కృష్ణా జిల్లాలో భార్యకు శీల పరీక్ష..
posted on Jul 14, 2016 @ 7:57PM
రావణుడి వద్ద ఉన్న సీతను అవమానించి అగ్నిపరీక్ష పెట్టాడు శ్రీరామచంద్రుడు. అయినా ఎదురు మాట్లాడకుండా భర్త ఆజ్ఞ మేరకు అగ్నిలో దూకింది సీతమ్మ. సాక్షాత్తూ అగ్నిదేవుడే దిగివచ్చి సీతమ్మ నిప్పులాంటిదని ప్రకటించాడు. ఆనాటి రాముడిని స్పూర్తిగా తీసుకున్నాడో ఏమో గానీ ఒక భర్త కట్టుకున్న భార్యకు శీల పరీక్ష పెట్టాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో తానీష్ అనే వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మాటలతో వేధించడమే కాకుండా, తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ ఆమెను శీలపరీక్షకు ఒప్పించాడు. అందుకు కాలిన ఇనుపరాడ్‌ను ఎంచుకున్నాడు. కాల్చిన ఇనుపరాడ్‌ను చేతితో పట్టుకోవాలని..చేతులు కాలకపోతే శీలవతి అయినట్టు, లేకపోతే శీలం లేనట్లేనని చెప్పడంతో భార్య అందుకు అంగీకరించింది. సాక్షాత్తూ పెద్దల ముందే శీలపరీక్షకు ఏర్పాట్లు చేశాడు. అయితే విషయం పోలీసుల చెవిన పడటంతో సమయానికి అక్కడికి చేరుకుని తానీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.