ప్రియాంక గాంధీ దేనికి పనికిరాలేదా.. ?
posted on Jul 14, 2016 @ 5:01PM
త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల గురించి పార్టీలు ఇప్పటినుండే వ్యూహాత్మక రచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓ అధికార ప్రకటన చేసింది. ఇప్పటివరకూ యూపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు ఎన్నికల బరిలో దిగుతారో అన్నదానిపై పలు అనుమానాలు ఉండేవి. మొదట రాహుల్ గాంధీని ఎన్నికల బరిలో దించుదామని అనుకున్నా.. రాహుల్ అయితే గెలవడం కష్టం అని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి మొత్తుకోవడంతో.. రాహుల్ కాకుండా ప్రియాంక గాంధీని బరిలో దించాలని చూశారు.
అచ్చం ఇందిరా గాంధీ పోలీకలతో ఉంటుంది కాబట్టి అది ప్లస్ చేసుకుందామని.. ఇక ప్రజలు కూడా ఓట్లు వేస్తారని కాంగ్రస్ అనుకుంది. ఇక ప్రియాంక గాంధీనే యూపీ ఎన్నికల బరిలో దిగుతారని అనుకున్నారు అందరూ. అయితే అందరికి ట్విస్ట్ ఇస్తూ షీలా దీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షీలా దీక్షిత్ అయితే గెలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ఆమెతో చర్చలు కూడా జరిపారు. అంతే కాదు ఆమె ఇక ఫైనల్ అనుకున్నారు కానీ ఆమె మాత్రం దానిని తిరస్కరించారు. అయితే దీనికి కారణం.. ఆమెపై వాటర్ ట్యాంకర్ల కుంభకోణంపై ఆరోపణలు ఉన్నాయన్న నేపథ్యంలో వద్దన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో మళ్లీ ప్రియాంక గాంధీనే యూపీ తరుపున సీఎం అభ్యర్ధిగా బరిలో దిగుతారు అనుకున్నారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. ఆఖరికి షీలాదీక్షిత్ పేరునే కాంగ్రెస్ ఖరారు చేసింది.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీలో నిలవనున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి నుండి ప్రచార భాద్యతలు ప్రియాంక గాంధీనే నిర్వహిస్తారని అనుకున్నారు.. ఆఖరికి అది కూడా ప్రియాంకాకు దక్కలేదు.. పార్టీ ప్రచార బాధ్యతల సారథ్యాన్ని ప్రియాంకా గాంధీకి కాకుండా సంజయ్ సింగ్ కు అప్పగించారు. మొత్తానికి ప్రియాంకాకు రెండింటిలో ఏదీ దక్కకుండా అయిపోయింది. కనీసం ప్రచారానికైనా ఉపయోగించుకుంటారా.. లేకా అక్కడ కూడా లైట్ తీసుకుంటారా.. చూద్దాం..