డైలీ సీరియల్ మాదిరి శ్రీవాణి భూవివాదం...
posted on Jul 14, 2016 @ 4:05PM
బుల్లి తెర నటి శ్రీవాణి, ఆమె వదిన అనూషల మధ్య భూవివాదం డైలీ సీరియల్ మాదిరిగానే నడుస్తోంది. తన ఇల్లు శ్రీవాణి కూల్చేసిందని అనూష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శ్రీవాణి కూడా తిరిగి అనూషపై తిరిగి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించిన శ్రీవాణి.. ఇల్లు కూల్చేశానని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని.. తన వదినే తనపై దాడి చేసి కేసు పెట్టిందని తెలిపింది. తన వదినతో పాటు పరిగి గ్రామస్థులు కూడా అబద్ధం ఆడుతున్నారని తెలిపింది. 'మహిళా మండలిలో తిరుగుతావు కనుక అక్కడ సపోర్ట్ నీకుంటుంద'ని ఆమె ఆరోపించింది. ఆ ఆస్తులు తన తండ్రివని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పింది. తన తరపున వచ్చిన వాటా కావాలంటే తన వదినకు రాసి ఇచ్చేస్తానని శ్రీవాణి తెలిపింది. తన వదిన తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆమె చెప్పింది.
దీనికి అనూష మాట్లాడుతూ, తన భర్త ఐసీయూలో ఉన్నప్పుడు అతనిని చూసేందుకు ఏనాడూ శ్రీవాణి రాలేదని అన్నారు. తన భర్త (శ్రీవాణి అన్న) మరణించినప్పుడు చూసేందుకు వచ్చిన శ్రీవాణి శవం దగ్గర గంటసేపు ఉండి వెళ్లిపోయిందని ఆమె తెలిపారు. భర్తకు చెప్పకుండా తన ఇంటికి వచ్చిన శ్రీవాణిని ఎలా ఆదరించానో ఆమెకే తెలుసని అనూష తెలిపారు. తన భర్తతో కలిసి శ్రీవాణి ఇంటికి వెళ్తే సూటిపోటి మాటలతో తనను వెళ్లగొట్టిందని ఆమె చెప్పారు. మరి ఇంకా ఎన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో చూద్దాం..