గాడిద మాంసంతో శృంగార సామర్థ్యం
posted on Nov 7, 2022 @ 10:28AM
సరిగా చదవని పిల్లాడిని గాడిద అని మాస్టారు, గాడిదలా ఉన్నావ్.. ఆ మాత్రం తెలీదా అని అసభ్యంగా ప్రవర్తించిన వాడిని అనేయడం సర్వసాధారణం. అసలు లోకంలోకి ముందే వచ్చిన జంతుజీవాలంటే మనిషికి మహా చులకన. కొన్నింటిని మన పనులకు, కొన్నింటిని రక్షణకు ఉపయోగించుకుంటున్నా మేగాని, వాటివల్ల కలిగే ప్రయోజనాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. చాలామంది మేకని తింటారు, మేక పాలు తాగుతారు, గాడిద చేత చాకిరీ చేయించు కుంటారు కానీ పాలు తాగమంటే చిరాకుపడతారు. అది బట్టలు మోసే గాడిదేగాని పాలిచ్చి మనిషి ఆరోగ్యానికి మేలు చేసేంత సీన్ లేదనే అభిప్రాయాలే ఎక్కువ. కానీ గాడిద పాలు, మాంసానికి చాలా డిమాండ్ ఉందన్నది ఇటీవలే బయటపడింది.
గాడిద మాంసం తినడం వల్ల మగవాళ్లలో శృంగార సామర్ధ్యం పెరుగుతుందనే ప్రచారం కూడా ఉంది. అంతే కాదు గాడిద మాంసం తింటే గుండె జబ్బులు, ఆస్తమా., కీళ్ల నొప్పుల సమస్య ఉండవని వైద్యులు సైతం చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసం విక్రయాలు పెరిగాయి. మార్కెట్‌లో గాడిద మాంసానికి ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని కొందరు అక్రమంగా గాడిద మాంసాన్ని తెచ్చి సొమ్ము చేసుకుంటున్న వాళ్లు బాగా పెరిగిపోయారు. అందుకే అక్రమంగా గాడిద మాంసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కారణం ఏదైనా కావచ్చు ఇప్పుడు మాత్రం అక్కడి జనం గాడిదమాంసం కోసం ఎగబడుతున్నారు. కిలో 600రూపాయలకు అమ్ముతు న్నారు. అంటే మటన్ కంటే కేవలం వంద రూపాయలు తక్కువ ధరకు, చికెన్ కంటే మూడు రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ విషయం జంతుసంరక్షణ కోరుకునే యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీకి చెందిన వాళ్లు పెటా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశా రు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బాపట్ల పోలీసులు జిల్లాలోని ఉజిలిపేటలో రెండు చోట్ల వేట పాలెం లోనూ దాడులు నిర్వహించి 400కేజీల గాడిద మాంసంతో పాటు గాడిదతోకలు, గాడిద శరీరభాగాలను స్వాధీ నం చేసుకున్నారు. ఇక అక్రమంగా గాడిద మాంసం విక్రయిస్తున్న వారిపై ఐపీసీ సెక్షన్ 1860లోని వివిధ నిబంధనల ప్రకారం 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లతో పాటు వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అక్రమ వ్యాపారంతో వధకు పాల్పడిన వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేశారు.
అయితే, భారతదేశంలో గత ఏడేళ్లలో గాడిదల సంఖ్య 61శాతం తగ్గింది. 2019 లెక్కల ప్రకారం దేశంలో 1.2లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. 2012 నుంచి దేశంలో 60శాతం గాడిదలు అంతరించిపో యా యి. దీంతో వీటిని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , తమిళనాడు, మహారాష్ట్ర , కర్ణాటకల నుంచి అక్రమంగా తర లిస్తున్నారు.పెటా ప్రకారం గాడిదలను చంపడం, మాంసం తినడం నేరంగా పరిగణించి వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.