ఇద్దరూ ఇద్దరే.!
posted on Nov 7, 2022 @ 2:58PM
నటన సినీనటులకే పరిమితం కాదు. రాజకీయాల్లోనూ నటుటు, మహానటులు ఉన్నారు. తాజా ఉదా హరణతెలంగా ణా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి. తమ్ముడికోసం ఏదయినా చేస్తా అనే పాత సినిమా డైలాగే ఈయనకు సూట్ అవుతుంది. అవును. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటపడడంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. సోదరుడు రాజగోపాల్ కి కాంగ్రెస్ వ్యవహారాలు నచ్చక బీజేపీ లోకి మారారు. బీజేపీ సీనియర్లు ఈయన రాకతో ఘన విజయం సాధించ గలమనే అనుకున్నారు, తర్వాత సందేహించారు.. చివరగా ఓడిపోయారు. సరిగ్గా ప్రచారం ఊపం దుకున్న సమయంలో తన పార్టీకి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారం చేయలేదు. ఎన్నికల ప్రచారం కంటే విదేశీ పర్యటన అత్యవసరమయింది. పైగా మునుగోడు ఎన్నిక ముందు వరకూ కనిపించననీ అన్నారు. అన్నట్టే చేశారు. వెళ్లినాయన ఊరికినే తన స్నేహితు లతోనో, బంధువులతోనో తిరిగి సరదాగా గడపకుండా అక్కడి నుంచి గొప్ప వార్త ప్రచారం చేసేరు.. మునుగోడులో మా వాళ్ల రావడం కష్టం సుమా.. అంటూ. ఇదే పార్టీ వర్గాలను మరింత కుంగదీసింది. అసలే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధి గెలుపు కాస్తంత కష్టమేనన్నదీ లోలోపల పార్టీ నాయకునికీ ఉన్పప్పటికీ ఆమె తండ్రి పెద్ద నాయకుడు కనుక ఆయన ప్రభతో ప్రచారం సాగించి సాధించవచ్చని అనుకున్నారు. కానీ చతికిల పడ్డారు కాంగ్రెస్ వారు.
టీఆర్ ఎస్ గెలిచింది. బీజేపీ ఓడింది. కానీ మెజారిటీ పరంగా టీఆర్ఎస్ కి పెద్దగా సంతృప్తి నివ్వలేదు, బీజేపీ వారికి రవ్వంత ఆనందాన్నిచ్చింది. కానీ బాగా నవ్వుకుంది మాత్రం కోమటి రెడ్డి బ్రదర్స్ అనాలి. చెరో పార్టీలో ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీ లూ ఓడినప్పటికీ కేసీఆర్ కంటే ఎంతో ఆనందిస్తున్నారిద్దరూ. అన్నగారికి తమ పార్టీ ఓడినందుకు కాదు, తమ్ముడు గెలవబోయి గెలుపు గేటు దగ్గర పడిపోయినందుకు ఆనందం.. కేసీఆర్ కి బీజేపీ మెరుగుపడిందని బాధ, కాంగ్రెస్ రేవంత్ కి పార్టీని మరీ దారుణ పరిస్థితికి దిగజార్చేనని బాధా ఉండవచ్చు. అయితే వెంకట రెడ్డి ముందే ఇవన్నీ ఊహించే సమయానికి తగిన ప్రాంతం ఎంచుకుని పారిపోయారనాలి. దగ్గరుండి ఓటమి కి ప్రచారం చేసుకునే కంటే ఓటు వేయడం మంచిదనే అనుకున్నారనుకోవాలి.
సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం పెద్దాయనకు ఉండకపోలేదు. కానీ తమ్ముడు మారిన పార్టీ వారికే ఆయన మీద నమ్మకం సన్నగిల్లింది. అందుకే ప్రచారం పేరుతో బీజేపీ సీనియర్లంతా యాత్రలు చేశారు. ఇదంతా గమనిస్తూ సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం వెంకటరెడ్డికీ వచ్చి ఉంటుంది. కానీ చివాఖర్న దెబ్బతీసింది. కానీ రేవంత్ ఏదో సాధిస్తాడని డబ్బాకొట్టుకున్న తన పార్టీవారికి డిపాజిట్ గల్లంతుకావడం విడ్డూరమే. అంత భారీ ప్రచారాలు, భారీ ప్రసంగాలు ఓటరుని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. తనను స్టార్ కాంపెనీర్ గా పెట్టుకుని, ఆయనే ముందుండి గెలిపిస్తారని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ, ఆయనకు అంత ప్రాధాన్యతను వాస్తవానికి ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. పార్టీ, అందునా పురాతన పార్టీలో విభేదాలు ఉండకా పోవు. కానీ సమయం గాని సమయంలో అభిప్రాయభేదా లతోనే స్టార్ కాంపనర్ గారు ఆస్ట్రేలియా పర్యటించడమే పార్టీని నీరసపరిచింది.
ఎవరో అన్నట్టు తమ్ముడు తమ్ముడే, అన్న మాత్రం అన్నకాదు తమ్ముడి వీరాభిమానే. అందుకే వీరాభి మానం ప్రదర్శించి తమ్ముడి విజయాన్ని ఆశించారు.. వెళుతూ వెళుతూ మావోడిని కాస్తం జూస్కోం డన్నా.. అని చిన్న సందేశం ఓటర్లకు చేరేలా చేసి మరీ పర్యటనకు వెళ్లారు. పార్టీలు వేరయినా సోదర ప్రేమ అంతకు మించి ఉంటుందన్నది కాంగ్రెస్ ఘోర పరాభవం తేటతెల్లం చేసింది. కోమటిరెడ్డి బ్రదర్స్కి కొంత బాధ కంటే ఆనందమే ఎక్కువ మిగిలిం ది. పార్టీ మారి ఓడినా తన సత్తా ప్రదర్శించానని సోదరుడు తెలియజేశాడు. పెద్దాయన తమ్ముడి విజయాన్ని కాకున్నా విజేత సత్తాని గుర్తించానని ఆనందిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.