ఇస్తే నేను రెడీ అంటున్న కుష్బూ..
తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు కుష్బూకు టీఎన్‌సీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది నిజమో.. కాదో తెలియదు కానీ.. వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవికెఎస్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆపదవి ఖాళీగా ఉంది. దీనికి పీటర్‌అల్ఫోన్స్, వసంతకుమార్, సుదర్శన్ నాచ్చియప్పన్, కుమరిఅనంతన్‌లు రేసులో ఉండంగా..ఇటీవలే రాహుల్ వారితో మాట్లాడారు. అయితే ఇప్పుడు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో కుష్బూ భేటీ అవ్వగా వారు ఏం చర్చించుకున్నారో తెలియదు కాని.. ఆమెకు తమిళనాడు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ విషయంపై స్పందించిన ఖుష్బూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో నార్మల్‌గానే భేటీ అయ్యానని, తనకు టీఎన్‌సీసీ అధ్యక్షురాలి పదవిని ఇస్తే స్వీకరిస్తానని, కానీ అందుకు తగ్గ నేతలు చాలామంది పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. మరి ఏ జరుగుతుందో.. ఎవరికి పార్టీ పగ్గాలు అందుతాయో చూడాలి.