ఈకుక్కకి హ్యాట్సాఫ్ చెప్పాలిందే..
posted on Jul 14, 2016 @ 4:35PM
కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని అంటాం.. అది మరోసారి నిరూపించింది భువనేశ్వర్ లోని ఓ కుక్క. తన యజమాని కుంటుంబాన్ని కాపాడుకోవండం కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టింది. వివరాల ప్రకారం... భువనేశ్వర్‌లోని రాయ్‌ఘడ్ అటవీ ప్రాంతంలో దిబాకర్ అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో తాను పెంచుకునే కుక్కని ఎప్పుడూ బయటనే ఉంచేవాడు. రోజూ లాగే కుక్క బయట ఉండగా.. నాలుగు పాములు ఇంటిలోపలికి రావడం గమనించింది. అంతే వాటితో యుద్దమే చేసింది. ఆఖరికి ఎలాగూ ఆ నాలుగు పాములను చంపింది. అయితే చంపే క్రమంలో దానికి కూడా విషం ఎక్కడం వలన.. వాటిని చంపిన కొద్ది సేపటికే కుక్క కూడా చనిపోయింది. ఈమరుసటి ఉదయం దిబాకర్ లేచి చూడగా.. కుక్క చనిపోవడం చూసి ఏమైందో అని భయపడుతుండగా.. పక్కన నాలుగు పాములు చనిపోయి ఉండటం చూసి షాకయ్యాడు. దీంతో పరిస్థితి అర్ధమైన దిబాకర్.. పాముల నుంచి మా కుటుంబాన్ని కాపాడేందుకు కుక్క తన ప్రాణాన్నే త్యాగం చేసిందని.. కుక్క చూపిన విశ్వాసానికి ఆ కుటుంబం మొత్తం కంటతడి పెట్టింది. మొత్తానికి మనుషులను, మనుషులే నమ్మని ఈరోజుల్లో.. ఒక కుక్క విశ్వాసంతో ఇంత పని చేసిందంటే గ్రేటే కదా..