కమలానికి మునుగోడు కషాయం? ఊరించి చేజారిన గెలుపు
posted on Nov 6, 2022 @ 5:18PM
మునుగోడులో గెలుపుతో టీఆర్‌ఎస్ భవన్‌లో గులాబీపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నిక నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడింది. 15 రౌండ్లు ముగిసే సరికి 11,666 ఓట్ల స్పష్ట మైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీఆర్‌ఎస్ పార్టీ ముం దంజలో నిలిచింది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్ 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరు లకు 88 ఓట్లు సాధించారు. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఉప ఎన్నికలో ఉప ఎన్ని కల ఫలి తాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్ పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయ న ఓటమిని అంగీ కరించారు.
ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. మును గోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఈ స్థానం నుండి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించా రు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వా యి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ నియోజక వర్గంలో గురువారం జరిగిన పోలింగ్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.
మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. ఇందులో 2,25,192 మంది ఓటువేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలి చారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదో రౌండ్ లో బీజేపీ పై టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. 1,4,5 రౌండ్లలో టీఆర్ఎస్ ఆదిక్యంలో నిలిచింది. రెండు,మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ ఆధిక్యత ను సాధించింది.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లో 1,352 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్‌కి 6,478, బీజేపీకి 5,126, కాంగ్రెస్‌కి 2,100 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ 563 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ ఎస్ కి 14,211, బీజేపీకి 13,648, కాంగ్రెస్‌కి 3,597 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి. 4 రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు. ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,1,62 ఓట్లు, బీజేపీఅభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,245 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు రౌండ్లు కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 32,605 ,బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,974 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 10,055 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 52,334 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 49,243 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 13,689 ఓట్లు దక్కాయి. బీజేపీ ఎన్నో ఆశ లు పెట్టుకున్న చండూరు మండలంలోనూ టీఆర్ఎస్ కారు దూసుకెళ్లింది. 9వ రౌండ్‌లో కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 7,497 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 6,665 ఓట్లు వచ్చాయి.10వ రౌండ్‌లోనూ కొనసాగిన టిఆర్ఎస్ ఆధిక్యత. మొత్తం మీద 4,416 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 74,574 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 68,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 16,280 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిపై 5,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7440, బీజేపీ 5398. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 2042. 12 రౌండ్లు ముగిసేసరికి 7836 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వాకిట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తుండడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆల స్యంగా ప్రకటిస్తుం డడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని కోరారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి వివరాలు తెలిపాలని ఆయన కోరారు. దీని పై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమ వుతుందని చెప్పారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని, ఆర్వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామ ని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు.
ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించారు. అయితే ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడం.. బీజేపీ, టీఆర్ఎస్‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా సిట్టిం గ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ముందు నుంచే ప్రయత్నాలు చేపట్టింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రచారంలో విషయంలో మాత్రం ఆ పార్టీ వెనక బడిందనే చెప్పాలి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మాదిరిగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వ హించలేదనే టాక్ కూడా ఉంది. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చాలా మంది మునుగోడు వాసులే స్వయంగా వెల్లడించారు.
మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై తన అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏడు రౌండ్లు కౌంటింగ్ పూర్తైనప్పటికి ఆయనకు కనీసం ఓట్లు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. లక్షా 17 వేలు ఓట్లు ఉంగరానికి పడ్డాయని మునుగోడు ప్రజలు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పటి వరకు తనకు 600 ఓట్లు కూడా నాకు రాకపోవడంపై అను మానం వ్యక్తం చేశారు. ఈవీఎం ల పనితీరుపై తనకు నమ్మకం లేదన్నారు కేఏ పాల్. ఇదంతా బిజెపి, టీఆరెఎస్ పార్టీల కుట్రగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. 200ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారాయన. ఎలక్షన్‌ను రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడితో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీ గా ఫలితాలను అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేద న్నారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కార ణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎం దుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.