయుల ప‌ని ప‌డుతున్నారు. థాక్రే  వ‌ర్గీయుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఒక్కోరికి  షిండే  ఏకంగా రూ.50 కోట్లు  ఇచ్చి న‌ట్టు ఆరోపణ‌లు  ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వీల‌యితే అప్పుడు ఇరువర్గాల వారూ కొట్లాట‌కీ దిగుతు న్నారు.  మొన్నీమ‌ధ్య‌నే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే  ఔరంగాబాద్‌లో  ఒక స‌మావేశం ఏర్పాటు చేసా రు. అది కాగానే షిండే, ఆయ‌న‌తో వ‌చ్చిన‌వారంతా వెళిపోయారు. ఏదో పెద్ద దోషం జ‌రిగిన‌ట్టు థాక్రే అను చ‌రులు కొంద‌రు వెంట‌నే ఆ ప్రాంత మంతా గోమూత్రంతో ప‌రిశుద్ధి చేయ‌డానికి పూనుకున్నారు. చిన్న చిన్న ప్లాస్టిక్ బ‌కెట్ల‌లో నీళ్లు, గోమూత్రం క‌లిపిన నీళ్లు తెచ్చి ఆ ప్రాంత‌మంతా చిల‌క‌రించారు. ఇంత‌కంటే వైరం మ‌రోటి ఉండ‌దు. థాక్రే, షిండేల మ‌ధ్య వైరం ఏ స్థాయిలో ఉంద‌న్న‌ది  ఈ  సంఘ‌ట‌న స్ప‌ష్టం చేసింది. 

ఎమ్మెల్యే అంటే పెద్దోళ్ల‌కి పైస‌లిచ్చేటోడు..!

మొన్నామ‌ధ్య ఏడో త‌ర‌గ‌తి పిల్లాడు సోష‌ల్ ప‌రీక్షరాయ‌డానికి క్లాసులోకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేప‌టికి క్వ‌శ్చన్ పేప‌ర్ ఇచ్చాడు టీచ‌ర్‌. అందులో ఒక ప్ర‌శ్న చూసి ఆ విద్యార్ధి తెగ కంగారు ప‌డ్డాడు. సోష‌ల్ అన‌గానే మ‌రీ ఇంత తాజా రాజ‌కీయాల సంబంధిత ప్ర‌శ్న అడుగుతార‌ని ఊహించ‌లేదు. ఇంత‌కీ ఆ ప్ర‌శ్నేమిటంటే ఎమ్మెల్యే అంటే ఎవ‌రు? అని!  దానికి  ఆ విద్యార్ధి మ‌నం ఎవ్వ‌రం ఊహించ‌ని స‌మాధా నం రాశాడు. ఎన్ని క‌ల స‌మ‌యంలో వ‌చ్చి పెద్దోళ్ల‌కి  బిర్యానీ, డ‌బ్బులిచ్చేవాడ‌ని!! ఏడో త‌ర‌గ‌తి విద్యార్ధి ఏమాత్రం త‌డుముకోకుండా త‌న‌కు తెలిసింది రాసేసాడు. ఏమాత్రం త‌ప్పు రాయ లేద‌ని ఎంతో ధైర్యంగా పేప‌రు ముగించి టీచ‌ర్‌కి ఇచ్చేసి వెళ్లాడు. ఇంత‌కీ ఆ పిల్ల‌వాడు రాసిన‌ది ఇన్‌విజి లేట‌ర్ చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. ఎవ్వ‌డూ ఇంత చిన్న‌వ‌య‌సువాళ్లు ఇలాంటి స‌మాధానం చెప్ప‌డం, రాయడం ఆమె క‌నీ వినీ ఎరుగ‌దు. ఆశ్చ‌ర్యం కాదు.. క‌డుపుబ్బ న‌వ్వుకుంది ఆ టీచ‌ర్‌!  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చి పెద్దోళ్ల‌కి డ‌బ్బులు, మ‌హిళ‌ల‌కు చీర‌లు ఇచ్చేవాడే ఎమ్మెల్యే అని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఆ పిల్ల‌వాడు రాశాడు. వాస్త‌వంగా చూసిన‌ది, తెలిసిన‌దే రాశాడు. ఆ స‌మాధానం న‌వ్వుకోవ డానికి బాగానే ఉంద‌నుకోవ‌ద్దు. ఎందుకంటే, ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ అలా ఉందిగ‌నుక‌. నిజ‌మే, గ్రామా ల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల మాట ఎలా ఉన్నా, ఐదేళ్ల‌కోసారి వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం త‌ప్ప కుండా ప్ర‌తీ ఇల్లూ తిరిగే ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచే ఇంటి పెద్ద‌కు డ‌బ్బులు, మ‌హిళ‌ల‌కు చీర‌లు పంచి త‌మ‌కు ఓటు వేసి గెలిపించాల‌ని వేడుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఇంత‌కంటే దారుణం మ‌రోటి ఉండ‌ద‌ని అనుకోవ‌చ్చు. పెద్ద‌వాళ్లు స‌రే, ఇలాంటి సంఘ‌ట‌న‌లు, సంద‌ ర్భాలు పిల్ల‌లు.. రాబేయే త‌రం మీద ఎంత ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆలోచ‌న ఈ త‌రానికీ లేక‌పోవ‌డ‌మే దుర‌దృష్ట‌క‌రం.  ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా ఫ‌రూక్ మండ‌లం లింగారెడ్డి గూడ స్కూల్లో జ‌రిగింది. ఇక్క‌డ ట్విస్ట్  ఏమిటంటే.. ఆ పేప‌రు దిద్దిన మాష్టారు ఆ స‌మాధానానికి 4 మార్క‌లు వేయ‌డం!