బుర్హాన్ వానీ ఒట్టి పిరికి పంద.. ఏడ్చేశాడంట..!
posted on Jul 14, 2016 @ 3:33PM
బుర్హాన్ వానీ.. ప్రస్తుతం కాశ్మీర్లో అల్లర్లు సృష్టించడానికి కారణమైన పేరు. గత నాలుగు రోజుల నుండి కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆయన మృతికి నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలో చాలామంది భద్రతా పోలీసులు మరణించగా.. పలువురికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇంత మంది కలిసి బుర్హాన్ ముజఫర్ వానీని హీరోని చేసి ఇంత సీన్ చేసిన నిరసనకారులు.. అసలు వాళ్లు అంత చేసే కెపాసిటీ బుర్హాన్ వానీకి ఉందా.. అంటే లేదనే అంటున్నారు.
అసలు సంగతేంటంటే.. ఇప్పటి వరకూ.. బుర్హాన్ పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నట్టు.. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అతడిని ఓ పోరాట యోధుడిగా చెప్పుకొచ్చాడు. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదట. ఎందుకంటే.. ఈ నెల 8న జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో తలదాచుకున్న అతడి స్థావరాన్ని భారత సైనికులు చుట్టముట్టగానే అతడు బెంబేలెత్తిపోయాడట. భారత సైనికుల బూట్ల చప్పుడు వినిపించగానే అతడు ప్రాణభయంతో వణికిపోయాడట. అంతేకాదు.. సైన్యం చేతిలో తనకు చావు తప్పదని తెలుసుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోధించాడట. కానీ మన సైన్యం మాత్రం బుర్హాన్ వనీ.. మరో ఇద్దరు ఉగ్రవాదులను కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో వారిని మట్టుపెట్టారు. మరి అలాంటి పిరికి పంద కోసం కాశ్మీర్లో ఇంత అల్లరి సృష్టించడం కరెక్టో కాదో ఆలోచించుకుంటే బావుంటుంది.