అదే నిజమైతే.. అకీరా ఎంట్రీ ఖాయమేనా?
సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా వారసత్వం అనేది సర్వ సాధారణం. ముఖ్యంగా సినిమా రంగంలో వారసత్వానికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్.. ఇలా సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో ఉన్నవారు తమ వారసులు సైతం సినిమా రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. అలా పరిచయమైన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలను అందుకున్నారు.