అసెంబ్లీలోనే రాత్రంతా పడుకొని ఎమ్మెల్యేల నిరసన..
posted on Jul 14, 2016 @ 2:33PM
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇటీవల కర్ణాటకలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగానే వారు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. మరోవైపు సిద్దరామయ్య డీఎస్పీ ఆత్మహత్యపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించినా విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్పీకర్ చేసేది లేక సభను వాయిదా వేశారు. అయినా శాంతించని విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. రాత్రంతా అసెంబ్లీలోనే ఉండి అక్కడే చక్కగా దుప్పట్లేసుకుని పడుకున్నారు. ఎమ్మెల్యేల వినూత్న నిరసనతో నేటి ఉదయం ఆయా పార్టీలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెర తీశాయి. కేజే జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళన విరమించేది లేదని ఆ పార్టీలు తేల్చిచెప్పాయి. మరి మంత్రిగారు రాజీనామా చేస్తారో లేదో చూడాలి..