చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు..
posted on Jul 14, 2016 @ 10:20AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితనం గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా అనుకుంటే అది నెరవేర్చేవరకూ చాలా కష్టపడతారు. ఆయన పనితనం గురించి మన రాష్ట్రం వారికే కాదు.. పొరుగు రాష్ట్రాల నేతలకు కూడా తెలిసిన విషయమే. అప్పుడప్పుడు కొంతమంది నేతలు ఆయన గురించి ప్రశంసలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదని.. చంద్రబాబు సూపర్ యాక్టివ్ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నారని.. రాష్ట్రానికి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో తనతో చాలా సార్లు సంప్రదింపులు జరిపారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా ఏ ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చరని.. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా దూసుకుపోతోందన్నారు. ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.