మీ నేతలను పట్టించుకోవా కేజ్రీవాల్..
posted on Jul 14, 2016 @ 11:20AM
ఆప్ నేతులు ఎప్పడూ ఏదో వివాదాన్ని నెత్తిన పెట్టుకుంటూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది నేతలు.. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు మరో కొత్త నేత.. మరో తలనొప్పి తీసుకొచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే.. సొంత పార్టీనేతే ఆరోపణలు చేయడం. అసలు సంగతేంటంటే..ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ మద్యం మత్తులో పార్లమెంటుకు హాజరయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై గతంలో యోగేంద్ర యాదవ్..మద్యానికి బానిసగా మారిన మన్... చాలాసార్లు తాగిన మైకంలోనే లోక్ సభలో అడుగుపెట్టారని ఆరోపించారు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా మన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యం సేవించి పార్లమెంటుకు వెళుతున్న భగవత్ మన్ పంజాబ్ ప్రజల ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. మరి ఎంతవరకూ వేరే పార్టీ నేతలను విమర్సించే కేజ్రీవాల్ తమ పార్టీ నేతలు చేసే పనుల గురించి పట్టించుకొని చర్యలు తీసుకుంటారో.. లేక లైట్ అని వదిలేస్తారో చూడాలి.