ఉప ఎన్నికల్లో కమల వికాసం
posted on Nov 7, 2022 6:37AM
మునుగోడులో ఓడినా.. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలల బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. తెలంగాణలోని మునుగోడు సహా దేశ వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు జరిగిన ఉన ఎన్నికల ఫలితాలు ఆదివారం (నవంబర్6) వెలువడ్డాయి.
వీటిలో నాలుగింటిలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మునుగోడు, బీహార్ లోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే మహారాష్ట్రలోని ఒక నియోజకవర్గంలో బీజేపీకి పరాజయం ఎదురైంది. మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కమల వికాసమే జరిగింది.
బీహార్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా వాటిలో మకావూలో పరాజయం పాలైన బీజేపీ గపాల్ గంజ్ నియోజకవర్గంలో జయకేతనం ఎగుర వేసింది. ఉత్తరప్రదేశ్, , ఒడిశా, హర్యానా, మహారాష్ట్లలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగగా అక్కడ బీజేపీ గెలుపొందింది.