మద్రాస్ ఐఐటీలో జంట ఆత్మహత్యల కలకలం..
posted on Jul 14, 2016 @ 12:42PM
మద్రాస్ ఐఐటీలో జంట ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్శిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. వివరాల ప్రకారం. వర్శిటీలో భౌతిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గణేశన్ సతీమణి విజయలక్ష్మీ వారి క్వార్టర్స్ లో ఉరేసుకొని చనిపోయింది. దీంతో అందరూ విచారంలో ఉండగా.. ఆమె చనిపోయిన కొంత సమయానికే పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న మహేశ్వరి (34) అనే మహిళ కూడా తానుంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. దీంతో వర్శిటీ ఒక్కసారిగా వణికిపోయింది. ఒకే రోజు.. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఇద్దరూ వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారా.. లేక ఇద్దరి ఆత్మహత్యలకు కారణం ఏదైనా ఉందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.